॥ ప ॥
నే గీసిన చిత్రం
నా పాటకు రాగం
నాలోని ప్రాణం నీవేనా ..?
అందాల చంద్రం
వానల్లో వర్ణం
నాలోని ప్రాణం నీవేనా..?
నీ... స్వరం
నే పాడే రాగమా
ఏ... క్షణం
నను వీడకు నేస్తమా...
ఓ ప్రణయమా...
హృదయం పొంగే ప్రణయం ఏదో ప్రళయమై భూకంపమై
ఐనా ఊగెను హృదయం ఓ సంద్రమై అలల ఊయలై ॥ప॥
॥చ॥
అధరాన మెరిసేటి అందాల నవ్వు
గగనాన విరిసేటి వర్ణం నువ్వు
నన్నిలా ప్రళయమై
ప్రేమలో ముంచినావు
ఏ మాయో చేసి
నా మనసు దోచినావు
మాయల్లే యెదలో కదిలే కలవో..
॥చ॥
చెలియా నా కావ్యం లో నాయిక నువ్వే
గగనాన ఆ విల్లు కి వర్ణం నువ్వో
మిణుగురే మెరిసేలే నీ మోమున ముక్కెరై
అందమే అలిగెనే నిన్నే చూసి
నాలోని సగమై నాలో నిలిచిపో