Thursday, February 18, 2010

నువ్వు లేక నేను




నువ్వు లేక నేను లేనని నీకు తెలుసు,
క్షణ క్షణం కన్నీటి కెరటం గుండెను తడి చేస్తూ కరిగించేస్తుంటే,
నువ్వు నన్ను మర్చిపోయావనే నిజాన్ని మరచిపోలేకపోతున్నాను...

నీ జ్ఞాపకాల మంటలలో మనసు కాలిపోయింది..
ఐనా దానికి నిన్ను ప్రేమించడం మాత్రమే తెలుసు...

ధైర్యం చేప్పడానికని దగ్గరకు తీసుకున్న నీ చేతి స్పర్శ నా చేతిలో ఉంది,
నీ కళ్ళలో ఒకనాడు జారిన నీటి బొట్టు పదిలంగా నా గుండెలో ఉంది,
పదే పదే నువ్వు పిలిచిన నా పేరు నా మనసు లో ఉంది,
నిన్ను ఒక్కసారి చూడాలని ఆశగా ఉంది,
కానీ నీ రూపం మాత్రం కళ్ళు తుడుచుకున్నా కనిపించడం లేదు.
వర్షమైతే ఆగేదేమో కానీ ఇది కన్నీటి వరద...
అందరూ ప్రేమిస్తున్న నన్ను నేను ప్రేమించుకోలేకపోతున్నాను నీ ద్వేషం గుర్తొచ్చి...
నీ వాడిని మాత్రమే అనుకున్న నేను నీకే పరాయిని ఐపోయాను...
నువ్వడిగినవి అన్ని ఇస్తున్నాను అనుకున్నాను గాని నా సంతోషాన్ని అడుగుతావనుకోలేదు...
ప్రతి క్షణం నిన్ను సంతోషం గా చూస్కోవాలి అనుకున్నా కానీ నేను దూరం గా ఉంటేనే నువ్వు సంతోషం గా ఉంటాను అన్నావ్...


ఆ నిముషమే నేను మరణించాను..
.



--
Ur's
'''Nestham...

1 comment: