Saturday, February 27, 2010

మనసంతా నువ్వే..

వేకువనే వెచ్చని కిరణం ఒకటి పలకరించింది
ఎదురుగ నిన్ను చూసి మనసు ఉప్పొంగింది..
ఎందుకు ప్రియా ఇంత ఆలస్యం చేసావు
నీ నవ్వు చూడకుండా నా రోజు మొదలవదని తెలియదా నీకు..
వేకువనే నా చెయ్యి పట్టుకుని సూర్యుడిని స్వాగతిస్తూ
నువ్వు చెప్పే ఊసులు వింటుంటే
ప్రతి క్షణం జీవితంలో ఆనందమే కదా...
కానీ తెల తెల వారగానే నాలో భయం మొదలవ్తుంది..
జీవితాంతం ఊహ ఐనా ఫర్వాలేదు ఇలానే గడిపాలని ఉంది..
నాకోసం తెలవారక మానదు కదా..
నా ఈ అందమైన కల చెదరక మానదు కదా...
సంతోషాన్ని ఇచ్చేది ఒక్కటే కలలో కూడా నిన్ను మరచిపోవడం లేదు అనే నిజం.
ప్రియా ఈరోజు కూడా తెల్లారి పోయింది నీ రాక కోసం ఎదురుచూస్తూ ఈ జీవం లేని క్షణాలను గడిపేస్తా..
ఊహలో అయినా సరే నువ్వు దగ్గర ఉంటేనే నా క్షణాలకు విలువ..
నువ్వు లేని నిజం కూడా అబద్ధమే నాకు...

కనుమరుగు ఐనా కళ్ళలోనే ఉన్నావు...

ప్రేమతో నీ వంశీ




గుండె చప్పుడు విన్నప్పుడల్లా అమ్మ గుర్తొస్తుంది నాకు...
కేవలం మనకోసం మాత్రమే కదా క్షణం తీరిక లేకుండా కష్టపడుతుంది ...
చాలా సార్లు మనం మరచిపోతూ ఉంటాం...
గుండె విశ్రమించిన క్షణం మనమే ఉండమని..
ప్రేమకు నిజమైన అర్ధం తనే కదా..
అయినా మనకు మనల్ని ప్రేమించే వారిని పట్టించుకునే తీరిక ఉండదు కదా!
ఏమైనా కానీ అమ్మ ఒడిలో ఒక్క క్షణం సేద తీరితే చాలు ...
(ఈ వాక్యాన్ని ఎలా పూరించాలో తెలియడం లేదు ఎందుకంటే ఎంత చెప్పినా తక్కువే కదా)
నా గుండె చప్పుడు వింటుంటే గుర్తొచ్చింది
మా అమ్మ కోసం నేనేమి చెయ్యలేదు ...
నీ ఒడిలో ఒక్క క్షణం సేద తీరి నీకు మురిపెముగా ఒక ముద్దు ఇవ్వాలనుంది అమ్మా...
ఇది చదివాక ఒక్కరికైన వెంటనే వాళ్ళ అమ్మ గుర్తొస్తే నేను నీకు బహుమానం ఇచినట్లే..

పండగకి నువ్వు వండిన పిండి వంటలపై ఒక పొగడ్త కోసం,
ఊరుకి వెళ్తున్నప్పుడు నేను టాటా చెప్తానేమో అని కనుమరుగు అయ్యేంతవరకు నువ్వు చూసిన ఎదురు చూపు మరచిపోలేను కదా అమ్మా ...
అయినా నీకు తెలియదా నాకు నువ్వంటే ఎంత ప్రేమో వ్యక్త పరచాల్సిన అవసరం లేదు కదా... అనుకున్నాను
కానీ చెప్పాలనిపిస్తోంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని...

Thursday, February 25, 2010

నిశీది లో నేను


నిశీది లో నేను నడకను మొదలెట్టాను...
సంద్రంలో ఈదుతున్నానో... ఎడారిలో నడుస్తున్నానో తెలీదు...
దాహం మాత్రం ఒక్కటే...
ముళ్ళ దారి అని భయపడలేదు...
ఎందుకంటే ఈ దారిలో నేనే మొదట కాదు కదా...
నా ముందు వెళ్ళిన వారి అడుగులు కనపడక కలవరపడుతున్నా ...
ఎందుకంటే నా వెనుక వచ్చే వారికి కూడా మార్గం కనపడదేమో అని ...
నేనే చివరి వాడిని కాదు కదా...
ఎండ మావి కోసం ఎదురు చూడడంలేదు ...
దాహం తీర్చలేని సంద్రం గురించి ఆలోచించడం లేదు...
ఎవరో చెప్పినట్లు గమ్యం కాదు..., నాపయనం అంటే నాకిష్టం ...
అలాంటి పయనం లో నాకు తోడు కావాలి...
కొట్టిన పిట్టని అందరికి పంచగలిగే వేట గాడు కావాలి ...
ఎక్కుపెట్టివ అమ్ముని వదలడం నేర్పగల ఓర్పు ఉండాలి...
భయం వలన కాదు మార్గం కోసం ఆ తోడు...
మార్గం అంటూ కనిపిస్తే ముళ్ళ బాట ఐనా చదును చెయ్యొచ్చు ...

బాటసారిగా మొదలైన నా పయనం లో గమ్యం చేరగలనా...
చేతిలో ఉన్న దీపం ఆరిపోయేలోపు దారి చూపగలనా
చెరిగిపోకుండా బలమైన అడుగులు వెయ్యగలనా.

Tuesday, February 23, 2010

విత్తు మొలకెత్తడం మొదలెట్టగానే పందిరి వేస్తే ...
పక్కవారి గోడ మీదకు పాకదు...
కొత్త పుంతలు తోక్కదు...
నేటి బాలలే రేపటి పౌరులు కదా...

Monday, February 22, 2010

నాకు తెలిసి


ప్రేమ అంటే పెళ్లి కాదు..
ఇద్దరు కలిసి జీవించడం పెళ్లి ప్రేమించడం ప్రేమ.
ఈ ప్రేమ తల్లి పిల్లాడికి ఇచేది కావచ్చు నాన్న బిడ్డకు ఇచేది కావచ్చు.
ఉపాధ్యాయుడు విద్యార్ధి కి ఇచేది కావచు, నీకు నీ నేస్తం ఇచేది కావచ్చు.

కొందరు తమని ప్రేమిచే వారిని మాత్రమే ప్రేమిస్తారు.
ఇంకొందరు తమను ప్రేమిస్తారు అనుకునే వారినే ప్రేమిస్తారు.
ఇచ్చి పుచ్చుకోవడం వ్యాపారం కదా.

తల్లి కి తెలియదు తన బిడ్డకు తనపై ప్రేమ ఉందొ లేదో..
ఆకలితో అక్కున చేరినా భయం తో దగ్గర చేరినా ప్రేమగా హత్తుకుంటుంది.
భవిష్యతు లో తనను ప్రేమిస్తాడో లేదో అని ఆలోచించదు కదా...
అందుకే నేమో ప్రేమ గురించి ఎవరు మాట్లాడినా ముందు అమ్మ తో మొదలు పెడతారు.
ప్రేమ పేరుతో వంచిచే వారు ప్రేమ పేరు తో హింసించే వారు ఒక్కసారి ఆలోచించండి
నీలో ఉన్నది నిజం గా ప్రేమైతే ద్వేషానికి చోటేది...
మనం మనుషులం మనుషులు గానే ఉందాం ...
ఒక్కసారి అమ్మను గుర్తు తెచ్చుకుంటే చాలు ఎంతటి మృగం అయినా మనిషి అవ్తుంది కదా..

ఇంకా చాలా ఉంది కానీ అసందర్భం గా తోచింది అందుకే సరిపెడుతున్నాను.

Thursday, February 18, 2010

నువ్వు లేక నేను




నువ్వు లేక నేను లేనని నీకు తెలుసు,
క్షణ క్షణం కన్నీటి కెరటం గుండెను తడి చేస్తూ కరిగించేస్తుంటే,
నువ్వు నన్ను మర్చిపోయావనే నిజాన్ని మరచిపోలేకపోతున్నాను...

నీ జ్ఞాపకాల మంటలలో మనసు కాలిపోయింది..
ఐనా దానికి నిన్ను ప్రేమించడం మాత్రమే తెలుసు...

ధైర్యం చేప్పడానికని దగ్గరకు తీసుకున్న నీ చేతి స్పర్శ నా చేతిలో ఉంది,
నీ కళ్ళలో ఒకనాడు జారిన నీటి బొట్టు పదిలంగా నా గుండెలో ఉంది,
పదే పదే నువ్వు పిలిచిన నా పేరు నా మనసు లో ఉంది,
నిన్ను ఒక్కసారి చూడాలని ఆశగా ఉంది,
కానీ నీ రూపం మాత్రం కళ్ళు తుడుచుకున్నా కనిపించడం లేదు.
వర్షమైతే ఆగేదేమో కానీ ఇది కన్నీటి వరద...
అందరూ ప్రేమిస్తున్న నన్ను నేను ప్రేమించుకోలేకపోతున్నాను నీ ద్వేషం గుర్తొచ్చి...
నీ వాడిని మాత్రమే అనుకున్న నేను నీకే పరాయిని ఐపోయాను...
నువ్వడిగినవి అన్ని ఇస్తున్నాను అనుకున్నాను గాని నా సంతోషాన్ని అడుగుతావనుకోలేదు...
ప్రతి క్షణం నిన్ను సంతోషం గా చూస్కోవాలి అనుకున్నా కానీ నేను దూరం గా ఉంటేనే నువ్వు సంతోషం గా ఉంటాను అన్నావ్...


ఆ నిముషమే నేను మరణించాను..
.



--
Ur's
'''Nestham...