ప్రేమించానా నిన్ను
ప్రేమించాను అనుకున్నానా
లేక ప్రేమను మరిచానా..?
లేక నా మనసు నా మాట వింటుందా...
బ్రతుకు పోరాటం లో గెలవడానికో
లేక గాయ పరిచిన ప్రేమను మరచి
ప్రేమ పంచిన స్నేహానికి తలవంచడానికో..
పేగు తెంచిన ప్రేమ కు ఋణం తీర్చడానికో
నా మనసుకు నేను చెప్పుకునే మాటలు
నిన్ను సైతం మరపించాయో ఏమో
గాయలితే మానిపోతాయి గాని
గాయం తాలుకు మచ్చలు మాసిపోవు
నువ్వు కూడా అంతే..
నువ్వు చేసిన గాయం మన స్నేహాన్నీ కాదు
ఎన్నో తీపి జ్ఞాపకాలను కూడా కాల్చివేసింది
నేను నీ ప్రేమలో లేకపోవచ్చు
కానీ ప్రేమ నాలో ఉంది..
ప్రేమిస్తూనే ఉంటాను నిన్ను కాదు
ఇది ద్వేషం కాదు బాధ్యత