Wednesday, June 16, 2010

విద్యార్థి

జీవితమంతా అంకెల లంకెలు..
చిన్నపుడు ఎన్ని మార్కులు వచ్చాయి అని అడిగారు
ఇప్పుడు ఎన్ని అంకెల జీతం అని అడుగుతునారు..
ఛీ... జీవితం...

మీ అంకెల సంకెళ్ళు పసి మొగ్గలు మోయలేవు
మొగ్గలు వికసించాలంటే మొక్కకు నీళ్ళు పోయండి చాలు...
బలవంతం గా రేకులు తెరుస్తుంటే నలిగిపోతున్నాం..
వర్షం లో ఆడుకుని ఎంత కాలం అయిందో..
నీళ్ళు పోయండి సంతోషిస్తాం
ఏమి కాయ కాయలో మీరే నిర్ణయిస్తే,
మేము జీవించేది ఎప్పుడు?

4 comments:

  1. ఓడెమ్మా జీవితం

    ReplyDelete
  2. Naadi same dialogue, maree baagodemo ani chee jivitham ani pettaa..

    ReplyDelete
  3. బాగుంది.. ఎందుకో సడన్ గా బొమ్మరిల్లు సినిమా గుర్తొచ్చింది..

    ReplyDelete