'''నేస్తమ్...
Saturday, January 11, 2020
Thursday, May 30, 2019
మిద్దెమీద పడుకుంటే
రెప్పలకి గొడవ అయినట్లు
పెడమొహం వేసుకుని ఎడంగా ఉంటే
సూది బెజ్జాలంత చిల్లులున్న
సూది బెజ్జాలంత చిల్లులున్న
నల్లని గంతల్లా
కళ్ళను చుట్టుకుంది ఆకాశం
చిల్లుల్లోంచి చూస్తున్న వెలుగులా
చిల్లుల్లోంచి చూస్తున్న వెలుగులా
మెరుస్తున్నాయి చుక్కలు
కొత్త చుట్టాన్ని చూసిన పిల్లాడిలా
కొత్త చుట్టాన్ని చూసిన పిల్లాడిలా
మబ్బులన్నీ పక్కింటికో
ఎదురింటికో పారిపోయినట్లున్నాయి
పంతులమ్మ శిక్షించిన విద్యార్థిలా
ఒంటికాలి మీద కదలకుండా నిలబడ్డాడు గాలి దేవుడు
ఆఖరి గంట కుర్చీలో నిద్రపోతున్న మేష్టారిలా
కదలకుండా నిలబడి నిద్రపోతున్నాయి చెట్లు
గీతలు గీసి రంగులు మరిచిన చిత్రంలా ఉంది మా ఊరు
చాపను దాటి
పక్కను దాటి
బొత్తాలెట్టని చొక్కాదాటి
వెచ్చగా పరుచుకుని
వీపుని కరుచుకుంటోంది
మధ్యాహ్నపుటెండకు కాలి కాగిన గచ్చు
చొక్కా మీద చెమట చిత్రాలను గీస్తూ
పక్కను దాటి
బొత్తాలెట్టని చొక్కాదాటి
వెచ్చగా పరుచుకుని
వీపుని కరుచుకుంటోంది
మధ్యాహ్నపుటెండకు కాలి కాగిన గచ్చు
చొక్కా మీద చెమట చిత్రాలను గీస్తూ
మచ్చ మిగిలిపోయినట్లు
డ్యూటీ అయిపోయినా
ఓ. టీ. చేస్తున్నాడు సూరీడు
అధికారి కింది ఉద్యోగుల్లా అదే కొనసాగిస్తున్నాయి
గాలీ, నేల
ప్రకృతి పగ పట్టి
మనిషిని సహించలేకపోతోందో ?
పాఠం నేర్పించి మనల్ని మార్పిద్దామని
కోపం నటిస్తుందో ?
- వంశీ కమల్ (నేస్తం)
కిటికీ తలుపులు
తలపుల కిటికీ తలుపులు మూసి
రెప్పల చీకటి మేఘం కమ్మిన లోకాన
గుండె చప్పుడులా మ్రోగిన తలుపు చప్పుడుకి
కిటికీ తెరిచి ఎవరా అని చూసినట్లే పేజీ విప్పి చూసాను ఏమా అని
కాగితమనే ఆవరణలో
కవిత్వమనే ఆవర్ణాలతో
గీసిన గీతలు
రాసిన రాతలు
హోళీకి మొహానకొట్టిన రంగుల్లా
మనసుకు అనుభుతులు అద్దాయి
ఈ రంగుల పొడులు కడగాలంటే
ఈ బాహ్య ప్రపంచమనే చెరువులో
రెండ్రోజులైనా మునగాలి.
- నేస్తం
రెప్పల చీకటి మేఘం కమ్మిన లోకాన
గుండె చప్పుడులా మ్రోగిన తలుపు చప్పుడుకి
కిటికీ తెరిచి ఎవరా అని చూసినట్లే పేజీ విప్పి చూసాను ఏమా అని
కాగితమనే ఆవరణలో
కవిత్వమనే ఆవర్ణాలతో
గీసిన గీతలు
రాసిన రాతలు
హోళీకి మొహానకొట్టిన రంగుల్లా
మనసుకు అనుభుతులు అద్దాయి
ఈ రంగుల పొడులు కడగాలంటే
ఈ బాహ్య ప్రపంచమనే చెరువులో
రెండ్రోజులైనా మునగాలి.
- నేస్తం
Saturday, May 4, 2019
మదిలో కల
శిలలాంటి మదిలో కల
దిగులుతో చిక్కబడిన రక్తం సిరా
కనుపాపల నుండి కాగితంమీదకి జారిన కలల్లో ఎన్నోదో ఇది ?
- వంశీ కమల్
Thursday, April 5, 2018
అమరేంద్ర బాహుబలి ప్రెసిడెంట్ అయితే
సీన్ 1
గ్లాస్ కడిగిన వాడిని వీరుడంటారు
కడిగించే వాడ్ని దేవుడంటారు
సీన్ 2
ఇకనుండి మీ రంగస్థలానికి ప్రెసిడెంట్ ఫణింద్ర భూపతి
సీన్ 3
బిజ్జు : చిట్టీ నీకెప్పుడైనా తాగిన గ్లాసు రోలుతో బద్దలు కొట్టాలనిపించిందా?
చిట్టి : మజ్జిగ మత్తులో మాట్లాడుతున్నావ్ నాన్నా
(కట్టప్ప తో )
చిట్టి : ఏరా కుక్కా ఎందుకు రా నన్ను ప్రెసిడెంట్ ని చెయ్యలేదు చెవిటి వాడిననా ?
కట్టప్ప : కాదు ప్రభు గ్లాస్ కడగమంటే వినిపించుకోరని
చిట్టి : చూసేసావా ?
కట్టప్ప : లేదు ప్రభూ గ్లాస్ వాసనవస్తోంది.
సీన్ 4:
ఫణింద్ర భూపతి అనే నేను రంగస్థల ప్రజల పొలం, పుట్రా, నగా, నట్రా లాక్కోడంతో పాటు గ్లాసులు కడిగిస్తానని రంగమ్మత్త సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను .
సీన్ 5
ఫణింద్ర భూపతి : ఏం జరిగింది రామ లచ్చిమి ?
లచ్చిమి : అందరిలాగానే సేతుపతికి కూడా మజ్జిగ ఇచ్చాము. గ్లాస్ కడగమంటే కడగలేదు.
ఫణింద్ర భూపతి : గ్లాస్ కడగకపోతే నరకాల్సింది వేళ్ళు కాదు తల....
సీన్ 6
నువ్వు నా పక్కన ఉండగా గ్లాస్ కడగకుండా వెళ్లే మగాడింకా పుట్టలేదు మామా
Sunday, March 11, 2018
సుక్కుకు నచ్చిన పాట
చంద్రబోస్ గారి కలముకు అంకితమిస్తూ నేను రాసిన ఎంత సక్కగారాసిండే అనే పాట ఈ లింక్ లో వినగలరు. సుకుమార్ గారు ఈ పాటకి వీడియో బైట్ పంపడం మరిచిపోలేని స్ఫూర్తిని నింపింది. మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తూ - వంశీ కమల్
[ Please like, comment and share my song ]
https://www.youtube.com/watch?v=kxgo9yPQEhk
Tuesday, February 20, 2018
సిరాన పలికిన పదముల మెరుపు
తరాల కినుకకి మెలకువ తెలుగు
సిరాన పలికిన పదముల మెరుపు
నరాన సాగే వర్ణపు పరుగు
జగాన కాదిది మెదడున తలపు
నిమిషాలన్నీ నడిచిపోనీ
రాత్రులు అన్నీ గడిచిపోనీ
కాలాలన్నీ కరిగిపోనీ
కలాన్ని మాత్రం సాగిపోనీ
ఊహలు అన్నీ ఊపిరి కానీ
ప్రాసలన్నీ పాత్రలు అవనీ
పోనీ పోనీ పాళీని
కల్పనలన్నీ కథలవనీ
- వంశీ కమల్
Thursday, April 27, 2017
నేను దేవుడిని
నేను దేవుడిని.
అవును వినడానికి వింతగా ఉన్నా నేను దేవుడినే...
దేవుడు అంటే సర్వాంతర్యామి. కాబట్టి ఆయన నాలోనూ ఉన్నాడు కనుక నేను దేవుడిని అని చెప్పడం లేదు.
మీరు నమ్మినా నమ్మకపోయినా నిజంగానే నేను దేవుడిని .
అవునా ? అయితే నువ్వు దేవుడు అని నిరూపించు అంటారా ? నాకేం అవసరం. మీకు నిరూపించాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు నిజంగా నేను దేవుడి దగ్గరకి వెళ్లి నువ్వు దేవుడు అని నిరూపించుకో అంటే నిరూపించుకోడుగా !
నువ్వు నిజంగా దేవుడు అయితే ఈ మాయ చెయ్యి, ఈ మంత్రం వెయ్యి అంటే వెయ్యడుగా. నేనుకూడా అంతే. మీకు నిరూపించుకోను. మీరు నమ్మండి పూజలు చెయ్యండి, దీక్షలు చెయ్యండి మీ కోరికలు అన్ని నెరవేరుతాయి.
అసలు దేవుడు ఉన్నాడా ? లేడా ? (దేవుడు ఉంటే ఏ మతానికి చెందిన వాడు అనే ప్రశ్న వదిలేద్దాం).
కాసేపు దేవుడు లేడు అనుకుందాం. దేవుడు లేకపోతే మనం వింటున్న కథలన్నీ ఎలా వచ్చి ఉంటాయి ?
- కొన్ని సంవత్సరాల క్రితం (సుమారు 10 సంవత్సరాలు) నేను 'untold history' అని లేదా అలాంటి పేరుతో ఉన్న ఒక బ్లాగ్ చదవడం జరిగింది. అందులో చరిత్రలో మనం చదువుకుంటున్న ఎన్నో సంగతులు నిజం కాదని వాటికి ఆధారాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఆ ఆధారాలను ప్రస్తావించడం కూడా జరిగింది. కానీ అవి నాకు ఇప్పుడు గుర్తులేవు. అయితే ఈ మధ్య అంతర్జాలం లో తాజ్ మహల్ ఒక హిందూ దేవాలయం అని కొన్ని ఆర్టికల్స్ మరియు వీడియోలు చలామణీ అవుతుండడం చూసే ఉంటారు. ఈ తేజో మహాలయ గురించి కూడా అప్పట్లో ఆ బ్లాగ్ లో ప్రస్తావించబడింది. వాళ్ళ చరిత్ర వాళ్ళకి నచ్చిన విధంగా తయారు చేసి చలామణీ చేశారనీ చాలామంది అంతర్జాలంలో చాలా సమాచారం పెట్టారు. కొన్ని తరాల తర్వాత పుట్టిన మనకి పుస్తకాల్లో ఉన్నదే నిజం అనుకుని అదే చదువుకుని అదే నమ్మేసాం అని ప్రస్తావించారు.
- కొందరు సినిమా తారలకు ఆలయాలు కట్టించడం మనం చూసాం. అలాగే ఒక నాయకుడి కోసం దీక్ష తీస్కుని, మాల వేసుకున్న భక్తులు లేదా అనుచరుల గురించి కూడా వార్తల్లో చూసాం. ఈ దీక్షలు కొన్ని తరాల పాటు ఇలానే కొనసాగాయి అనుకుందాం. తర్వాత తరం వారు భక్తి గీతాలు, దీక్షా సూత్రాలు రాసి తర్వాత తరాల వాళ్ళకి అందించారు అనుకుంటే, కొన్నితరాలు పోయిన తర్వాత ఇప్పటి మన సినీ తారలు దేవుళ్లు అయిపోయి వరాలు ఇస్తూ ఉంటారు అనడంలో ఆశ్చర్యం లేదు.
- ఒక సాధువు గారు ఒకసారి ఒక ప్రయోగం చేశారట. ఒక విష సర్పాన్ని తీసుకొచ్చి. ఎవరైతే ఆయనని నమ్మకం గురించి ప్రశ్నించారో వారిని పిలిపించి రోజు పాముని పరిచయం చేసే వారుట. అది ఎంత ప్రమాదకరమైన పాము, ఒకవేళ కాటు వేస్తే ఎలాంటి పరిణామాలు మానవ శరీరంలో చోటు చేసుకుంటాయి. నిన్ను ఎక్కడ ఆ పాము కరిస్తే ఎక్కడ నుండి విషం ఎలా ప్రవహించి నువ్వు ఏమైపోతావు అని చెప్పడం చేసే వారు. ఒకరోజు ఆ వ్యక్తి కళ్ళకి గంతలు కట్టి ఇప్పుడు పాముతో కరిపించబోతున్నాను అని నమ్మబలికి పాము బుస కొట్టే సమయానికి ఆయనకి ఎక్కడైతే కాటు వేయిస్తా అన్నారో అక్కడ ఒక సూదితో గుచ్చారు. ఆశ్చర్యంగా నిజంగా పాము కరిస్తే ఏమేం జరుగుతాయో అవన్నీ అతనికి జరగడం గమనించి అక్కడున్న జనం ఆశ్చర్య పోయారట.
ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉంటాయి. అంటే మనం గట్టిగా నమ్మితే అదే మనకి అనుభవం అవుతుంది. పాము అనుకుని చూస్తే చీకట్లో తాడు కూడా కదిలినట్లే కనిపిస్తుంది కదా ! నిజానికి తాడు కదలదు. కానీ, మన ఆలోచనలో కదిలినట్లు ఊహించుకుంటాం. అలానే మన జీవితం లో జరిగే సంఘటనలను మనం లంకె పెట్టి చూసుకుంటాం. ఫలానా కారణం వల్లనే ఇది జరిగింది అని నమ్ముతాం.
భయం :
సాధారణంగా మనిషి తనకు తెలిసిన దానికన్నా తెలియని దానికి ఎక్కువ భయపడతాడు అంట. అక్కడేదో ఉందనో, ఒకవేళ ఎవరు లేనపుడు ఒంటరిగా ఉన్నపుడు ఏదో జరిగిపోతుందేమో లాంటి విషయాల్లో ఎక్కువ భయపడతాడు. అలానే అందరూ నమ్ముతున్నారు నేను నమ్మకపోతే నాకు ఏమైపోతుందో అని కూడా భయపడతాడు.
ఆత్మవిశ్వాసం:
కొంతమందికి తమ సొంత సామర్థ్యం మీద నమ్మకం తక్కువ. అలాంటప్పుడు వేరే మానవాతీత శక్తి మీద ఆధారపడతారు. ఒక వ్యక్తి సిఫారసు లెటర్ ఉన్నపుడు ఎంత ధైర్యంగా ఇంటర్వ్యూకి వెళ్తాడో అలాగ నాకు ఒకరి అండ ఉంది అనే ధైర్యం తో ముందుకు వెళ్తాడు. తనవల్ల కాదు అనుకున్న విషయాన్ని ఆ మానవాతీత శక్తి మీద బాధ్యత పెట్టేసి కొంత మానసిక భారం బదిలీ చేస్తాడు. నైపుణ్యం ఎంత ఉన్నా ఆత్మ విశ్వాసం పాత్రని తక్కువ చెయ్యలేం కదా!
ఒప్పుకోలేకపోవడం:
ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా మనిషి ప్రాణాలను శాశ్వతంగా కాపాడలేము. ఎంతగా ప్రేమించినా మనకి దక్కుతుంది అని ఖచ్చితంగా చెప్పలేము. అలానే కొన్ని మనం ఎంత ప్రయత్నించినా మన చేతుల్లో ఉండవు. ఈ విషయం మనం అర్థం చేస్కుని మానసికంగా సిద్ధపడాలి. కానీ చాలామంది మనకెందుకు ఇలా జరిగిందని ప్రశ్నిస్తారు తప్ప ఇలా కూడా జరగొచ్చు కదా అని అనుకోలేరు. జరిగిన దాన్ని జీర్ణించుకోలేరు.
కోరిక:
ఉన్నదానితో తృప్తి పడడం చాలా చాలా కొద్దిమందికి మాత్రమే సాధ్యం. ఉన్నదాన్ని పదింతలు ఎలా చెయ్యాలా? అని ఆలోచించే వారే మనలో అధికం. తమ తెలివితో, సామర్థ్యంతో కొంతవరకు సాధించగలరు కానీ ఆశ అక్కడితో ఆగదుకదా! అంతులేని ఆశల కోసం దేనికైనా సిద్ధం.
ఇలా చాలా చాలా కారణాల వల్ల మనకి దేవుడి అవసరం ఉంది. అలాంటి అవసరాలే మనకి దేవుడిని సృష్టించాయి. అదే దేవుడితో మనం వ్యాపారం మొదలు పెట్టేసాం. అలా కాకుండా మరేం చెయ్యాలి. మనకి కలిగే భయాలకి కారణాలు వెతికి మన భయాలు మనమే పోగొట్టుకోవచ్చు. మన బలహీనతలు ఒక్కొక్కటి అర్థం చేసుకుని కొంచెం సాధనతో వాటిని ఒక్కొక్కటిగా బలంగా మార్చుకోవచ్చు. మనం చాలా పరిమితమైన వాళ్ళం, మనం కొన్ని మాత్రమే చెయ్యగలం. మనం ఎంత సమర్థులం అయినా, ఎంత గొప్పవాళ్ళం అయినా కొన్ని మన చేతుల్లో ఉండవనే నిజాన్ని అర్థం చేసుకోవాలి. కోరికలు పరిమితం చేసుకుని సంతృప్తి పొందడం నేర్చుకోవాలి. రోజుకి కోటి రూపాయలు సంపాదిస్తూ నిమిషం ఖాళీ లేకుండా సంపాదన తప్ప మరేం పట్టకుండా ఉండేవాడికన్నా జీవితాన్ని ఆస్వాదిస్తూ బ్రతికిన పేదవాడే ఎక్కువ తృప్తిగా ఉండగలడు. ప్రపంచం ముందు గొప్పలకు పోవడం మాని మనలోకి మనం చూసుకోడం మొదలైన రోజున మనకన్నా సంతోషంతో ఎవరూ ఉండరు.
పైన ఎలాంటి కారణాల వల్ల నీకు దేవుడు అవసరం ఐయ్యాడో, అలాంటి అవసరాల్లో ఉన్నవాడిని సొంతకాళ్ళ మీద నిలబడేలా చేస్తే నువ్వే వాడికి దేవుడివి.
ఇప్పుడు దేవుడు ఉన్నాడు అనుకుందాం.
దేవుడు నుండి మనం ఏమి ఆశిస్తున్నాం? మనలో అందరం దేవుడు నుండి ఏదో ఒకటి ఆశించి మాత్రమే పూజిస్తున్నాం. కోరికలు మాత్రమే కోరుతున్నాం. మన కోరికలు తీర్చడం ఆయన బాధ్యత అన్నట్లు ప్రవర్తిస్తున్నాం. మన కోరిక తీరకపోతే నిందిస్తున్నాం.
సరదాగా కాసేపు మనమే భగవంతుడు అనుకుందాం. ఏమైనా చెయ్యగలం, అన్నీ తెలిసిన వాళ్ళం, అన్ని చోట్లా వ్యాపించి ఉన్నాము మరియు ఎవరికీ హాని చెయ్యము అందరికీ మంచి మాత్రమే చేసే అత్యంత మంచి వాళ్ళం. ఇంకా ఏమన్నా దేవుడి గుణాలు ఉంటే అవన్నీ మనకి కూడా ఉన్నాయ్ అనుకుందాం.
భయం:
మనకి చిన్నప్పుడు చీకటి అంటే చాలా భయం ఉండేది. కానీ మనం పెరిగేకొద్దీ కొంచెం కొంచెం ఆ భయం తగ్గిపోతుంది. ఎలా తగ్గిపోయింది? కొన్నాళ్ళు ఎవరో ఒకరి తోడు తీసుకుని చీకటి లోకి వెళ్ళేవాళ్ళం. కొన్నాళ్ళకి దూరంగా మనకి కనపడేలా ఉండమని మన పని పూర్తి చేస్కుని వచ్చేవాళ్ళం. తర్వాత ఒంటరిగా వెళ్లి వేగంగా వచ్చేసేవాళ్ళం. అక్కడ వెలుగు లేదు తప్ప మిగతా అంతా ఎప్పటిలానే ఉంది అని తెలిసాక నెమ్మదిగా భయం పోయింది మనకి.
జీవితంలో కూడా అంతే. ఏదో మనకి తెలియని ఏదో ప్రమాదం వస్తుంది అన్న భయం వచ్చినపుడు మనం భగవంతుడిని ప్రార్థిస్తాం. అప్పుడు ఆయన కొంచెం కొంచెం మనకి పరిస్థితులని అలవాటు చేసి నెమ్మదిగా మన కాళ్ళమీద మనమే నిలబడేలా చేస్తారు. నేనే దేవుడు అయితే అలానే చేస్తాను గాని ప్రతిసారి నా మీదనే ఆధార పడాలి అనుకోను. మనం ఉద్యోగం చేసే దగ్గర కూడా మన పై అధికారి మనకి అలవాటు ఐయ్యేవరకు సాయం చేసి నెమ్మదిగా మనకి బాధ్యతలు అప్పజెప్పి తను తనపనులు చేసుకుంటాడు గా.
ఈ ఉదాహరణ తో మనం దేవుడి మీద ఎంత వరకూ ఆధార పడాలి అంటే మనం నేర్చుకునే వరకు మాత్రమే. ఎప్పటికీ నువ్వు పక్కనే ఉండాలి అంటే మన పై అధికారి కూడా మనల్ని తీసేసి వేరే వారిని మన స్థానంలో కూర్చోబెట్టుకుంటారు.
అన్నీ తెలిసిన వారూ ఏమీ తెలియని వారూ ఎవరూ ఉండరు. మన భయాలూ, బలహీనతలూ మనమే గుర్తించాలి. మన బలహీనతలు మనమే బలంగా మార్చుకోవాలి. చరిత్ర పుస్తకంలో
పాఠాలుగా మారిన వారు అందరూ బలహీనతలు లేకుండా పుట్టలేదు. వాటిని తగ్గించుకుని, తొలగించుకుని గెలిచారు.
ఆత్మవిశ్వాసం:
నా భక్తుడు సైకిల్ నేర్చుకుంటున్నాడు అనుకోండి. సైకిల్ నడిపించడానికి కావాల్సిన సమాచారం అంతా చెప్పేసాక, నేను వెనకాల పట్టుకుంటాను నువ్వు నడిపించు అని చెప్పి ఏదో ఒకరోజు నేను వెనకాల పెట్టుకోకుండా ముందుకు పంపించేస్తాను. పడినా పర్వాలేదు. దెబ్బ తగిలినా పరవాలేదు. ఎందుకంటే నేను పట్టుకునే ఉన్నంతకాలం వాడికి సైకిల్ నడపడం రాదు కాబట్టి. ఒకసారి కూడా పడిపోకుండా సైకిల్ కూడా నేర్చుకోలేము కదా ! మరి జీవితాన్ని మాత్రం ఎలా నేర్చేసుకుంటాం.
నా భక్తుడు సైకిల్ సొంతగా నేర్చుకుని అవసరం అయితే నన్నో, మరొక మిత్రుడినో వెనకాల ఎక్కించుకుని వెళ్ళాలి అనుకుంటాను తప్ప, జీవితాంతం వాడి సైకిల్ వెనకాల పట్టుకుని నేను నడిపించాలి అనుకోను.
వెనకాల వదిలేసినా కూడా నేను నడపగలిగాను అంటే ఎవరూ లేకుండా కూడా నేను నడపగలను అనే విశ్వాసం వచ్చిన రోజునే సొంతంగా సైకిల్ తొక్కడం ప్రారంభిస్తాడు మన భక్తుడు. అంటే మనం విశ్వాసం నుండి ఆత్మ విశ్వాసం వచ్చే వరకే దేవుడు సాయం చేస్తాడు.
ఒప్పుకోలేకపోవడం:
ఈ అనంత విశ్వంలో మనం చాలా చిన్నవాళ్ళం. మనం కొన్ని మాత్రమే చెయ్యగలం. చాలా విషయాలు మన చేతుల్లో ఉండవు. ఈ నిజాన్ని మనం జీర్ణించుకోగలగాలి. మనం ఏం చేసినాకూడా మనం ప్రేమించే వాళ్ళు ఎప్పటికీ ప్రాణాలతోనే మనతోనే ఉండేలాగా చేయగలమా ? పోనీ మనం చావుని ఎదిరించగలమా? లేదు. చావు అనేది పెద్ద ఉదాహరణ కావొచ్చు. కానీ మనకు దూరం అయిన చాలా వాటిల్లో మనం పరిశీలించుకుంటే మన చేతుల్లో లేని విషయాలే చాలా ఉంటాయి. అది దూరం అవ్వడం, లేదా మనం అనుకున్నది జరగకపోవడం అనేది నిజం. అది ముందే జరిగిపోయింది. ఆ నిజాన్ని మనం అర్థం చేస్కుని జీర్ణించుకోలేకపోవడం వల్లనే మనం చాలా సార్లు కంటతడి పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.
తనది కాని దానికోసం బాధ పడే నా భక్తుడికి నేనేమీ చెయ్యను. ఎందుకు అంటే నేనేమీ చెయ్యలేను కాబట్టి. తనది ఐన దాన్ని తనదగ్గరకి చేర్చగలను గానీ తనది కాని దానికోసం ఎంత ఏడ్చినా నేనేం చెయ్యను ? చిన్నప్పుడు పక్కింటి వాళ్ళ వస్తువులు మనం మనకి నచ్చి తెచ్చేస్తే ఇంట్లో అమ్మ గానీ, నాన్న గానీ చూస్తే వాళ్ళకి తీసుకెళ్లి తిరిగి ఇచ్చేస్తారుగా! లేదా వాళ్లే తెలిస్తే వచ్చి తీసుకుని వెళ్ళిపోతారుగా. జీవితంలో కూడా అంతే. మనకి ఇవన్నీ బాగా తెలుసు కానీ ఆ పరిస్థితి వచ్చినపుడు మనకి మనం అన్వయించుకుని బాధపడకుండా ఉండేలా చేసుకోడమే సాధన.
మన కన్నీళ్ళన్నిటికీ కారణం మన కోరికలే. అది మనకి కూడా తెలుసు. సరే ఇప్పుడు నువ్వు దేవుడివి కదా! నేను రోజు ఉదయాన్నే నీ దగ్గరకి వచ్చి నీ చుట్టూ ప్రదక్షిణలు చేసి, నీ పేరుని కొన్ని వందల సార్లు నీకు వినిపించేలాగాను, నా మనసులోనూ స్మరించేసి నాకు ఏదో కావాలి అని అడిగాను అనుకో నువ్వు ఇస్తావా? నేనెవరికీ సాయం చెయ్యను, ఎవరినీ పట్టించుకోను, దొరికిన వరకు, కుదిరిన వరకు ఎలాగోలా ఇంకా ఎక్కువ సంపాదించడం ఎలా అనే ఆలోచనలో మాత్రమే ఉంటాను. కానీ నీకు మాత్రం అభిషేకాలు చేసేస్తాను. పైగా నాకు ఒక లక్షరూపాయలు ఇస్తే నీకు వంద రూపాయలు హుండీలో సమర్పిస్తాను, లేదా ఇంకో నూట ఎనిమిది సార్లు నా అందమైన మొహాన్ని నీకు చూపిస్తూ ప్రదక్షిణలు చేస్తాను అంటే నా కోరికలు తీరుస్తావా?
మిత్రమా! మన కోరికలు మనమే తీర్చుకోవాలి. నువ్వు అవసరంలో ఉన్నపుడు మాత్రం నీకు సమయానికి అందాల్సిన సాయం అందుతుంది. దీన్నే అదృష్టవశాత్తూ అంటాం, దేవుడు రూపంలో వచ్చి సాయం చేసావు అంటాం, సూపర్ ఎక్స్ అంటాం లేదా బటర్ ఫ్లై ఎఫెక్ట్ అంటాం. అవసరాలకి అంతం ఉంటుంది కాబట్టి సాయం అందుతుంది. కోరికలు అంతం లేనివి.
ఇక్కడ నా ఆలోచనలు కొన్ని ప్రస్తావించాలి అనుకుంటున్నాను.
నేను చిన్నప్పటి నుండీ మంచిగానే ఉన్నాను. కానీ నాకు కష్టాలు వస్తూనే ఉన్నాయ్. మంచిగా ఉండడం వలన ఏమి ఉపయోగం జరిగింది నాకు అనుకుంటాం. కానీ మనం మంచిగా ఉండడం వలన మన వల్ల ఎవరికీ హాని జరగలేదు కదా ! చెడు జరగలేదు అంటే మంచి జరిగినట్లే కదా! అలానే ప్రతి వాడూ పక్కవాడిని పట్టించుకుంటే అసలు మనషికి అధైర్యం ఎక్కడిది? కానీ బాధా కరమైన విషయం ఏంటీ అంటే సాటి మనిషి నుండి రక్షణకోసం కూడా మనం మానవాతీత శక్తి మీద ఆధారపడాల్సిన పరిస్థితిలో ఉన్నాం.
దేవుడి ఫోటో జేబులోనో ఎదురుగానే పెట్టుకుంటే మంచిది. అలా అని జరిగే ప్రమాదం ఏదో ఆగిపోతుంది అని కాదు. దేవుడు చూస్తున్నాడని భావనలో మనం ఏ తప్పు చెయ్యకుండా ఉంటామని. ఏ తప్పూ చెయ్యకపోవడం మంచే కదా!
మనం ఒకరికి సాయం చేస్తే, మనం గొప్పగా భావించకూడదు అంట. సాయం చేసే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞుడివి అయి ఉండాలి. మనం ఎప్పుడైతే సాయం చేశాం అనుకుంటామో ఎదుటివారినుండి ఆశించడం మొదలు పెడతాం. నేను ఇంత సాయం చేశాను కాబట్టి నాకు ఇలాంటి సమస్య వస్తే అవతలి వాళ్ళు కూడా నాకు ఇంత సాయం చేస్తారు అని ఆశిస్తాం. అలా జరగకపోతే నేను ఇంత చేశాను కానీ నాకు వాళ్ళు చెయ్యలేదు అని బాధపడడం మొదలు పెడతాం. బంధాలని కూడా దూరం చేసుకుంటాం. అందుకే చేసిన సాయం మర్చిపోవాలి. పొందిన సాయం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి అని.
ఇక్కడ నేను కొన్ని మాత్రమే ఉదాహరించాను. ఇలాంటివి చాలా ఉంటాయి. ఒకటి మాత్రం నిజం దేవుడు ఉన్నా లేకున్నా చివరకి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. కానీ మనల్ని తప్పుదోవ పట్టించి చాలా మంది నిజమైన నిన్ను, నిజమైన దేవుడిని తెలుసుకునే ప్రయత్నం చెయ్యనీకుండా చేస్తున్నారు. మన పూజలో చేసే ప్రతి పనిలో ఒక పరమార్థం ఉంటుంది. అది తెలుసుకోవడం మానేసి వేషాలకి మోసపోతున్నాం. దేవుడు అనే సూపర్ పవర్ తో వ్యాపారం చేసేస్తున్నాం. ప్రార్థన అంటే కోరికలు కోరడం కాదు. భగవంతుడు మనకు ప్రేమతో ఇచ్చిన వాటికి కృతజ్ఞత చెప్పడం. స్వార్థం విడిచి స్వచంగా ఉండడం.
కానీ, మనం ఏమి చేస్తున్నాం?
సాటి మనిషికి తోడుగా ఉంటూ, ప్రకృతిని పచ్చగా ఉంచినంత కాలం మనిషే దేవుడు. నిత్యసంతోషి.
- మీ నేస్తం వంశీ కమల్
- మీ నేస్తం వంశీ కమల్
Monday, October 31, 2016
విజయం చేసే శబ్దం కోసం మౌనం గానే పయనించు
ఎవరెవరో వస్తారు
ఎవరెవరో వెళ్తారు
జ్ఞాపకాలు ఇస్తారు
గాయాలు కూడా చేస్తారు
భయపడకు
బాధ పడకు
నీ లక్ష్యం నీకుంది
నీ గమ్యం నీకుంది
ఎవరో ఏదో అనుకుంటారని అనుకోకు, వాళ్ళ కోసం ఆగిపోకు
ఒకరోజు నీకు నువ్వు సమాధానం చెప్పుకోవాలి అని మర్చిపోకు
ముళ్ళైనా, పూలైనా,
ఎండైనా, కొండైనా,
అదరకు, బెదరకు,
అలవకు, అరవకు...
విజయం చేసే శబ్దం కోసం మౌనం గానే పయనించు
ఎదిగిన క్షణమున కిందికి చూస్తే అందరు నీకన్నా చిన్నే
ఎగిరిన పక్షికి ఎదిగిన మనిషికి పరిమితి కాగలదా మిన్నే
Friday, July 22, 2016
Thursday, May 12, 2016
పాత డైరీలో పేజీలు
ఇలాంటివి అసలు రాయొద్దు అనే అనుకుంటాను కాని రాయకుండా ఉండలేకపోతాను. భహుశా ఇదే లాస్ట్ కావొచ్చు.
చాలా మంది ని చూస్తున్నా కదా ఎందుకో కలుస్తారు, నడుస్తారు, ఏడిపిస్తారు, వెళ్ళిపోతారు... They Just Move On
కొందరు మళ్ళీ వద్దాం అనుకుంటారు, వస్తారు
కొందరు రాలేకపోతారు
కొందరు రాలేని చోటుకు వెళ్ళిపోతారు
అందరి లో కామన్ గుణం ఒక్కటే వాళ్ళ గురించి మనం ఏమి ఆలోచిస్తున్నామో తెలియకపోవడం
నేను నేను గా ఉన్న కాలాన్ని చెప్పమంటే అమ్మ నుండి నాన్న వరకు అని చెప్పోచ్చేమో... నాన్న చెప్పేవారు మనిషి ఒంటరి వాడు. అది మర్చిపోయినప్పుడే బాధ పడడం మొదలవుతుంది అని. నేను వినలేదు అనుకో..
అయినా కళ్ళ ముందే ఇంత మంది నవ్వుతూ కనిపిస్తుంటే ఒక్కడినే అని ఎందుకు అనిపిస్తుంది అంతా నావాళ్ళే అనిపిస్తుంది. కానీ అనుభవం చెప్పే పాఠాలు బాగా అర్థం అవుతాయి జీవితం ఇచ్చే గాయాలు బాగా గుర్తుంటాయి..
మళ్ళీ వద్దాం అని వెళ్ళిపోయావు గాని కల్సి పోరాడాలని ఎందుకు అన్పించలేదో ?
ఒక్క పలకరింపు అంత దూరం లో ఉన్నా "తను ఎందుకు వెళ్ళిపోయిందో ?"
కలిసి ఉండలేము అంటూనే కొందరు కలుస్తూనే ఉంటే కలిసి ఉండాలని ఉన్నా కూడా వీరు ఉండలేకపోవడం ఏమిటో?
నీటిలోని తామరాకు నీటిని తాకలేనట్లు
ఎవరికీ ఏమీ కామేమో మనం
ఈసారి ఐన నా కథలో అమ్మ ఉండాలి అనుకుంటున్నాను.
మేఘం, చినుకులు దూరం అయితే వర్షం అవుతుంది...
నిశీధి, నిద్ర దొంగాట ఆడుకుంటే నేను రాసే కథలు పుడతాయి...
ఇంక ఈ పాత డైరీ తో పని లేదు అనుకుంటా... జ్ఞాపకాలతో పాటే అటకమీద పెట్టేస్తా...
Monday, May 9, 2016
తన కోసం నేను రాసిన పాట
నా గతము లోని నీకు ఈ పాట అంకితం.
ఇది దైవ నిర్ణయమో నీ నిర్ణయమో నాకు తెలియదు.
~ బిందు కు నాని
ఔనని, కాదని ,
మనమనేదే లేదని...
నువ్వని, నేనని,
వేరుగా ఉన్నామని...
నా కంటి పాప లో చంటి పాప లా నిన్ను నూరేళ్ళు సాకాలని
కలగన్న కనులకి నిదుర దూరమై గుండె గాయమై మిగిలానని
విధి రాతో.... చెలి గీతో.... నువ్వు లేని లోకం లో బ్రతకనీ బ్రతకనీ...
నువ్వు అంటే నా గతము లోని చిరునవ్వు ఉన్న నేనే కదా
నువ్వు లేని ఈ నేను అంటే నా నవ్వు లేని నేనే కదా
గతము లోని ప్రతి చిన్న జ్ఞాపకం కరిగిపోయే కన్నీరు గా
గుండె చాటున ఉన్న రూపమే దూరమైంది నీ నీడగా
నా కంటి పాప లో చంటి పాప లా నిన్ను నూరేళ్ళు సాకాలని
కలగన్న కనులకి నిదుర దూరమై గుండె గాయమై మిగిలానని
విధి రాతో.... చెలి గీతో.... నువ్వు లేని లోకం లో బ్రతకనీ బ్రతకనీ...
Sunday, April 17, 2016
మళ్ళీ ఎందుకు ఇలా ??
ఎవరిని ప్రేమించినా నవ్వించాను
ఎవరు వెళ్ళిపోయినా భరించాను
ఎవరు చనిపోయినా తలొంచాను
నేను ఒంటరిగా పోరాడుతున్నాను అనుకున్నప్పుడు ఎవరు లేరు..
ఒంటరి అయిపోయినప్పుడు ఎవరు రాలేదు..
నేను ఇచ్చిన నవ్వులు తీసుకుని వెళ్ళిపోయారు గాని వెనక్కి తిరిగి నా కళ్ళలోకి కూడా కొందరు చూడలేదు..
ఒంటరిగా అడుగులు వెయ్యాలనేది విధి రాత అనుకున్నప్పుడు
ఈ కొత్త బంధాలు ఎందుకో అర్థం కావట్లేదు
వారి ఆనందం కోసం నేను ఎందుకు మళ్లీ నన్ను నేను కోల్పోవాలి ?
మన అనుకున్న వారి దగ్గర మన ఎమోషన్స్ చూపిస్తాం
కాని నాకు ఆ అవసరం లేదు కదా ?
అందరి ముందు నవ్వుతు ఉంటే సరిపోతుంది
ప్రపంచమే పరాయి లా కనిపిస్తున్నపుడు
నేనెందుకు నాలాగా ఉండాలి ?
నవ్వుతు ఉంటే సరిపోతుంది కదా ?
Tuesday, February 16, 2016
Friday, February 5, 2016
తను వెళ్లి పోయింది
తను వెళ్లి పోయింది ~ నా మనసు లోంచి
ఔనని, కాదని ,
మనమనేదే లేదని...
నువ్వని, నేనని,
వేరుగా ఉన్నామని...
నా కంటి పాప లో చంటి పాప లా నిన్ను నూరేళ్ళు సాకాలని
కలగన్న కనులకి నిదుర దూరమై గుండె గాయమై మిగిలానని
విధి రాతో.... చెలి గీతో.... నువ్వు లేని లోకం లో బ్రతకనీ బ్రతకనీ...
Thursday, January 21, 2016
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం
అమ్మ నాకు తెలియని దైవం, నాన్న నాకు తెలిసిన గురువు...
చిన్నప్పటి నుండి స్నేహం అంటే అంత ఇష్టం పెరగడానికి కారణం ఆయనే
వాళ్ళ ఫ్రెండ్స్ ని ఎగ్జాంపుల్ గా చూపించి నా ఫ్రెండ్స్ నాకు గొప్పగా కనిపించేలా చేసే వారు,
నా ఫ్రెండ్స్ అనగానే ప్రత్యేకం గా చూసే వారు....
నాకు ఊహ తెలిసినప్పుడే చెప్పేవారు మనం ఫ్రెండ్స్ అని...
నాకు పరిచయం అయిన మొదటి ఫ్రెండ్ మా డాడ్..
నాకు పరిచయం అయిన మొదటి ఎమోషన్ ఫ్రెండ్...
నే కవితలే రాసినా,
పిచ్చి గీతలే గీసినా,
భలే ఉంది మళ్ళీ గీయరా అని ప్రోత్సహించిన
నాన్నకి ప్రేమతో అంకితం
నే మాటలే తూలినా,
చిన్న తప్పు నే చేసినా,
ఒక్క చూపుతో నన్ను మార్చిన పాటానివి నువ్వే
నన్ను నువ్వు విడిచినా
జ్ఞాపకం గా మారినా
కన్నీళ్లు ఆపుకొని నేను నవ్వే ప్రతి అబద్ధపు నవ్వు నువ్వే
ఈ అందమైన రంగుల లోకాన
వేలు పెట్టి నడిపించలేనంటు
నీడ గా మారి కనిపించకుండా పోయిన దీపానివి నువ్వే
నువ్వు దూరమైనా....
నేను ఒంటరైనా....
ఇకపై నా ప్రతి క్షణం నీకే అంకితం
ఎందుకంటే,
నాకు నీ మీద ఉన్న కోపం మాత్రమే నాకు తెలుసు
నాన్న మీద ఉన్న ప్రేమ నాన్న వెల్లిపొయాకే తెలుసుకున్నాను
అందుకే,
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం
Monday, December 28, 2015
జ్ఞాపకాల చినుకులు
మిత్రమా !!!
కాలం తో పరుగు లు తీస్తూ,
కలానికి విశ్రాన్తినిచ్చాను...
అప్పుడప్పుడు ఆగి వెనక్కి చూస్కునే నాకు గుర్తొచ్చేది నువ్వే,
సంపాదనలో మునిగి స్నేహితులను,
ఆప్తులతో అలసి ఆప్తమిత్రులను మరిచిపోకు..
నీ కోసం చూసే మిత్రులకు ఒక పలకరింపు చాలు..
నింపేసుకుంటారు చిరునవ్వుల రంగులను పెదాల నిండా..
చల్లేసుకుంటారు జ్ఞాపకాల చినుకులు గుండెల నిండా .. :)
నీ '''నేస్తం...
Saturday, October 24, 2015
నింగి నేల కలిసే చోట
తొందరలో చూసానా? అని పదే పదే చూసాను,
చూపులు కలపని కనులను చూస్తూ కలలను కంటూ నిలిచాను.
మాటలు చాలని అందం నీదని పాటలు ఎన్నో రాసాను,
నా గుండెల్లోనే దాచాను.
మాటల్లో చెప్పలేకనే ఎన్నో మాటలు దాచాను,
కొంచెం దూరం అయ్యాను.
గగనం చేరిన తారకలా నువ్వే దూరం ఐపోతే,
కలలతో చేసే యుద్ధం లో నిదురకి దూరం అయ్యాను..
కన్నుల ముందు నువ్వు లేక కలిసే దారే కనపడక,
ఒంటరిగానే నిలిచాను, నేనొంటరిగానే వగచాను.
ఇదిగో ఇదిగో నా గుండెల్లో నవ్వుల సవ్వడి వినిపిస్తోందా?
చప్పుడు చెయ్యని తలుపుల (రెప్పల) వాకిట నీ నవ్వుల వల్లిక కనిపిస్తోందా?
జ్ఞాపకాలని దాపెట్టేసా, మనసు మాటకి ఊ కొట్టేసా..
మనసు మార్చారా ఓ పరమేశా,
(తనని కలపరా ఓ జగదీశా.. )
చిగురుటాకు పై వాన చినుకులా,
సల్ల కుండ పై వెన్న నురగలా ,
వాన నీటి పై బొమ్మ పడవలా,
'చిన్ని' పాప లా నన్ను చేరగా...
నేను నేనయ్యాను. - - -
Wednesday, September 30, 2015
కల అనుకోనా..?
గమ్యమే తెలియని ప్రయాణం,
నీకోసం ఎదురు చూసిన సమయం..
కాలమే ఆగింది కన్నీరొకటి జారింది,
నీ గొంతు విన్న ఆ నిమిషం..
సంద్రమై పొంగింది మనసు సంతోషం తో..
ఎదురు చూపులు ముగిసిన ఆనందంలో..
వరమనుకోనా??
కునుకల్లే ఎదురొచ్చి ఒడిలోన లాలించే కలవనుకోనా?
నిజమనుకోనా??
చిరునవ్వే ఎదురొచ్చి కన్నీళ్ళను తుడిచేసే భ్రమ అనుకోనా?
గతమనుకోనా??
కడ దాకా నాతో నడిచే కనిపించని దారులు వెతికే జతవనుకోనా..
చిరుగాలై దరి చేరావే,
చలి గాలై గిలి పెట్టావే,
హరి విల్లుని తలపించేల,
వర్ణాలె కురిపించావే
వరమనుకోనా?? నిజమనుకోనా?? గతమనుకోనా??
లేక
ఇదంతా
కల అనుకోనా..?
Wednesday, September 16, 2015
జ్ఞాపకం కూడా చెరిగిపోతుంది.. కొందరి స్నేహం లాగా
ఈ ప్రపంచం లో ప్రేమ అంటూ ఏదీ లేదు
ఉన్నది ఒకటే... నమ్మకం...
ప్రతి మనిషి కోరుకునేది,
ప్రతి బంధం కోరుకునేది, నమ్మకం...
మనకి కష్టం వచ్చినపుడు కనపడతారని,
కన్నీళ్ళొచ్చినపుడు కళ్ళ ముందు ఉంటారని,నమ్మకం...
ఆ నమ్మకాన్ని ఇవ్వలేకపోయినప్పుడు,
బంధం బలహీనం అవడం మొదలవుతుంది...
మనసు ఆశ పడడడం మానేస్తుంది..
బాధ పడడం మొదలవుతుంది..
బాధని మర్చిపోయే ప్రయత్నం లో
నెమ్మదిగా ఒక బంధం జ్ఞాపకం అయిపోతుంది...
కొన్నాళ్ళకి జ్ఞాపకం కూడా చెరిగిపోతుంది.. కొందరి స్నేహం లాగా...
కన్నీళ్లు ఎప్పుడూ గుండెల్లో దాచుకోవాలి,
చిరునవ్వు ఎప్పుడూ పెదవి పై ఉంచుకోవాలి,
జీవితం నాకు నేర్పింది ఇదే
Wednesday, August 19, 2015
నడవాలి నాతో నేను
నా తోడు ఇకపై 'నేను'
అందరిని ఓదార్చాను
ఒంటరిగా నిట్టుర్చాను...
ఎవ్వరికి ఏమి కాను
నాకంటూ ఉన్నది 'నేను'
ఎన్నో నవ్వుల్ని కోరాను
కన్నీటి జడిలోన మిగిలాను..
ఎన్నో కలలెన్నో కన్నాను
నేడు నిదురే పోకున్నాను
ఎన్నో హృదయాలు కదిపాను
కాని ఒంటరిగా మిగిలాను
అమ్మంటూ గురుతే లేదు
నాన్నింక రానే రాడు
నడవాలి నాతో నేను
ఇకపైన సోలో 'నేను' ...
Thursday, July 23, 2015
సీతా కోక చిలుక
ఒక చక్కటి పువ్వు మీద వాలింది
మృదువుగా మాట్లాడింది
మధురాన్ని తాగింది
వీడుకోలు పలికింది
చిరునవ్వుతో ఎగిరింది
ఆ కొద్దిపాటి పరిచయానికే మురిసిన పువ్వు
తన కొత్త నేస్తం కోసం రోజు ఎదురు చూసేది
ఆ సీతా కోక చిలుక ఎగురుకుంటూ వెళుతోంది
ఇంకొక పువ్వుపై వాలింది, నవ్వుతు మాట్లాడింది, వీడుకోలు పలికింది
మొదటి పువ్వు ఇంకా ఎదురుచూస్తూ ఉంది
ఒకరోజు ఎక్కడ తేనె దొరకని చిలుక మొదటి పువ్వు దగ్గరకు వచ్చింది
నవ్వుతు మాట్లాడింది తేనె లేదని తెలిసి మెల్లగా వెళ్లిపోయింది
మళ్లీ పువ్వు ఎదురు చూడడం మొదలు పెట్టింది
ఒకరోజు భయంకరమైన గాలి వీచింది
చిలుక పట్టు తప్పింది, ఒక కొమ్మను పట్టింది, నెమ్మదిగా జారింది,
పువ్వు దగ్గరకు చేరింది..
పువ్వు ఆనందానికి అవధులు లేవు ..
కుదిరినంత ఆసరా అందించింది..
చాలాసేపు మాట్లాడింది..
వర్షం తగ్గింది, చిలుక ఎగిరింది...
ఇంకా ఎదురు చూస్తే పువ్వుది అమాయకత్వం అంటారు...
Thursday, June 25, 2015
మనకెదురయ్యే ప్రతి మనిషి
నా జీవితం లో ఎదురయ్యే ప్రతి సంఘటనా ఎవరో ఓపికగా రాసిన కవిత లా ఉంది..
ఎదురయ్యే ప్రతి పాశం ప్రాస లా ఉంది,
ఏదో చిన్న ఆశలా ఉంది.
నాకు ఎదురయ్యే ప్రతి రోజు ఎవరో కన్న కలలా ఉంది..
ఇదంతా భ్రమలా ఉంది,
కొంచెం భయం గా ఉంది.
ఎదురయ్యే ప్రతి నవ్వు ఎవరో గీసిన చిత్రం లా ఉంది..
విచిత్రం గా ఉంది,
ఎంతో చక్కగా ఉంది.
నా ప్రపంచం ఎవరో చెక్కిన శిల్పంలా ఉంది..
ఒక కళలా ఉంది,
మాయ లా ఉంది.
మనకెదురయ్యే ప్రతి మనిషితో మనకి సంబంధం ఉంది..
అనేది నిజం లా ఉంది,
నిజం గా ఉంది.
నీ పరిచయం దేవుడు రాసిన కథలా ఉంది..
Subscribe to:
Posts (Atom)