Tuesday, January 24, 2012

ఈ కధ ఇలా మొదలైంది...


అందని చంద్రం లా అందంగా ఉంటావు
అందని దానినంటు ఆటాడిస్తావు
నీ ఉసులు విన్దామంటే అమవాస్యని అబద్ధం చెప్తావు..
నువ్వు లేవనుకునే లోపు కనిపించి కవ్విస్తావు..
అందుకోలేను మరచిపోలేను
నీ మాయ భూమ్యాకర్షణ లేక గురుత్వాకర్షణ??
ఎందుకో మానలేను ఈ ప్రదక్షణ
మేఘాలు కమ్మినా గ్రహణాలు పట్టినా
వీడలేను నిన్ను వీడిపోకు నన్ను

వాన జల్లులే లేకున్నా అరనవ్వులో హరివిల్లు లేదా?
తారలన్నీ తళుకుమని నీ కనుపాపల్లో మెరుపల్లే లేవా?
సందె పొద్దులో సింధూరం
నీ పెదవి తాకిన మందారం
జాము రాతిరి జలపాతం
నీ కురుల చేరిన వయ్యారం
చిలకల కులుకంతా నీ పలుకుల చేరింది
నీ చిన్న నవ్వు చినుకులా నా గుండె ను తాకింది
ఓ దేవకన్య ఎదురైంది
ఈ కధ ఇలా మొదలైంది...

Monday, January 2, 2012

నువ్వే నా ప్రాణం


విడిపోయెందుకే కలిశాం మనం
కను రెప్పలుగా మిగిలాం క్షణం
కనులు మూస్తే నీ జ్ఞాపకం
తెరిచి ఉంచితే ఈ లోకం
లిప్త పాటులో మరణం
కను రెప్ప చాటున నీ రూపం
అశాశ్వతమైన ఈ జీవితం
అందులో ప్రేమ పరిమితం
నీ స్నేహం మధురం
ఈ దూరం గాయం
నువ్వే నా ప్రాణం