నా కంటి పాపై ఉంటావని అనుకున్నా,
నిను కంటి రెప్పై దాచాలని కల కన్నా,
నా కంటి దారై జారావే నా మైనా,
నను మరిచిపోవే ప్రేమా నాకేమైనా..
నా గుండె నిండా నిండావే నా రాధా,
నా వెంట ఉంది నువ్ నాతో లేని బాధా,
నీ ఊసు వింటూ బ్రతికెయ్యాలనుకున్నా,
నీ ఊహ వెంట అడుగే వెయ్యలేకున్నా..
కన్నీళ్లు వస్తే తుడిచేందుకు,
సంతోషాన్ని పంచేందుకు,
నువ్వేలేని జన్మెందుకు అనిపిస్తోంది ..
కన్నీళ్లు వస్తే తుడిచేందుకు,
సంతోషాన్ని పంచేందుకు,
నువ్వేలేని జన్మెందుకు అనిపిస్తోంది ..