రెప్పలకి గొడవ అయినట్లు
పెడమొహం వేసుకుని ఎడంగా ఉంటే
సూది బెజ్జాలంత చిల్లులున్న
సూది బెజ్జాలంత చిల్లులున్న
నల్లని గంతల్లా
కళ్ళను చుట్టుకుంది ఆకాశం
చిల్లుల్లోంచి చూస్తున్న వెలుగులా
చిల్లుల్లోంచి చూస్తున్న వెలుగులా
మెరుస్తున్నాయి చుక్కలు
కొత్త చుట్టాన్ని చూసిన పిల్లాడిలా
కొత్త చుట్టాన్ని చూసిన పిల్లాడిలా
మబ్బులన్నీ పక్కింటికో
ఎదురింటికో పారిపోయినట్లున్నాయి
పంతులమ్మ శిక్షించిన విద్యార్థిలా
ఒంటికాలి మీద కదలకుండా నిలబడ్డాడు గాలి దేవుడు
ఆఖరి గంట కుర్చీలో నిద్రపోతున్న మేష్టారిలా
కదలకుండా నిలబడి నిద్రపోతున్నాయి చెట్లు
గీతలు గీసి రంగులు మరిచిన చిత్రంలా ఉంది మా ఊరు
చాపను దాటి
పక్కను దాటి
బొత్తాలెట్టని చొక్కాదాటి
వెచ్చగా పరుచుకుని
వీపుని కరుచుకుంటోంది
మధ్యాహ్నపుటెండకు కాలి కాగిన గచ్చు
చొక్కా మీద చెమట చిత్రాలను గీస్తూ
పక్కను దాటి
బొత్తాలెట్టని చొక్కాదాటి
వెచ్చగా పరుచుకుని
వీపుని కరుచుకుంటోంది
మధ్యాహ్నపుటెండకు కాలి కాగిన గచ్చు
చొక్కా మీద చెమట చిత్రాలను గీస్తూ
మచ్చ మిగిలిపోయినట్లు
డ్యూటీ అయిపోయినా
ఓ. టీ. చేస్తున్నాడు సూరీడు
అధికారి కింది ఉద్యోగుల్లా అదే కొనసాగిస్తున్నాయి
గాలీ, నేల
ప్రకృతి పగ పట్టి
మనిషిని సహించలేకపోతోందో ?
పాఠం నేర్పించి మనల్ని మార్పిద్దామని
కోపం నటిస్తుందో ?
- వంశీ కమల్ (నేస్తం)