Monday, December 5, 2011

బంగారం


బంగారం వన్నె దాన
గారాలు పలుకు దాన
రంగేళి నవ్వు దాన
బంతి పూల బుగ్గల మధ్య
గాజుల సడి తలపించే
రంగుల హంగుల పెదాలు
చిలికించే నీ నవ్వులోని నవ్యత
ఏ కవి రాయలేని కవిత
రెప్పలేని కన్ను నువ్వు లేని నన్ను ఉహించకు
నిదురలో నన్ను కలలలో నీవు ఊరించకు
దూరంగా ఉండి దగ్గరలా అనిపించి ఉడికించకు
ఇలా ఇలా ఇలాగే ఇంకా నన్ను వేధించకు

3 comments:

  1. అంతలా వేధించకపోతే మీ నించి ఇంత మంచి కవిత్వం వచ్చేదా?

    ReplyDelete
  2. ఇంతలా తెల్ల వారు ఝామున నిద్ర లేపి మరీ మీ చేత కవిత్వాన్ని రాయిస్తున్నవారు ఎవరైవుంటారో? త్వరగా చెప్పెయ్యాలి

    ReplyDelete
  3. వావ్ చాలా బాగుంది కవిత :) అంత సులువుగా చిక్కితె బంగారం విలువేముందీ :) కదా !

    ReplyDelete