నన్ను చూసిన క్షణం లో నీ కళ్ళలో కనిపించే నవ్వు,
నా కోసం కన్నీటి చుక్కను విడిచిన నువ్వు..
ఎక్కడ ఉన్నా నా జ్ఞాపకాలతో తడి చేసుకునే కళ్ళు,
కేవలం నాకోసమే నీ కళ్ళలో జారిన కన్నీళ్లు..
నిన్ను విడిచి దాటి వచ్చిన ఊళ్లు,
మనం కలిసి ఆటలాడుకున్న ఇళ్ళు..
నువ్వు నాతో నడిచిన చెరువు గట్టు,
నీకోసం నేనెక్కిన ఉసిరి చెట్టు..
సంక్రాంతి కి నామీద చల్లిన ముగ్గు,
రంగుల తో మొదటిసారి తాకిన నీ బుగ్గ..
నాకోసం నువ్వు రాసిన మొదటి ఉత్తరం,
నీ కోసం నేనిచ్చిన బొమ్మల పుస్తకం..
నాతో మొదటి కవిత రాయించిన నీ స్నేహం,
ఎలా మరిచిపోగలను మిత్రమా..
నేస్తానికి ఓనమాలు నేర్పించిన నా నేస్తమా ,
నను మరిచిపోకుమా...
nice Kamal. baaga vraasaaru. keep it up.
ReplyDeleteధన్యవాదాలు...
ReplyDeleteచాల బాగుంది కమల్ ..
ReplyDeleteహృదయాని తాకింది ..అందుకే నీకు ఈ చిన్న కామెంట్ ..