Wednesday, September 30, 2015

కల అనుకోనా..?


గమ్యమే తెలియని ప్రయాణం,
నీకోసం ఎదురు చూసిన సమయం..
కాలమే ఆగింది కన్నీరొకటి జారింది,
నీ గొంతు విన్న ఆ నిమిషం..
సంద్రమై పొంగింది మనసు సంతోషం తో..
ఎదురు చూపులు ముగిసిన ఆనందంలో..

వరమనుకోనా??
కునుకల్లే ఎదురొచ్చి ఒడిలోన లాలించే కలవనుకోనా?

నిజమనుకోనా??
చిరునవ్వే ఎదురొచ్చి కన్నీళ్ళను తుడిచేసే భ్రమ అనుకోనా?

గతమనుకోనా??
కడ దాకా నాతో నడిచే కనిపించని దారులు వెతికే జతవనుకోనా..

చిరుగాలై దరి చేరావే,
చలి గాలై గిలి పెట్టావే,
హరి విల్లుని తలపించేల,
వర్ణాలె కురిపించావే

వరమనుకోనా?? నిజమనుకోనా?? గతమనుకోనా??
లేక

ఇదంతా
కల అనుకోనా..?

Wednesday, September 16, 2015

జ్ఞాపకం కూడా చెరిగిపోతుంది.. కొందరి స్నేహం లాగా

ఈ ప్రపంచం లో ప్రేమ అంటూ ఏదీ లేదు 
ఉన్నది ఒకటే... నమ్మకం... 

ప్రతి మనిషి కోరుకునేది, 
ప్రతి బంధం కోరుకునేది, నమ్మకం... 
మనకి కష్టం వచ్చినపుడు కనపడతారని,
కన్నీళ్ళొచ్చినపుడు కళ్ళ ముందు ఉంటారని,నమ్మకం... 



ఆ నమ్మకాన్ని ఇవ్వలేకపోయినప్పుడు, 
బంధం బలహీనం అవడం మొదలవుతుంది... 
మనసు ఆశ పడడడం మానేస్తుంది.. 
బాధ పడడం మొదలవుతుంది.. 
బాధని మర్చిపోయే ప్రయత్నం లో 
నెమ్మదిగా ఒక బంధం జ్ఞాపకం అయిపోతుంది... 

కొన్నాళ్ళకి జ్ఞాపకం కూడా చెరిగిపోతుంది.. కొందరి స్నేహం లాగా...

కన్నీళ్లు ఎప్పుడూ గుండెల్లో దాచుకోవాలి, 
చిరునవ్వు ఎప్పుడూ పెదవి పై ఉంచుకోవాలి, 
జీవితం నాకు నేర్పింది ఇదే