Thursday, September 27, 2012

నా ప్రేమ పాడే రాగం నేను


నీ మీద ప్రేమకు తండ్రిని నేను, విరించి నేను
నా ప్రేమ పాడే రాగం నేను, విపంచి నేను

నిరంతరం నీ ధ్యాసలోనే
నా ఉచ్వాస నిశ్వాస

నా కనులలో
నీ నవ్వు నాట్యమాడే వేళ నా మది మ్రుదంగమై
ప్రేమ తరంగాలతో ప్రతిధ్వనిస్తుంది

చిగురించిన ప్రేమను పోషిస్తాను
చిరునవ్వుని చూస్తూ జీవిస్తాను
వేల రాగాలు పాడిస్తాను
కోటి కలలనలు పండిస్తాను

నిరతము నిన్నే ధ్యానిస్తాను,
ఆర్తి తో ఆరాధిస్తాను,
ప్రేమగా లాలిస్తాను,
ప్రేమిస్తాను..  :)

నా హృదయాన్ని స్వీకరించి
అనుగ్రహిస్తావా..? మరి ..!

2 comments:

  1. విరించినై విరచించితిని...
    అని అంత అందంగా అన్నాక
    తప్పక అనుగ్రహం దొరుకుతుంది నేస్తం...:-)
    @శ్రీ

    ReplyDelete
  2. :) @ శ్రీ
    మీ స్పందనకు ధన్యవాదాలు

    ReplyDelete