Thursday, January 21, 2016

నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం

అమ్మ నాన్న గురువు దైవం అన్నారు... 
అమ్మ నాకు తెలియని దైవం, నాన్న నాకు తెలిసిన గురువు... 


చిన్నప్పటి నుండి స్నేహం అంటే అంత ఇష్టం పెరగడానికి కారణం ఆయనే 
వాళ్ళ ఫ్రెండ్స్ ని ఎగ్జాంపుల్ గా చూపించి నా ఫ్రెండ్స్ నాకు గొప్పగా కనిపించేలా చేసే వారు,
నా ఫ్రెండ్స్ అనగానే ప్రత్యేకం గా చూసే వారు....  
నాకు ఊహ తెలిసినప్పుడే చెప్పేవారు మనం ఫ్రెండ్స్ అని...
నాకు పరిచయం అయిన మొదటి ఫ్రెండ్ మా డాడ్.. 
నాకు పరిచయం అయిన మొదటి ఎమోషన్ ఫ్రెండ్...  

నే కవితలే రాసినా,
పిచ్చి గీతలే గీసినా,
భలే ఉంది మళ్ళీ గీయరా అని ప్రోత్సహించిన
నాన్నకి ప్రేమతో అంకితం 

నే మాటలే తూలినా,
చిన్న తప్పు నే చేసినా,
ఒక్క చూపుతో నన్ను మార్చిన పాటానివి నువ్వే 

నన్ను నువ్వు విడిచినా 
జ్ఞాపకం గా మారినా 
కన్నీళ్లు ఆపుకొని నేను నవ్వే ప్రతి అబద్ధపు నవ్వు నువ్వే 

ఈ అందమైన రంగుల లోకాన 
వేలు పెట్టి నడిపించలేనంటు 
నీడ గా మారి కనిపించకుండా పోయిన దీపానివి నువ్వే 

నువ్వు దూరమైనా....
నేను ఒంటరైనా....
ఇకపై నా ప్రతి క్షణం నీకే అంకితం 

ఎందుకంటే, 
నాకు నీ మీద ఉన్న కోపం మాత్రమే నాకు తెలుసు 
నాన్న మీద ఉన్న ప్రేమ నాన్న వెల్లిపొయాకే తెలుసుకున్నాను  
అందుకే,
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం