Monday, April 22, 2013

అందమే అలగదా నిన్నే చూసి !!!!

॥ ప ॥ 
నే గీసిన చిత్రం
నా పాటకు రాగం 
నాలోని ప్రాణం నీవేనా ..?
అందాల చంద్రం 
వానల్లో వర్ణం 
నాలోని ప్రాణం నీవేనా..?

నీ...  స్వరం 
నే పాడే రాగమా 
నా ప్రాణమా..?
ఏ...  క్షణం 
నను వీడకు నేస్తమా... 
ఓ ప్రణయమా... 

హృదయం పొంగే ప్రణయం ఏదో ప్రళయమై భూకంపమై 
ఐనా ఊగెను హృదయం ఓ సంద్రమై అలల ఊయలై   ॥ప॥ 


॥చ॥ 
అధరాన మెరిసేటి అందాల నవ్వు 
గగనాన విరిసేటి వర్ణం నువ్వు 
నన్నిలా ప్రళయమై 
ప్రేమలో ముంచినావు 
ఏ మాయో చేసి 
నా మనసు దోచినావు 
మాయల్లే యెదలో కదిలే కలవో.. 

॥చ॥ 
చెలియా నా కావ్యం లో నాయిక నువ్వే 
గగనాన ఆ విల్లు కి వర్ణం నువ్వో 
మిణుగురే మెరిసేలే నీ మోమున ముక్కెరై 
అందమే అలిగెనే నిన్నే చూసి 
నాలోని సగమై నాలో నిలిచిపో 

Wednesday, February 27, 2013

ఎటో వెళ్ళిపోయింది మనసు

।ప।
ఇన్నాళ్ళు నాలో లేని ఏదో గిలిగింత
నువ్వొచ్చే నిముషం కోసం వేచే మనసంతా
ఎంతో వింతా
ఈ దిగులంతా
ఎన్నడు లేని ఈ పులకింత
నేనిన్ను కలనైన కలగన్నానా ?
నిదురంటు పోకున్నాను
కలలోనే జీవిస్తూ ఉన్నానా

।చ।
ఉన్నట్టుండి నేనే నవ్వేస్తా
నా చుట్టూ లోకం ఉందని మరిచిపోతుంటా ..
గుండెల్లోన ఏదో దిగులంట
సంద్రం లో భూకంపం లా ఊగె మనసంతా ..
ఏం మాయ జరిగిందో ఈ హాయి బాగుంది
నీతోడు నాకివ్వవే !!!
నిన్న నేడు రేపు
నా శ్వాస ఆగే వరకు
నా గుండె పాడే పాటై
నేనూపిరి తీసే శ్వాసై
కడదాకా తోడుంటావా
నా వెంటున్డే నీడవ్తావ
నువ్వు నాలోన నా సగము అవ్తావా ??

Tuesday, February 26, 2013

"ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే "

"ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే "
అన్న మాట మరిచావేమో అందాల కన్నయ్య.

యశోదమ్మ కొంగు బంగారమయ్యావా ..?
నందునింట నవ్వుల నగమువయ్యావా ..??
ఎక్కడున్నావో మరి? మాట ఇచ్చిన ముర అరి..
నూరు తప్పులెన్ను తప్పు చేస్తున్నావో మరి!!

జరిగింది వస్త్రాప హరణం,
నిన్ను పిలవలేదంటు మిన్నకున్నావా??
చూస్తూనే మరణాల దారుణం,
రాళ్ళ వర్షము కాదంటూ కదలకున్నావా..?

ఎక్కడయ్యా ఓ హరీ.. అనివార్యమని తెలిసి,
నీ రాక కనలేక కన్నీళ్ళలో మునిగి,
తొలిసారి నీ నామ దూషణము చేసితి గాని
మరి కక్ష లేదయ్యా కరుణించు కన్నయ్య !!!

------
విజ్రుమ్భిస్తున్న ఉన్మాదం ప్రశ్నిస్తోంది :
ఏడి ? ఎక్కడ రా ? నీ హరి దాక్కున్నాడే రా భయపడి,
బయటకు రమ్మనరా.. ఎదుటపడి నన్ను గెలవగలడా ?? బలపడి



Monday, January 21, 2013

నేను ఇలా క్రేజీ అయిపోతాను..


ఆండ్రాయిడ్ ఆప్ వా ?
స్టీవ్ జాబ్స్ ఆపిల్ వా ?
సమ్మర్ లో రైన్ వా ?
రైన్ వెనక రెయిన్బో వా ?

హచ్ వాడి కుక్కవా ?
8 పి. యం. కిక్కు వా ?
లాస్ట్ బాల్ లో సిక్స్ వా ?
టి ట్వంటీ కప్ వా?

అసలెందే నీ గొడవ ?
నేను ఇలా క్రేజీ అయిపోతాను నీకోసం..

Tuesday, January 15, 2013

ఒక్కోసారి

ఒక్కోసారి జేబులో చేతులు పెట్టుకుని ఎక్కడికో సీరియస్ గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను ఎక్కడికో తెలిదు,
పెదవులు నవ్వుతున్నా, కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి
ఎలానో తెలిదు,
పదిమంది ఉన్న ఉంటరిగా ఉంటా
ఎందుకో తెలీదు,
ఒక్కోసారి నిన్ను కూడా మరిచిపోతాను (అతిశయోక్తి) ఎలా సాధ్యమో తెలీదు,

నిరీక్షణ పాటలంటే నీకిష్టం, నీకోసం నిరీక్షణ నాకిష్టం
చల్లని సాయంత్రం చినుకులు పడితే,
పక్కన నువ్వున్నావేమో అని చెయ్యి తడిమింది,
కెరటాలు కాళ్ళని చల్లగా తడిపితే,
పక్కనే నీ పాదం ఉందేమో అని వెతికింది,
నడిరాతిరి నిదుర దోబుచులాడితే,
నీతో మాట్లాడేందుకు మనసయింది,

నవ్వు, నువ్వు ఆడే దోబూచులలో 
ఏదో వెలితి ఏదో ఆనందం

Sunday, January 6, 2013

నీ తోడు కావాలి..!

దహిస్తోంది నన్ను నీ మౌనం.. నిన్నే స్మరిస్తున్న గుండెకు ఇది భారం..
కన్నీటి వెచ్చదనం రెప్పలకు చేసే గాయం.. నీ  ఊహలతో ఊపిరికి వలలు వేసే ప్రాయం...

గతిస్తున్నా..! నా ప్రాణం.. స్మరిస్తోంది నీ పాశం..
స్తుతిస్తోన్న ఈ శ్లోకం.. జ్వలిస్తున్న నా శోకం ..

కురుస్తున్న నా కవనం.. స్పృశిస్తోందా? ఈ పవనం..
మరుస్తున్న నా స్వగతం.. ముగుస్తోందా? నా గమనం..

ఒంటరైన  ఒక్కోక్షణం నీ తోడు కోరింది..
పదుగురిలో ప్రతిక్షణం నీ జాడే వెతికింది..