Tuesday, February 20, 2018

సిరాన పలికిన పదముల మెరుపు

తరాల కినుకకి మెలకువ తెలుగు 
సిరాన పలికిన పదముల మెరుపు 

నరాన సాగే వర్ణపు పరుగు 
జగాన కాదిది మెదడున తలపు 

నిమిషాలన్నీ నడిచిపోనీ 
రాత్రులు అన్నీ గడిచిపోనీ 

కాలాలన్నీ కరిగిపోనీ 
కలాన్ని మాత్రం సాగిపోనీ 

ఊహలు అన్నీ ఊపిరి కానీ 
ప్రాసలన్నీ పాత్రలు అవనీ 

పోనీ పోనీ పాళీని 
కల్పనలన్నీ కథలవనీ 

- వంశీ కమల్