ఆడపిల్ల గా పుట్టిన అదృష్టానికి నాన్న అంటే ఏంటో తెలిసింది
నా పాదాలు నేల మీద కంటే మా నాన్న గుండెల పై నో
ఆయన చేతుల పై నో ఎక్కువగా ఉండేవి..
నన్ను ఒక అయ్యా చేతిలో పెట్టినప్పుడు
నాన్న ను విడువ లేక నాన్న గుండెలపై కన్నీళ్లు రాల్చాను
నాన్న కంట్లో ఒక బొట్టు నీరు కూడా రాలేదు
నాన్న కు నేను వెళ్లిపోతుంటే బాధ లేదేంటి అనుకున్నాను
నన్ను ఓదార్చడానికే తను ధైర్యం గా ఉన్నాడని తెలియలేదు
నాకు పాపాయి పుట్టినప్పుడు అందరు నా పాప ఎలా ఉందో
చూడాలని తహ తహ లాడుతుంటే నాన్న మాత్రం చూడలేదు..
నా పాప మీద ప్రేమ లేదా అనుకున్నాను
నేను స్పృహ లో లేనని నేను ఈ లోకంలోకి వచ్చే వరకు
నా పక్కనే ఉన్నాడని తరవాత తెలిసింది
నా పాపాయి పెరుగుతుంటే
నాన్న ఎప్పుడూ తనతోనే ఉంటున్నాడు
నాకంటే నా పాప అంటేనే నాన్న కి ప్రేమ ఎక్కువైపోయింది అనుకున్నాను
కానీ నా పాప ను తను లాలించక పోతే
ఇంకెవరు లాలిస్తారు?
నేనే లాలించాలి
అంటే నాకు విశ్రాంతి ఇవ్వడానికి తను పాప తో ఉంటున్నారు అని తెలిసింది
[కిషోర్ అన్నయ్య చెప్పిన ఒక కదా ఆధారం గా ]