నిశీది లో నేను నడకను మొదలెట్టాను...
సంద్రంలో ఈదుతున్నానో... ఎడారిలో నడుస్తున్నానో తెలీదు...
దాహం మాత్రం ఒక్కటే...
ముళ్ళ దారి అని భయపడలేదు...
ఎందుకంటే ఈ దారిలో నేనే మొదట కాదు కదా...
నా ముందు వెళ్ళిన వారి అడుగులు కనపడక కలవరపడుతున్నా ...
ఎందుకంటే నా వెనుక వచ్చే వారికి కూడా మార్గం కనపడదేమో అని ...
నేనే చివరి వాడిని కాదు కదా...
ఎండ మావి కోసం ఎదురు చూడడంలేదు ...
దాహం తీర్చలేని సంద్రం గురించి ఆలోచించడం లేదు...
ఎవరో చెప్పినట్లు గమ్యం కాదు..., నాపయనం అంటే నాకిష్టం ...
అలాంటి పయనం లో నాకు తోడు కావాలి...
కొట్టిన పిట్టని అందరికి పంచగలిగే వేట గాడు కావాలి ...
ఎక్కుపెట్టివ అమ్ముని వదలడం నేర్పగల ఓర్పు ఉండాలి...
భయం వలన కాదు మార్గం కోసం ఆ తోడు...
మార్గం అంటూ కనిపిస్తే ముళ్ళ బాట ఐనా చదును చెయ్యొచ్చు ...
బాటసారిగా మొదలైన నా పయనం లో గమ్యం చేరగలనా...
చేతిలో ఉన్న దీపం ఆరిపోయేలోపు దారి చూపగలనా
చెరిగిపోకుండా బలమైన అడుగులు వెయ్యగలనా.
No comments:
Post a Comment