Sunday, March 13, 2011

మాటలలో చెప్పలేని మహా అద్భుతం అమ్మ

నేనంటూ లేనప్పుడే నన్ను కోరుకున్నావు
నాకోసం కలలు కన్నావు
పది నెలలు ప్రతి క్షణం
నాకోసమే గడిపావు
అస్తిత్వం లేనప్పుడే
గాడం గా ప్రేమించావు
నేను లోకాన్ని చూడడం కోసం
నువ్వు ప్రాణ త్యాగానికి కి సిద్ధపడ్డావు
నీ గుండెలపై మొదటి అడుగులు వేసినా
నీ చేతులతో తప్పటడుగులు వేయించావు
నీకు నిద్రలేకుండా చేస్తున్నా
నన్ను నిద్రపుచ్చావు
నీ ఆకలి కూడా మరచిపోయి
నాకు ఆకలి అంటే ఏంటో తెలియకుండా చేసావు
అమ్మా నీ గుండె నీకోసం కంటే నాకోసమే
ఎక్కువగా అల్లాడింది ఏమో అనిపిస్తుంది
నిన్ను నా గుండెల్లో పెట్టుకోడం కన్నా
నీ ఋణం తీర్చుకోడానికి నేనేమి చెయ్యలేను...

7 comments:

  1. Hai Vamsi garu ee post chala bagundi...

    nenu kuda oka blog modalu pettanu mi adi chadivi mi amulyamaina salahalu ivvandi plz....

    http://nijajivitham.blogspot.com/

    ReplyDelete
  2. మీరు చాలా బాగా రాస్తున్నారు ఎప్పటి నుండో చదువుతున్నా మీ కవితలు ..

    ReplyDelete
  3. మీ అందరికి ధన్యవాదాలు...

    ReplyDelete
  4. నేనంటూ లేనప్పుడే నన్ను కోరుకున్నావు
    నాకోసం కలలు కన్నావు chala bavunnayi e lines. Amma goppatanam chakkaga chepparu.
    http:/kallurisailabala.blogspot.com

    ReplyDelete
  5. chala bagundi e lantivi emka rasthe bguntundi

    ReplyDelete