Sunday, November 25, 2012

నీకే తెలియదు గా...


ఎన్నో దెబ్బలు తిన్న రాయి శిల్పం అయితే, ఒక్కటే దెబ్బ తిన్న శిల గడప ఐంది అనేది తెలిసిన కథ.
శిల  శిల్పం గా మారడానికి ఎన్నో దెబ్బలు తిన్న ఉలి, సుత్తి, మనకు గుర్తు రావు. 
సృజనాత్మకం గా రాయిని శిల్పం చేసిన కళాకారుడు ఎవరో కూడా మనకు తెలియదు.

ప్రతి ఒక్కరు ముఖ్యమే..
ఎవరు ఎందుకు పుట్టారో ఎవరికీ తెలుసు..?

ఉలివో, శిలవో, కలమో, బలమో నీవెవరో...
శిల్పాన్ని మలిచే ఉలివో..
శిల్పం గా మారే శిలవో..
కథలు కల్పించే కలమో..
వ్యధని కరిగించే బలమో..

ఎవరికి చివరకు నీవెవరో..?

Friday, November 2, 2012

చెలియా నాకిన్నాళ్ళు


చెలియా నాకిన్నాళ్ళు
మిగిలే ఈ కన్నీళ్లు

కన్నీటి చుక్కై చెంప పై జారి
నా గుండె చేరావు ఉప్పెనవై
నా గుండె గుడిలో నీ రూపానికి
ఉపిరి సలపని ఊహలవై

నీ ఊహ నిండిన ప్రతి నిమిషం
నీ జ్ఞాపకం ఐనది చేదు విషం
నిలువెల్లా కాల్చే ఈ విరహం
చల్లార్చలేనే ఒట్టు నిజం

నా కంటి పాపే కలలను మరచి
కన్నీట తడిచి మునిగిందే

నా గుండె చేసే చప్పుడు కూడా
నేనంటే ఎవరో మరచిందే
--
చెలియా ఇంకెన్నాళ్ళు
వరమై ఈ కన్నీళ్ళు
కనుల్లో జారే ప్రతి చినుకు నీ
రూపం తానె నింపిందే
నాలోకి చేరే ప్రతి శ్వాస నీ
ఊపిరై నన్నే తదిమిందే
ఇన్నాళ్ళు నవ్వుతు తిరిగిన నా
మనసుకు బాధే మిగిలిందే
నేనంటూ నాకే లేకుండా నీ
గురుతులు గుండెలో నింపావే

నువ్వంటూ మరల జన్మిస్తే నీ
ప్రేమకై మరల పుడతానే