నన్ను నేనే మరిచి పోవడం
నిన్ను మాత్రం మరువలేకపోవడం
కను రెప్ప వాలనీయడం
కలలు జారనీయడం
శ్వాస మరచిపోవడం
నీ ఊహ శ్వాసించడం
జ్ఞాపకాల నీడలలో
నిన్ను తలచు తలపులలో
మధురమైన భావనలో
వేచి ఉండలేను మరుజన్మ దాకా
విడిచి ఉండలేను మరు క్షణము దాకా
నీతో ఉన్న ఈ క్షణమే నాకు జీవితము
నీ ఉహలే నా జీవనాధారము
మాటలే లేవు చెలీ నీ చెలిమిని వర్ణించ
మరణమే చెలీ నువ్వు లేక జీవించ
కానీ నాకు తెలుసు
నీ నవ్వు లేని క్షణాలలో
నీ చెలిమి లేని జగాలలో
నువ్వు లేని నిజాలలో
నేను బ్రతకాలని...
Thanks
ReplyDeleteమీరు సినిమాలకి పాటలు రాస్తారా? అంత బాగా రాస్తున్నారు అన్నీ
ReplyDelete