నేను
కరిగిపోయే కాలాన్ని కాదు
కదిలిపోయే కలాన్ని..
వీడిపోయే వేగాన్ని కాదు
వదిలి పోని నేస్తాన్ని..
కాగితం సిరా రెండు కాదు
కాగితం పై కదిలే పాళీ ని..
సంద్రాన్ని కాదు వర్షాన్ని కాదు
వర్షించే మేఘాన్ని..
అన్నాన్ని కాదు ఆకలిని కాదు
అరచేతిని..
ఆశను కాదు ఆశయాన్ని కాదు
స్పూర్తి ని..
ప్రశ్నను కాదు సమాధానాన్ని కాదు
సమాచారాన్ని..
అవసరాన్ని కాదు
సహాయాన్ని కాదు
మధ్యలో ఉన్న నేనెవరినో..!