Monday, October 31, 2016

విజయం చేసే శబ్దం కోసం మౌనం గానే పయనించు

​​
ఎవరెవరో వస్తారు 
ఎవరెవరో వెళ్తారు 

జ్ఞాపకాలు ఇస్తారు 
గాయాలు కూడా చేస్తారు  

భయపడకు 
బాధ పడకు 

నీ లక్ష్యం నీకుంది 
నీ గమ్యం నీకుంది  



ఎవరో ఏదో అనుకుంటారని అనుకోకు, వాళ్ళ కోసం ఆగిపోకు 
ఒకరోజు నీకు నువ్వు సమాధానం చెప్పుకోవాలి అని మర్చిపోకు 


ముళ్ళైనా, పూలైనా, 
ఎండైనా, కొండైనా, 
అదరకు, బెదరకు, 
అలవకు, అరవకు... 

విజయం చేసే శబ్దం కోసం మౌనం గానే పయనించు 
ఎదిగిన క్షణమున కిందికి చూస్తే  అందరు నీకన్నా చిన్నే 
ఎగిరిన పక్షికి ఎదిగిన మనిషికి పరిమితి కాగలదా మిన్నే  

Thursday, May 12, 2016

పాత డైరీలో పేజీలు

ఇలాంటివి అసలు రాయొద్దు అనే అనుకుంటాను కాని రాయకుండా ఉండలేకపోతాను. భహుశా ఇదే లాస్ట్ కావొచ్చు. 

చాలా మంది ని చూస్తున్నా కదా ఎందుకో కలుస్తారు, నడుస్తారు, ఏడిపిస్తారు, వెళ్ళిపోతారు... They Just Move On

కొందరు మళ్ళీ వద్దాం అనుకుంటారు, వస్తారు 
కొందరు రాలేకపోతారు 
కొందరు రాలేని చోటుకు వెళ్ళిపోతారు 

అందరి లో కామన్ గుణం ఒక్కటే వాళ్ళ గురించి మనం ఏమి ఆలోచిస్తున్నామో తెలియకపోవడం 

నేను నేను గా ఉన్న కాలాన్ని చెప్పమంటే అమ్మ నుండి నాన్న వరకు అని చెప్పోచ్చేమో... నాన్న చెప్పేవారు మనిషి ఒంటరి వాడు. అది మర్చిపోయినప్పుడే బాధ పడడం మొదలవుతుంది అని. నేను వినలేదు అనుకో.. 

అయినా కళ్ళ ముందే ఇంత మంది నవ్వుతూ కనిపిస్తుంటే ఒక్కడినే అని ఎందుకు అనిపిస్తుంది అంతా నావాళ్ళే అనిపిస్తుంది.  కానీ అనుభవం చెప్పే పాఠాలు బాగా అర్థం అవుతాయి జీవితం ఇచ్చే గాయాలు బాగా గుర్తుంటాయి..  

మళ్ళీ వద్దాం అని వెళ్ళిపోయావు  గాని కల్సి పోరాడాలని ఎందుకు అన్పించలేదో ?
ఒక్క పలకరింపు అంత దూరం లో ఉన్నా "తను ఎందుకు వెళ్ళిపోయిందో ?"
కలిసి ఉండలేము అంటూనే కొందరు కలుస్తూనే ఉంటే కలిసి ఉండాలని ఉన్నా కూడా వీరు ఉండలేకపోవడం ఏమిటో?

నీటిలోని తామరాకు నీటిని తాకలేనట్లు 
ఎవరికీ ఏమీ కామేమో మనం 

ఈసారి ఐన నా కథలో అమ్మ ఉండాలి అనుకుంటున్నాను. 

మేఘం, చినుకులు దూరం అయితే వర్షం అవుతుంది... 
నిశీధి, నిద్ర దొంగాట ఆడుకుంటే నేను రాసే కథలు పుడతాయి... 

ఇంక ఈ పాత డైరీ తో పని లేదు అనుకుంటా... జ్ఞాపకాలతో పాటే అటకమీద పెట్టేస్తా... 

Monday, May 9, 2016

తన కోసం నేను రాసిన పాట

నా గతము లోని నీకు ఈ పాట అంకితం. 
ఇది దైవ నిర్ణయమో నీ నిర్ణయమో నాకు తెలియదు.
~ బిందు కు నాని 


ఔనని, కాదని ,
మనమనేదే లేదని... 
నువ్వని, నేనని,
వేరుగా ఉన్నామని... 
నా కంటి పాప లో చంటి పాప లా నిన్ను నూరేళ్ళు సాకాలని 
కలగన్న కనులకి నిదుర దూరమై గుండె గాయమై మిగిలానని 
విధి రాతో....  చెలి గీతో....  నువ్వు లేని లోకం లో బ్రతకనీ బ్రతకనీ... 

నువ్వు అంటే నా గతము లోని చిరునవ్వు ఉన్న నేనే కదా 
నువ్వు లేని ఈ నేను అంటే నా నవ్వు లేని నేనే కదా 

గతము లోని ప్రతి చిన్న జ్ఞాపకం కరిగిపోయే కన్నీరు గా 
గుండె చాటున ఉన్న రూపమే దూరమైంది నీ నీడగా 

నా కంటి పాప లో చంటి పాప లా నిన్ను నూరేళ్ళు సాకాలని 
కలగన్న కనులకి నిదుర దూరమై గుండె గాయమై మిగిలానని 
విధి రాతో....  చెలి గీతో....  నువ్వు లేని లోకం లో బ్రతకనీ బ్రతకనీ... 

Sunday, April 17, 2016

మళ్ళీ ఎందుకు ఇలా ??


ఎవరిని ప్రేమించినా నవ్వించాను 
ఎవరు వెళ్ళిపోయినా భరించాను 
ఎవరు చనిపోయినా తలొంచాను 

నేను ఒంటరిగా పోరాడుతున్నాను అనుకున్నప్పుడు ఎవరు లేరు.. 
ఒంటరి అయిపోయినప్పుడు ఎవరు రాలేదు..  
నేను ఇచ్చిన నవ్వులు తీసుకుని వెళ్ళిపోయారు గాని వెనక్కి తిరిగి నా కళ్ళలోకి కూడా కొందరు చూడలేదు..

ఒంటరిగా అడుగులు వెయ్యాలనేది విధి రాత అనుకున్నప్పుడు 
ఈ కొత్త బంధాలు ఎందుకో అర్థం కావట్లేదు 

వారి ఆనందం కోసం నేను ఎందుకు మళ్లీ నన్ను నేను కోల్పోవాలి ?
మన అనుకున్న వారి దగ్గర మన ఎమోషన్స్ చూపిస్తాం 
కాని నాకు ఆ అవసరం లేదు కదా ?
అందరి ముందు నవ్వుతు ఉంటే సరిపోతుంది 

ప్రపంచమే పరాయి లా కనిపిస్తున్నపుడు 
నేనెందుకు నాలాగా ఉండాలి ?
నవ్వుతు ఉంటే సరిపోతుంది కదా ?




Tuesday, February 16, 2016

వెళ్ళి పోమాకే అంటూ (తను వెళ్లిపోయింది)

వెళ్ళి పోమాకే అంటూ 
బ్రతిమాలానే నిన్ను 
నిన్నల్లోనే  నిన్ను వదిలేయ్ లేక 

పో పో అంటూ నన్ను
దూరం జరిగి నువ్వు
చేసేశావే నన్ను ఒంటరి నన్ను 

దూరం పెరిగే కొద్ది 
కాలం గడిచే కొద్ది 
నేనే నువ్వయ్యాను నువ్వే గుర్తొచ్చి 

నువ్వే లేని క్షణము 
నాతో నాకే రణము 
గెలుపు ఎటు వైపైనా ఓటమి నాదే 

Friday, February 5, 2016

తను వెళ్లి పోయింది


తను వెళ్లి పోయింది ~ నా మనసు లోంచి 


ఔనని, కాదని ,
మనమనేదే లేదని... 
నువ్వని, నేనని,
వేరుగా ఉన్నామని... 
నా కంటి పాప లో చంటి పాప లా నిన్ను నూరేళ్ళు సాకాలని 
కలగన్న కనులకి నిదుర దూరమై గుండె గాయమై మిగిలానని 
విధి రాతో....  చెలి గీతో....  నువ్వు లేని లోకం లో బ్రతకనీ బ్రతకనీ... 

Thursday, January 21, 2016

నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం

అమ్మ నాన్న గురువు దైవం అన్నారు... 
అమ్మ నాకు తెలియని దైవం, నాన్న నాకు తెలిసిన గురువు... 


చిన్నప్పటి నుండి స్నేహం అంటే అంత ఇష్టం పెరగడానికి కారణం ఆయనే 
వాళ్ళ ఫ్రెండ్స్ ని ఎగ్జాంపుల్ గా చూపించి నా ఫ్రెండ్స్ నాకు గొప్పగా కనిపించేలా చేసే వారు,
నా ఫ్రెండ్స్ అనగానే ప్రత్యేకం గా చూసే వారు....  
నాకు ఊహ తెలిసినప్పుడే చెప్పేవారు మనం ఫ్రెండ్స్ అని...
నాకు పరిచయం అయిన మొదటి ఫ్రెండ్ మా డాడ్.. 
నాకు పరిచయం అయిన మొదటి ఎమోషన్ ఫ్రెండ్...  

నే కవితలే రాసినా,
పిచ్చి గీతలే గీసినా,
భలే ఉంది మళ్ళీ గీయరా అని ప్రోత్సహించిన
నాన్నకి ప్రేమతో అంకితం 

నే మాటలే తూలినా,
చిన్న తప్పు నే చేసినా,
ఒక్క చూపుతో నన్ను మార్చిన పాటానివి నువ్వే 

నన్ను నువ్వు విడిచినా 
జ్ఞాపకం గా మారినా 
కన్నీళ్లు ఆపుకొని నేను నవ్వే ప్రతి అబద్ధపు నవ్వు నువ్వే 

ఈ అందమైన రంగుల లోకాన 
వేలు పెట్టి నడిపించలేనంటు 
నీడ గా మారి కనిపించకుండా పోయిన దీపానివి నువ్వే 

నువ్వు దూరమైనా....
నేను ఒంటరైనా....
ఇకపై నా ప్రతి క్షణం నీకే అంకితం 

ఎందుకంటే, 
నాకు నీ మీద ఉన్న కోపం మాత్రమే నాకు తెలుసు 
నాన్న మీద ఉన్న ప్రేమ నాన్న వెల్లిపొయాకే తెలుసుకున్నాను  
అందుకే,
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం