Tuesday, May 25, 2010

చెప్పాలని ఉంది చివరిగా ఒక మాట


నాపై నీకున్న ద్వేషం ఏదో ఒకరోజు తగ్గిపోతుంది
కానీ నాకు నీపై ఉన్న ప్రేమ మాత్రం ఎప్పటికీ తగ్గదు...
చంద్రోదయాన్ని చూస్తూ కలువ వికసించింది
తెల్లవారే సరికి విలపించింది...
నిన్ను చూస్తూ ఉన్న కన్ను కలను వరించింది
నిన్ను మరువలేని మనసు నిన్నే కలవరిస్తోంది...
కన్ను మాత్రం అదే పనిగా కురుస్తోంది...

Thursday, May 20, 2010

కన్నీళ్ళు కరిగిపోయాయి



నా కళ్ళలో చూడు నా గుండెలో ఉన్న నువ్వు కనపడతావు
నిన్ను అడగాల్సిన ప్రశ్నలు అన్ని ఐపోయాయి
నా కళ్ళలో కన్నీళ్ళు కరిగిపోయాయి
నన్ను ద్వేషించడం నీకు ఇష్టం
నిన్ను మరిచిపోవడం నాకు కష్టం
మళ్లీ జన్మంటూ ఉంటె నీతో ఎప్పటికీ కలిసుంటే చాలు
ఈ జన్మకి నువ్వు మిగిల్చిన కన్నీళ్లు చాలు

Monday, May 10, 2010

నేను కూడా అందరిలాగే పెరిగి ఉంటె

స్నేహం ఐనా ప్రేమ ఐనా ఇవ్వడమే కదా అనుకున్నాను ఇంతకాలం
అవసరం వచ్చినప్పుడు వారికి మొదట గుర్తొచ్చే వ్యక్తిని నేను కావాలి
వాళ్ళు నాతో ఉన్నంత వరకు సంతోషం గా ఉండాలి అనుకున్నాను...
ధైర్యం చెప్పడం, కబుర్లు చెప్పడం, ఎప్పుడూ గుర్తుంచుకోడం
ఎక్కడున్నా ఏమి చేస్తున్నా నేను మిమ్మల్ని మర్చిపోలేదని గుర్తు చెయ్యడం
ఇదే స్నేహం అనుకున్నాను ఇంతకాలం...
కోపం తెప్పించి బుజ్జగించడం నాకెంతో నచ్చేది
నన్ను కూడా అలా చేస్తారని సరదా పడే వాడిని,
చేయ్యకపోయేసరికి డీలా పడే వాడిని...
ఆలస్యం గా తెలుసుకున్నా ఒక మంచి స్నేహితునిగా విజయం సాధించినా
ఒక మంచి స్నేహాన్ని పొందడం లో ఓడి పోయాను అని...
నాకంటూ ఎవరు లేకుండా ఐపోయాను
ఐనా అందరు పరాయి వాళ్ళే కదా..
మనిషి ఎప్పుడూ ఒంటరి వాడే కదా...
కన్నా తల్లి తప్ప ఈ లోకం లో సొంత వాళ్ళెవరు ఉండరేమో...
బంధువులు తోబుట్టువులు మనం పెరిగే కొద్ది దూరం పెంచుకునే వారే కదా..
తండ్రి గురువు లాంటి వాడు తల్లి మాత్రం ప్రేమ మూర్తి ...
కొందరు మాత్రం అదృష్టవంతులు తండ్రే తల్లి కూడా ...
కొన్ని సార్లు మనం గమనించం మనం ప్రేమించే వాళ్ళనే చూస్తూ
మనల్ని ప్రేమిస్తూ ఉండేవారిని గమనించం.
నాకు ప్రేమను పొందలనిపిస్తోంది, స్నేహాన్ని తీసుకోవలనిపిస్తోంది...
మరలా భయం ఇప్పుడు నామీద ప్రేమ తో వారి స్నేహాన్ని సహాయాన్ని నాకు
అందిస్తున్న వాళ్ళు కూడా పరాయి వాళ్ళే కదా..
ఎప్పటికైనా మరల నేను ఒంటరినే
నా స్నేహాన్ని, నేను పంచిన ప్రేమనే కొందరు మరచిపోయి
ఎప్పటికి నీ స్నేహం కావాలని అడిగి కూడా
వారి ఆనందమైన జీవితాలలో నన్ను కనీసం గుర్తు చేస్కోడం లేదు...
నా నుండి ఏమి పొందకుండా నన్ను ప్రేమిస్తున్న కొందరు కూడా దూరం అవుతారని
మనసు నమ్మేస్తోంది వద్దన్నా సరే.. ఐనా దానికల అలవాటు ఐపాయింది అయితే ఒంటరిగా ఉండడం
లేదా ఎవరైనా అక్కున చేర్చుకుని ప్రేమను పంచుదాం అనుకునే లోపే అందనంత అఘదాలు ఏర్పడడం
చూసి చూసి ఇలా అలవాటు పడి పోతోంది...
అమ్మ కు శుభాకాంక్షలు చెప్పలేకపోయినందుకు పాపం కొంచెం నిరాశ పడింది
కానీ మనం కూడా ఏమి చెయ్యలేము కదా
జారుతున్న కన్నీటి బొట్లకు సాక్షులుగా ఉండడం తప్ప..
ఇది అంతులేని వ్యధే...

Friday, May 7, 2010

వేదన తో వాదన

గాయపడిన హృదయం రాసిన గేయం నేను...
ఒక మనసు విడిచిన మనోవేదన మౌనం గా దహిస్తోంది...
జ్ఞాపకాలే ఆహారంగా...
కన్నీటిని తాగుతూ జీవిస్తోంది...
మరణమే లేనిది మనసు...
మరణించింది కేవలం నీ మాట వలన...
మాట వినని మనసును ఏమని ఓదార్చగలను...
వేదన తో వాదన సాధ్యపడదు కదా ...

Saturday, May 1, 2010

నాకు నచ్చిన ఒక పల్లవి

అడుగు అడుగని గుండె అడుగుతోందని
అడగలేక అడగలేక అడుగుతున్న
నా అడుగులోన అడుగువేయడం నీకు ఇష్టమేనా
నా మనసులోన మనసు దాచడం నీకు ఇష్టమేనా..