Thursday, July 23, 2015

సీతా కోక చిలుక


ఒక సీతా కోక చిలుక ఎగురుకుంటూ వెళ్తుంది 
ఒక చక్కటి పువ్వు మీద వాలింది 
మృదువుగా మాట్లాడింది 
మధురాన్ని తాగింది 
వీడుకోలు పలికింది 
చిరునవ్వుతో ఎగిరింది 

ఆ కొద్దిపాటి పరిచయానికే మురిసిన పువ్వు 
తన కొత్త నేస్తం కోసం రోజు ఎదురు చూసేది 

ఆ సీతా కోక చిలుక ఎగురుకుంటూ వెళుతోంది 
ఇంకొక పువ్వుపై వాలింది, నవ్వుతు మాట్లాడింది, వీడుకోలు పలికింది 

మొదటి పువ్వు ఇంకా ఎదురుచూస్తూ ఉంది 
ఒకరోజు ఎక్కడ తేనె దొరకని చిలుక  మొదటి పువ్వు దగ్గరకు వచ్చింది 
నవ్వుతు మాట్లాడింది తేనె లేదని తెలిసి మెల్లగా వెళ్లిపోయింది 

మళ్లీ పువ్వు ఎదురు చూడడం మొదలు పెట్టింది 
ఒకరోజు భయంకరమైన గాలి వీచింది 
చిలుక పట్టు తప్పింది, ఒక కొమ్మను పట్టింది, నెమ్మదిగా జారింది,
పువ్వు దగ్గరకు చేరింది.. 

పువ్వు ఆనందానికి అవధులు లేవు .. 
కుదిరినంత ఆసరా అందించింది.. 
చాలాసేపు మాట్లాడింది.. 
వర్షం తగ్గింది, చిలుక ఎగిరింది... 

ఇంకా ఎదురు చూస్తే పువ్వుది అమాయకత్వం అంటారు...