Thursday, September 9, 2010

కాలాన్ని కష్టపడి ముందుకు నడిపిస్తున్నాను

మనుషులకు దూరం గా,
నాకు నేను చేరువగా ,
ఉంటూ మనశ్శాంతిని వెతుక్కుంటూ
పయనిస్తున్నాను...
లక్ష్యం లో ఉన్న ఆనందం
సాధించాలనే తపనలో ఉన్న సంతోషం
విజయానికి చేరువ అవుతూ ఒక్కో మెట్టు ఎక్కడం లో ఉన్న సంతృప్తి కి దూరం గా
అసంతృప్తి కి దగ్గర గా అయిపోతున్నాను
అయిన వాళ్లకి దూరం గా
బాధ్యతకు భారం గా
నచ్చిన వాటికీ దూరంగా
నచ్చని వాటికి చేరువగా
నచ్చక పోయిన నడుస్తున్నాను
తప్పదని తడుస్తున్నాను
కాలాన్ని కష్టపడి ముందుకు నడిపిస్తున్నాను
నేననుకున్న రోజు అతి చేరువలో ఉంది కనుకే భరిస్తున్నాను

5 comments:

  1. మీరననుకున్న రోజు త్వరలోనే మీ స్వంతం కావాని కోరుకుంటున్నాను.

    ReplyDelete
  2. Kamal గారూ...,వినాయకచతుర్థి శుభాకాంక్షలు

    హారం

    ReplyDelete