Monday, December 28, 2015

జ్ఞాపకాల చినుకులు

మిత్రమా !!!

కాలం తో పరుగు లు తీస్తూ,
కలానికి విశ్రాన్తినిచ్చాను...
అప్పుడప్పుడు ఆగి వెనక్కి చూస్కునే నాకు గుర్తొచ్చేది నువ్వే,
సంపాదనలో మునిగి స్నేహితులను,
ఆప్తులతో అలసి ఆప్తమిత్రులను  మరిచిపోకు..

నీ కోసం చూసే మిత్రులకు ఒక పలకరింపు చాలు..
నింపేసుకుంటారు చిరునవ్వుల రంగులను పెదాల నిండా..
చల్లేసుకుంటారు జ్ఞాపకాల చినుకులు గుండెల నిండా .. :)

నీ '''నేస్తం...

Saturday, October 24, 2015

నింగి నేల కలిసే చోట


​తొందరలో చూసానా? అని పదే పదే చూసాను,  ​
​చూపులు కలపని కనులను చూస్తూ కలలను కంటూ నిలిచాను. 

మాటలు చాలని అందం నీదని పాటలు ఎన్నో రాసాను,
నా గుండెల్లోనే దాచాను. 

మాటల్లో చెప్పలేకనే  ఎన్నో మాటలు దాచాను,
కొంచెం దూరం అయ్యాను. 

గగనం చేరిన తారకలా నువ్వే దూరం ఐపోతే,
కలలతో చేసే యుద్ధం లో నిదురకి దూరం అయ్యాను.. 

కన్నుల ముందు నువ్వు లేక కలిసే దారే కనపడక,
ఒంటరిగానే నిలిచాను, నేనొంటరిగానే వగచాను. 

​ఇదిగో ఇదిగో నా గుండెల్లో నవ్వుల సవ్వడి వినిపిస్తోందా?
చప్పుడు చెయ్యని తలుపుల (రెప్పల)  వాకిట నీ నవ్వుల వల్లిక కనిపిస్తోందా?

జ్ఞాపకాలని దాపెట్టేసా, మనసు మాటకి ఊ కొట్టేసా.. 
మనసు మార్చారా ఓ పరమేశా, 
(తనని కలపరా ఓ జగదీశా.. )

చిగురుటాకు పై వాన చినుకులా,
సల్ల కుండ పై వెన్న నురగలా ,
వాన నీటి పై బొమ్మ పడవలా,
'చిన్ని' పాప లా నన్ను చేరగా... 
నేను నేనయ్యాను.  - - - 

Wednesday, September 30, 2015

కల అనుకోనా..?


గమ్యమే తెలియని ప్రయాణం,
నీకోసం ఎదురు చూసిన సమయం..
కాలమే ఆగింది కన్నీరొకటి జారింది,
నీ గొంతు విన్న ఆ నిమిషం..
సంద్రమై పొంగింది మనసు సంతోషం తో..
ఎదురు చూపులు ముగిసిన ఆనందంలో..

వరమనుకోనా??
కునుకల్లే ఎదురొచ్చి ఒడిలోన లాలించే కలవనుకోనా?

నిజమనుకోనా??
చిరునవ్వే ఎదురొచ్చి కన్నీళ్ళను తుడిచేసే భ్రమ అనుకోనా?

గతమనుకోనా??
కడ దాకా నాతో నడిచే కనిపించని దారులు వెతికే జతవనుకోనా..

చిరుగాలై దరి చేరావే,
చలి గాలై గిలి పెట్టావే,
హరి విల్లుని తలపించేల,
వర్ణాలె కురిపించావే

వరమనుకోనా?? నిజమనుకోనా?? గతమనుకోనా??
లేక

ఇదంతా
కల అనుకోనా..?

Wednesday, September 16, 2015

జ్ఞాపకం కూడా చెరిగిపోతుంది.. కొందరి స్నేహం లాగా

ఈ ప్రపంచం లో ప్రేమ అంటూ ఏదీ లేదు 
ఉన్నది ఒకటే... నమ్మకం... 

ప్రతి మనిషి కోరుకునేది, 
ప్రతి బంధం కోరుకునేది, నమ్మకం... 
మనకి కష్టం వచ్చినపుడు కనపడతారని,
కన్నీళ్ళొచ్చినపుడు కళ్ళ ముందు ఉంటారని,నమ్మకం... 



ఆ నమ్మకాన్ని ఇవ్వలేకపోయినప్పుడు, 
బంధం బలహీనం అవడం మొదలవుతుంది... 
మనసు ఆశ పడడడం మానేస్తుంది.. 
బాధ పడడం మొదలవుతుంది.. 
బాధని మర్చిపోయే ప్రయత్నం లో 
నెమ్మదిగా ఒక బంధం జ్ఞాపకం అయిపోతుంది... 

కొన్నాళ్ళకి జ్ఞాపకం కూడా చెరిగిపోతుంది.. కొందరి స్నేహం లాగా...

కన్నీళ్లు ఎప్పుడూ గుండెల్లో దాచుకోవాలి, 
చిరునవ్వు ఎప్పుడూ పెదవి పై ఉంచుకోవాలి, 
జీవితం నాకు నేర్పింది ఇదే 

Wednesday, August 19, 2015

నడవాలి నాతో నేను

నడవాలి నాతో నేను 
నా తోడు ఇకపై 'నేను'
అందరిని ఓదార్చాను 
ఒంటరిగా నిట్టుర్చాను... 

ఎవ్వరికి ఏమి కాను 
నాకంటూ ఉన్నది 'నేను'
ఎన్నో నవ్వుల్ని కోరాను 
కన్నీటి జడిలోన మిగిలాను.. 

ఎన్నో కలలెన్నో కన్నాను 
నేడు నిదురే పోకున్నాను 
ఎన్నో హృదయాలు కదిపాను 
కాని ఒంటరిగా మిగిలాను 

అమ్మంటూ గురుతే లేదు 
నాన్నింక రానే రాడు 
నడవాలి నాతో నేను 
ఇకపైన సోలో 'నేను' ... 

Thursday, July 23, 2015

సీతా కోక చిలుక


ఒక సీతా కోక చిలుక ఎగురుకుంటూ వెళ్తుంది 
ఒక చక్కటి పువ్వు మీద వాలింది 
మృదువుగా మాట్లాడింది 
మధురాన్ని తాగింది 
వీడుకోలు పలికింది 
చిరునవ్వుతో ఎగిరింది 

ఆ కొద్దిపాటి పరిచయానికే మురిసిన పువ్వు 
తన కొత్త నేస్తం కోసం రోజు ఎదురు చూసేది 

ఆ సీతా కోక చిలుక ఎగురుకుంటూ వెళుతోంది 
ఇంకొక పువ్వుపై వాలింది, నవ్వుతు మాట్లాడింది, వీడుకోలు పలికింది 

మొదటి పువ్వు ఇంకా ఎదురుచూస్తూ ఉంది 
ఒకరోజు ఎక్కడ తేనె దొరకని చిలుక  మొదటి పువ్వు దగ్గరకు వచ్చింది 
నవ్వుతు మాట్లాడింది తేనె లేదని తెలిసి మెల్లగా వెళ్లిపోయింది 

మళ్లీ పువ్వు ఎదురు చూడడం మొదలు పెట్టింది 
ఒకరోజు భయంకరమైన గాలి వీచింది 
చిలుక పట్టు తప్పింది, ఒక కొమ్మను పట్టింది, నెమ్మదిగా జారింది,
పువ్వు దగ్గరకు చేరింది.. 

పువ్వు ఆనందానికి అవధులు లేవు .. 
కుదిరినంత ఆసరా అందించింది.. 
చాలాసేపు మాట్లాడింది.. 
వర్షం తగ్గింది, చిలుక ఎగిరింది... 

ఇంకా ఎదురు చూస్తే పువ్వుది అమాయకత్వం అంటారు... 

Thursday, June 25, 2015

మనకెదురయ్యే ప్రతి మనిషి

నా జీవితం లో ఎదురయ్యే ప్రతి సంఘటనా ఎవరో ఓపికగా రాసిన కవిత లా ఉంది.. 
ఎదురయ్యే ప్రతి పాశం ప్రాస లా ఉంది, 
ఏదో చిన్న ఆశలా ఉంది.  

నాకు ఎదురయ్యే ప్రతి రోజు ఎవరో కన్న కలలా ఉంది.. 
ఇదంతా భ్రమలా ఉంది, 
కొంచెం భయం గా ఉంది. 

ఎదురయ్యే ప్రతి నవ్వు ఎవరో గీసిన చిత్రం లా ఉంది.. 
విచిత్రం గా ఉంది, 
ఎంతో చక్కగా ఉంది.  

నా ప్రపంచం ఎవరో చెక్కిన శిల్పంలా ఉంది.. 
ఒక కళలా ఉంది, 
మాయ లా ఉంది. 

మనకెదురయ్యే ప్రతి మనిషితో మనకి సంబంధం ఉంది.. 
అనేది నిజం లా ఉంది,
నిజం గా ఉంది. 

నీ పరిచయం దేవుడు రాసిన కథలా ఉంది.. 



Wednesday, May 13, 2015

నువ్వొచ్చిన కొత్తలో

నువ్వొచ్చిన కొత్తలో నాలోకం వేరేలా ఉంధి...
నిను కలిసిన వింతలో ఆ మైకం చాలనే బాగుంధి...


మెల మెల్లగ నిదురలోకి నను జార్చిన మాటలు మదిలో ఉండి...

చల చల్లని గాలిలా నను తాకిన నవ్వింకా గుర్తుంది..

చిటపట చిరు జల్లులా నీతో జరిగిన గొడవేమైంది?

మునుపెరుగని హాయిలా నీ స్నేహం మధురం ఎంతో బాగుంది...   

Saturday, May 9, 2015

ఒక్క క్షణం

ఒకడు నీతో గొడవ పడుతున్నాడు అంటే,
నీతోనే తన టైం గడపాలి అనుకుంటున్నాడు అంటే,
తను తనలా ఉండాలి అనుకుంటున్నాడు అంటే,
వేరే వాళ్ళతో నిన్ను చూడలేకపోతున్నాడు అంటే,
మర్చిపోవాలి అని ప్రయత్నిస్తున్నాడు అంటే,


ఒక్క క్షణం ఆలోచించు వాడికి నువ్వంటే ఇష్టమేమో ?

Thursday, April 30, 2015

Oneside Love

తను చూస్తుందో లేదో తెలీదు
నా గురించి ఆలోచిస్తోందో లేదో తెలీదు 
నన్ను ప్రేమిస్తుంది అన్న నమ్మకం లేదు 
అయినా 
గోరంత ఆశ తో 
కొండంత ప్రేమతో 
తనకోసం ఎదురు చూస్తూనే ఉంటాను 

Friday, March 27, 2015

​కలం నా నేస్తం


నా కలం నా నేస్తం 

నేను బాధ గా ఉంటే రాత అయిపోతుంది 
నవ్వుతూ ఉంటే  పాట అయిపోతుంది 
నువ్వు గుర్తొస్తే ఇలా కవిత అయిపోతుంది 

ఒక్కోసారి నీ బొమ్మ అయిపోతుంది 
నీ బొమ్మకు బొట్టు అయిపోతుంది 
మెడ లో పుస్తె అయిపోతుంది 

నేను ఒంటరిగా ఉంటే నువ్వు అయిపోతుంది 
నీతో ఉంటే నా నవ్వైపోతుంది 
నిన్నే ప్రేమించే నేనైపోతుంది 

Wednesday, February 18, 2015

జ్ఞాపకాలు

గడిచిన కాలం లో జరిగిన విషయాలే ,
జారుతున్న కలం లోని అక్షరాలు... 

నడిచిన దూరం లో కరిగిన దూరాలే,
తడిసిన కళ్ళలో జారిన స్నేహాలు... 

నిజాలు చేదుగా ఉంటాయి.. 
జ్ఞాపకాలు భారం గా ఉంటాయి...