Thursday, April 5, 2018

అమరేంద్ర బాహుబలి ప్రెసిడెంట్ అయితే

సీన్ 1
గ్లాస్ కడిగిన వాడిని వీరుడంటారు 
కడిగించే వాడ్ని దేవుడంటారు 



సీన్ 2
ఇకనుండి మీ రంగస్థలానికి ప్రెసిడెంట్ ఫణింద్ర భూపతి 



సీన్ 3
బిజ్జు : చిట్టీ నీకెప్పుడైనా తాగిన గ్లాసు రోలుతో బద్దలు కొట్టాలనిపించిందా?
చిట్టి : మజ్జిగ మత్తులో మాట్లాడుతున్నావ్ నాన్నా 
(కట్టప్ప తో )
చిట్టి : ఏరా కుక్కా ఎందుకు రా నన్ను ప్రెసిడెంట్ ని చెయ్యలేదు చెవిటి వాడిననా ?
కట్టప్ప : కాదు ప్రభు గ్లాస్ కడగమంటే వినిపించుకోరని 
చిట్టి : చూసేసావా ?
కట్టప్ప : లేదు ప్రభూ గ్లాస్ వాసనవస్తోంది. 



సీన్ 4: 
ఫణింద్ర భూపతి అనే నేను రంగస్థల ప్రజల పొలం, పుట్రా, నగా, నట్రా లాక్కోడంతో పాటు గ్లాసులు కడిగిస్తానని రంగమ్మత్త సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను 



సీన్ 5
ఫణింద్ర భూపతి : ఏం జరిగింది రామ లచ్చిమి ?
లచ్చిమి : అందరిలాగానే సేతుపతికి కూడా మజ్జిగ ఇచ్చాము. గ్లాస్ కడగమంటే కడగలేదు. 
ఫణింద్ర భూపతి : గ్లాస్ కడగకపోతే నరకాల్సింది వేళ్ళు కాదు తల.... 





సీన్ 6
నువ్వు నా పక్కన ఉండగా గ్లాస్ కడగకుండా వెళ్లే మగాడింకా పుట్టలేదు మామా 






Sunday, March 11, 2018

సుక్కుకు నచ్చిన పాట

చంద్రబోస్ గారి కలముకు అంకితమిస్తూ నేను రాసిన ఎంత సక్కగారాసిండే అనే పాట ఈ లింక్ లో వినగలరు. సుకుమార్ గారు ఈ పాటకి వీడియో బైట్ పంపడం మరిచిపోలేని స్ఫూర్తిని నింపింది. మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తూ - వంశీ కమల్ [ Please like, comment and share my song ] https://www.youtube.com/watch?v=kxgo9yPQEhk

Tuesday, February 20, 2018

సిరాన పలికిన పదముల మెరుపు

తరాల కినుకకి మెలకువ తెలుగు 
సిరాన పలికిన పదముల మెరుపు 

నరాన సాగే వర్ణపు పరుగు 
జగాన కాదిది మెదడున తలపు 

నిమిషాలన్నీ నడిచిపోనీ 
రాత్రులు అన్నీ గడిచిపోనీ 

కాలాలన్నీ కరిగిపోనీ 
కలాన్ని మాత్రం సాగిపోనీ 

ఊహలు అన్నీ ఊపిరి కానీ 
ప్రాసలన్నీ పాత్రలు అవనీ 

పోనీ పోనీ పాళీని 
కల్పనలన్నీ కథలవనీ 

- వంశీ కమల్