Thursday, May 12, 2016

పాత డైరీలో పేజీలు

ఇలాంటివి అసలు రాయొద్దు అనే అనుకుంటాను కాని రాయకుండా ఉండలేకపోతాను. భహుశా ఇదే లాస్ట్ కావొచ్చు. 

చాలా మంది ని చూస్తున్నా కదా ఎందుకో కలుస్తారు, నడుస్తారు, ఏడిపిస్తారు, వెళ్ళిపోతారు... They Just Move On

కొందరు మళ్ళీ వద్దాం అనుకుంటారు, వస్తారు 
కొందరు రాలేకపోతారు 
కొందరు రాలేని చోటుకు వెళ్ళిపోతారు 

అందరి లో కామన్ గుణం ఒక్కటే వాళ్ళ గురించి మనం ఏమి ఆలోచిస్తున్నామో తెలియకపోవడం 

నేను నేను గా ఉన్న కాలాన్ని చెప్పమంటే అమ్మ నుండి నాన్న వరకు అని చెప్పోచ్చేమో... నాన్న చెప్పేవారు మనిషి ఒంటరి వాడు. అది మర్చిపోయినప్పుడే బాధ పడడం మొదలవుతుంది అని. నేను వినలేదు అనుకో.. 

అయినా కళ్ళ ముందే ఇంత మంది నవ్వుతూ కనిపిస్తుంటే ఒక్కడినే అని ఎందుకు అనిపిస్తుంది అంతా నావాళ్ళే అనిపిస్తుంది.  కానీ అనుభవం చెప్పే పాఠాలు బాగా అర్థం అవుతాయి జీవితం ఇచ్చే గాయాలు బాగా గుర్తుంటాయి..  

మళ్ళీ వద్దాం అని వెళ్ళిపోయావు  గాని కల్సి పోరాడాలని ఎందుకు అన్పించలేదో ?
ఒక్క పలకరింపు అంత దూరం లో ఉన్నా "తను ఎందుకు వెళ్ళిపోయిందో ?"
కలిసి ఉండలేము అంటూనే కొందరు కలుస్తూనే ఉంటే కలిసి ఉండాలని ఉన్నా కూడా వీరు ఉండలేకపోవడం ఏమిటో?

నీటిలోని తామరాకు నీటిని తాకలేనట్లు 
ఎవరికీ ఏమీ కామేమో మనం 

ఈసారి ఐన నా కథలో అమ్మ ఉండాలి అనుకుంటున్నాను. 

మేఘం, చినుకులు దూరం అయితే వర్షం అవుతుంది... 
నిశీధి, నిద్ర దొంగాట ఆడుకుంటే నేను రాసే కథలు పుడతాయి... 

ఇంక ఈ పాత డైరీ తో పని లేదు అనుకుంటా... జ్ఞాపకాలతో పాటే అటకమీద పెట్టేస్తా... 

2 comments:

  1. భావవిభోర్ అంటారు దీన్నే

    ReplyDelete
  2. అనుబంధం అంటేనే అప్పులే... కరిగే బంధలన్నే మబ్బులే .....

    ReplyDelete