తొలకరి లో తడిసినట్లుంది మనసుకి జలుబు చేసింది
పువ్వులలోని తేనె ను తాగినట్లుంది మది పులకరించింది
చెరువులోని చిన్ని చిన్ని చేపలను చేతులతో పట్టుకుని ఆడుకుంటున్నట్లుంది
ఎందుకో తెలియదు నీ పరిచయం మనసుకు హాయిగా ఉంది
తెల్లవారు జామున లేచి చెరువులో ఈత కొట్టినట్లుంది
గిలి గింతలు పెడుతోంది
అర్దరాత్రి వేళ వెన్నెలలా ఉంది
చుక్కలు లెక్క పెట్టమంది
చలి కాలపు చలి మంటలా వెచ్చగా
వేసవి లో చలివేంద్రం లా
వర్షం లో గొడుగు లా
పువ్వు పైన నీటి బొట్టులా
నీ పరిచయం తో ప్రపంచం తో పోయింది పరిచయం
నీ ఊహలె నా కొత్త ప్రపంచం ...
chalaa chaalaa baagundi keep it up.ilaane manchi kavitalu raastu vundandi
ReplyDeleteThank you very much....
ReplyDelete>> తొలకరి లో తడిసినట్లుంది మనసుకి జలుబు చేసింది
ReplyDeleteఎందుకో ఈ expression ఈ కవితలో పొసగనట్టుంది.
Naaku alaage anipinchindikaani nijamgane naa cheli tholakarilo thadisi, jalubu thechukundi.. naa manasanthaa thaane unnappudu naa manasuki jalubu chesinatlekada mari...
ReplyDelete