తొందరలో చూసానా? అని పదే పదే చూసాను,
చూపులు కలపని కనులను చూస్తూ కలలను కంటూ నిలిచాను.
మాటలు చాలని అందం నీదని పాటలు ఎన్నో రాసాను,
నా గుండెల్లోనే దాచాను.
మాటల్లో చెప్పలేకనే ఎన్నో మాటలు దాచాను,
కొంచెం దూరం అయ్యాను.
గగనం చేరిన తారకలా నువ్వే దూరం ఐపోతే,
కలలతో చేసే యుద్ధం లో నిదురకి దూరం అయ్యాను..
కన్నుల ముందు నువ్వు లేక కలిసే దారే కనపడక,
ఒంటరిగానే నిలిచాను, నేనొంటరిగానే వగచాను.
ఇదిగో ఇదిగో నా గుండెల్లో నవ్వుల సవ్వడి వినిపిస్తోందా?
చప్పుడు చెయ్యని తలుపుల (రెప్పల) వాకిట నీ నవ్వుల వల్లిక కనిపిస్తోందా?
జ్ఞాపకాలని దాపెట్టేసా, మనసు మాటకి ఊ కొట్టేసా..
మనసు మార్చారా ఓ పరమేశా,
(తనని కలపరా ఓ జగదీశా.. )
చిగురుటాకు పై వాన చినుకులా,
సల్ల కుండ పై వెన్న నురగలా ,
వాన నీటి పై బొమ్మ పడవలా,
'చిన్ని' పాప లా నన్ను చేరగా...
నేను నేనయ్యాను. - - -