Monday, October 31, 2016

విజయం చేసే శబ్దం కోసం మౌనం గానే పయనించు

​​
ఎవరెవరో వస్తారు 
ఎవరెవరో వెళ్తారు 

జ్ఞాపకాలు ఇస్తారు 
గాయాలు కూడా చేస్తారు  

భయపడకు 
బాధ పడకు 

నీ లక్ష్యం నీకుంది 
నీ గమ్యం నీకుంది  



ఎవరో ఏదో అనుకుంటారని అనుకోకు, వాళ్ళ కోసం ఆగిపోకు 
ఒకరోజు నీకు నువ్వు సమాధానం చెప్పుకోవాలి అని మర్చిపోకు 


ముళ్ళైనా, పూలైనా, 
ఎండైనా, కొండైనా, 
అదరకు, బెదరకు, 
అలవకు, అరవకు... 

విజయం చేసే శబ్దం కోసం మౌనం గానే పయనించు 
ఎదిగిన క్షణమున కిందికి చూస్తే  అందరు నీకన్నా చిన్నే 
ఎగిరిన పక్షికి ఎదిగిన మనిషికి పరిమితి కాగలదా మిన్నే