Monday, August 29, 2011

నువ్వు లేని ఒక నిముషం యుగమైనా గడవదే

నా మౌనం మాట్లాడితే అది నువ్వు
నా కోపానికి చిరునవ్వు నువ్వు
నా స్నేహం నువ్వు నా రాక్షసి నువ్వు
నా నేస్తం నువ్వు నా ప్రాణం నువ్వు
నలుగురిలో ఉన్నప్పుడు నా ఒంటరితనం నువ్వు
నీతో ఉన్నప్పుడు నా ప్రపంచం నువ్వు
కలలో కలవరింత లో నువ్వు
నేను పలికే పలవరింత నువ్వు
కానీ నాకోసం కాదు నువ్వు

Friday, August 26, 2011

మనసెరిగిన మౌనమా ...


ఇది అని తెలియని అలజడి ఏదో మొదలైన్దిలే
కనులలో నీ రూపు తప్ప కలలకు చోటే లేకున్దిలే
మనసును గెలిచినా మనసొకటి ఉందని
నన్నే వలచిన నీదే అని
మాటలు మరచి మౌనము వలచి
గాలిలో నేనే తెలేనులే

మౌనం నిండిన నా హృదయం లో గుడిని నీకు కట్టాను
ఇంకెవ్వరికీ చోటివ్వను అని మాటిస్తున్నాను
తొలకరిలో నా యద సడి లో వినిపించే ఒక రాగం
వేణువు లా నా యద మీటే ఆ సడికి నీవే గమ్యం

కలలు నిండిన కనులకు విశ్రాంతినిస్తూ
రెప్పల మాటున రేయి పవలు నిలిచిన
నీ రూపం కనుమరుగైపోతుంటే
పల్లవి లేని పాట లాగ శ్రుతి లేని గీతం లా
గజిబిజి గా మారింది జీవితం

Thursday, August 18, 2011

పోవద్దె .. నన్నొదిలి ప్రేమా..

నన్నొదిలి నీడ వెళ్లిపోతోందా..... కన్నొదిలి చూపు వెళ్లిపోతోందా ...
వేకువనే సందె వాలి పోతోందే ..... చీకటిలో ఉదయం ఉండి పోయిందే ...
నా ఎదనే తొలిచిన గురుతుగా నిను తెస్తున్న....
నీ జతలో గడిపిన బ్రతుకిక బలి అవుతున్న...
నువ్వుంటే నేనుంట...ప్రేమా... పోవద్దె ....పోవద్దె ..ప్రేమా..
నన్నొదిలి నీడ వెళ్లిపోతోందా..... కన్నొదిలి చూపు వెళ్లిపోతోందా ...
ఇన్ని నాళ్ళు నీ వెంటే సాగుతున్న నా పాదం... వెంట పడిన అడుగేదంటుందే...ఓ ఓఓఓ....
నిన్న దాక నీ రూపం నింపుకున్న కనుపాపే నువ్వు లేక నను నిలదీస్తుందే....
కోరుకున్న జీవితమే... చేరువైన ఈ క్షణమే.... జాలి లేని విదిరాతే శాపమైనదే..
మరు జన్మే ఉన్నదంటే బ్రహ్మనైన అడిగేదొకటే ...ఏమంత మబ్బు తన అడలిక సాగని చోటే....
నువ్వుంటే నేనుంట...ప్రేమా... పోవద్దె ....పోవద్దె ..ప్రేమా..
నువ్వుంటే నేనుంట...ప్రేమా... పోవద్దె ....పోవద్దె ..ప్రేమా..

Tuesday, August 16, 2011

నువ్వు లేవు అనేదే లేని ఒంటరి తనమే బాగుంది


నాకోసం నువ్వు లేనప్పుడు
నాతో నేను నాలో నేను
నను వదిలి నువ్వు వెళ్ళే ఇప్పుడు
నాకు నేను కూడా లేను
అపుడు ఇప్పుడు ఒంటరినే
ఇప్పుడు నువ్వు లేవనే బాధ తోడు ఐంది

తొలకరి చాలా ఆహ్లాదం గా ఉంటుంది కదా అని ఆనందిస్తూ
అది శాశ్వతం కాదని మరచిపోయాను
ఆనందం లో తడిచిపోయాను కానీ
ఒంటరిగా మిగిలిపోయాను
గతం లోకి తొంగి చూసే అవకాశం లేక
మౌనం గా ముందుకే వెళుతున్నాను
మళ్ళీ ఒంటరిగా

Friday, August 5, 2011

పన్ను - పెయిను

(నా స్మైల్ ఏ నా స్టైల్ అని స్టేటస్ మెసేజ్ పెట్టుకున్నందుకు నాకు పడిన శిక్ష.
Beware of status msgs :-)
పోకిరి స్టైల్ లో పండగ చేస్కోండి)
ప : 
నొప్పి నొప్పి పన్నంత నొప్పి
జివ్వుమంటూ లాగేస్తాది
పట్టి పట్టి నరాలు మెలేసి
దవడ మొత్తం పికేస్తాది
అసలేమైందో తెలియకుందిరో బాబో
రాతిరంతా నిదర లేదు  పన్నుడ గొట్టాలి రోయ్  
దేవ దేవ దేవ దేవ పన్ను దేవుడా  
దేవ దేవ దేవ దేవ పన్ను దేవుడా  
పళ్ళ డాక్టర్ ఎక్కడున్నా కలిసి తీరాలి రో  
దుంప తెంపి చంపుతోంది   
చ:  
నన్నిలా గుంజకే   నొప్పితో చంపమాకే  
వెళ్ళని తొందరగా  డాక్టర్ నీ కలవనీవే 
దేవుడా ఆ వెయ్యోదిలేసింది డాక్టర్ కి  
అయినా ఆ నొప్ప్పుంది పూర్తిగా  
రాతిరంతా కునుకు లేదు  
డాక్టర్ నీ మార్చాలి రో   
దేవ దేవ దేవ దేవ పన్ను దేవుడా  
దేవ దేవ దేవ దేవ పన్ను దేవుడా 
బ్రష్షు మీద పేస్టు పెట్టి రుద్దు తున్నాను రో  
ఐనా గాని పళ్ళు పోయాయి ...  
దేవ దేవ దేవ దేవ పన్ను దేవుడా  
దేవ దేవ దేవ దేవ పన్ను దేవుడా 


Monday, August 1, 2011

నువ్వు దూరమైతే ఏదో ఐపోతున్నా...


ఏదోలా ఉందే నువ్వే లేక
ఏమి బాగోదే నువ్వేల్లాక
క్షణమైనా విడిచి ఉండలేక
పోతోందే ప్రాణం మరువలేక

గుండెల్లో నిలిచి ఉండక
కన్నీటి బొట్టై జారాక
మనసు బరువు పెరిగాక
కనుల ముందు నిలిచాక

కల నువ్వే అని తెలిసాక
కన్నీటి బరువు ఆపలేక
చిరునవ్వు నౌక
చిగురాశ మీద చినుకై నిలిచా