చూసానే నిను చూసానే...
వెతికానే వెతికానే కన్నుల నీటితో వెతికానే కల అనుకుంటూ కలవరపడుతూ నీకై వెతికానే
చూసానే నిను చూసానే చిరునవ్వుతో నిను చూసానే ఆనందం తో ఆశల సంద్రం కెరటం అయ్యానే
నవ్వే నిన్ను చూసాను కన్నీటి నేను మరిచానుకనపడవంటూ కలవర పెట్టిన మనసుని కసిరానే
కలకాదని నే నమ్మాను కనుపాపలలో నిలిపాను భ్రమ కాదంటూ బ్రతిమాలుతూ నా మనసుకు చెప్పాను
నీతో ఉన్న ప్రతి నిమిషం జ్ఞాపకం ఉందే ఈ నిమిషంగాయం చేసిన జ్ఞాపకం ఏదో (గుండె కు) గురుతే ఉందిలేకనుపాపలలో ఉన్నావే రెప్పలు మూసిన నువ్వేలేఅనుక్షణము నా కన్నులో కారే కన్నెవు నువ్వేలే
No comments:
Post a Comment