Wednesday, February 27, 2013

ఎటో వెళ్ళిపోయింది మనసు

।ప।
ఇన్నాళ్ళు నాలో లేని ఏదో గిలిగింత
నువ్వొచ్చే నిముషం కోసం వేచే మనసంతా
ఎంతో వింతా
ఈ దిగులంతా
ఎన్నడు లేని ఈ పులకింత
నేనిన్ను కలనైన కలగన్నానా ?
నిదురంటు పోకున్నాను
కలలోనే జీవిస్తూ ఉన్నానా

।చ।
ఉన్నట్టుండి నేనే నవ్వేస్తా
నా చుట్టూ లోకం ఉందని మరిచిపోతుంటా ..
గుండెల్లోన ఏదో దిగులంట
సంద్రం లో భూకంపం లా ఊగె మనసంతా ..
ఏం మాయ జరిగిందో ఈ హాయి బాగుంది
నీతోడు నాకివ్వవే !!!
నిన్న నేడు రేపు
నా శ్వాస ఆగే వరకు
నా గుండె పాడే పాటై
నేనూపిరి తీసే శ్వాసై
కడదాకా తోడుంటావా
నా వెంటున్డే నీడవ్తావ
నువ్వు నాలోన నా సగము అవ్తావా ??

Tuesday, February 26, 2013

"ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే "

"ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే "
అన్న మాట మరిచావేమో అందాల కన్నయ్య.

యశోదమ్మ కొంగు బంగారమయ్యావా ..?
నందునింట నవ్వుల నగమువయ్యావా ..??
ఎక్కడున్నావో మరి? మాట ఇచ్చిన ముర అరి..
నూరు తప్పులెన్ను తప్పు చేస్తున్నావో మరి!!

జరిగింది వస్త్రాప హరణం,
నిన్ను పిలవలేదంటు మిన్నకున్నావా??
చూస్తూనే మరణాల దారుణం,
రాళ్ళ వర్షము కాదంటూ కదలకున్నావా..?

ఎక్కడయ్యా ఓ హరీ.. అనివార్యమని తెలిసి,
నీ రాక కనలేక కన్నీళ్ళలో మునిగి,
తొలిసారి నీ నామ దూషణము చేసితి గాని
మరి కక్ష లేదయ్యా కరుణించు కన్నయ్య !!!

------
విజ్రుమ్భిస్తున్న ఉన్మాదం ప్రశ్నిస్తోంది :
ఏడి ? ఎక్కడ రా ? నీ హరి దాక్కున్నాడే రా భయపడి,
బయటకు రమ్మనరా.. ఎదుటపడి నన్ను గెలవగలడా ?? బలపడి