Friday, June 25, 2010

స్వాతి చినుకులు

ఆకాశం లో మబ్బు పట్టిన ప్రతిసారి వర్షం కురవదు కదా
పరిచయం ఐన ప్రతి మనిషి స్నేహితుడు కాడు కదా అనుకున్నాను..
తొలి చినుకు నన్నెప్పుడు తాకిందో తెలీదు
నీ స్నేహపు జల్లులలో తడుస్తున్నాను..
చిన్న చిన్నగా ఉరిమినా కూడా కావాలి నీ కూరిమి...
కనపడని స్నేహమా కలకాలం ఉండుమా
కన్నీటి చార గా నను విడిచి పోకుమా..
చల్లని సాయంత్రం చినుకులలో తడిస్తే
వెలిసిన వానలో ఒంటరిగా నడిస్తే
ప్రతి రోజు నువ్వే నన్ను పలకరిస్తే
ఏదో ఆనందం...
మాటలలో చెప్పలేను మధురమైన నీ స్నేహం
మరచిపోవద్దని అడుగుతూ నిను మరువలేని నీ నేస్తం...

3 comments:

  1. మాటలలో చెప్పలేను అంటూనే స్నేహం గురించి మధురంగా చెప్పారు.
    ఎలా మరువను నేస్తం...

    ReplyDelete