Monday, January 21, 2013

నేను ఇలా క్రేజీ అయిపోతాను..


ఆండ్రాయిడ్ ఆప్ వా ?
స్టీవ్ జాబ్స్ ఆపిల్ వా ?
సమ్మర్ లో రైన్ వా ?
రైన్ వెనక రెయిన్బో వా ?

హచ్ వాడి కుక్కవా ?
8 పి. యం. కిక్కు వా ?
లాస్ట్ బాల్ లో సిక్స్ వా ?
టి ట్వంటీ కప్ వా?

అసలెందే నీ గొడవ ?
నేను ఇలా క్రేజీ అయిపోతాను నీకోసం..

Tuesday, January 15, 2013

ఒక్కోసారి

ఒక్కోసారి జేబులో చేతులు పెట్టుకుని ఎక్కడికో సీరియస్ గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను ఎక్కడికో తెలిదు,
పెదవులు నవ్వుతున్నా, కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి
ఎలానో తెలిదు,
పదిమంది ఉన్న ఉంటరిగా ఉంటా
ఎందుకో తెలీదు,
ఒక్కోసారి నిన్ను కూడా మరిచిపోతాను (అతిశయోక్తి) ఎలా సాధ్యమో తెలీదు,

నిరీక్షణ పాటలంటే నీకిష్టం, నీకోసం నిరీక్షణ నాకిష్టం
చల్లని సాయంత్రం చినుకులు పడితే,
పక్కన నువ్వున్నావేమో అని చెయ్యి తడిమింది,
కెరటాలు కాళ్ళని చల్లగా తడిపితే,
పక్కనే నీ పాదం ఉందేమో అని వెతికింది,
నడిరాతిరి నిదుర దోబుచులాడితే,
నీతో మాట్లాడేందుకు మనసయింది,

నవ్వు, నువ్వు ఆడే దోబూచులలో 
ఏదో వెలితి ఏదో ఆనందం

Sunday, January 6, 2013

నీ తోడు కావాలి..!

దహిస్తోంది నన్ను నీ మౌనం.. నిన్నే స్మరిస్తున్న గుండెకు ఇది భారం..
కన్నీటి వెచ్చదనం రెప్పలకు చేసే గాయం.. నీ  ఊహలతో ఊపిరికి వలలు వేసే ప్రాయం...

గతిస్తున్నా..! నా ప్రాణం.. స్మరిస్తోంది నీ పాశం..
స్తుతిస్తోన్న ఈ శ్లోకం.. జ్వలిస్తున్న నా శోకం ..

కురుస్తున్న నా కవనం.. స్పృశిస్తోందా? ఈ పవనం..
మరుస్తున్న నా స్వగతం.. ముగుస్తోందా? నా గమనం..

ఒంటరైన  ఒక్కోక్షణం నీ తోడు కోరింది..
పదుగురిలో ప్రతిక్షణం నీ జాడే వెతికింది..