(నా స్మైల్ ఏ నా స్టైల్ అని స్టేటస్ మెసేజ్ పెట్టుకున్నందుకు నాకు పడిన శిక్ష.
Beware of status msgs :-)పోకిరి స్టైల్ లో పండగ చేస్కోండి)
ప :
నొప్పి నొప్పి పన్నంత నొప్పి
జివ్వుమంటూ లాగేస్తాది
పట్టి పట్టి నరాలు మెలేసి
దవడ మొత్తం పికేస్తాది
అసలేమైందో తెలియకుందిరో బాబో
రాతిరంతా నిదర లేదు పన్నుడ గొట్టాలి రోయ్
దేవ దేవ దేవ దేవ పన్ను దేవుడా
దేవ దేవ దేవ దేవ పన్ను దేవుడా
పళ్ళ డాక్టర్ ఎక్కడున్నా కలిసి తీరాలి రో
దుంప తెంపి చంపుతోంది
చ:
నన్నిలా గుంజకే నొప్పితో చంపమాకే
వెళ్ళని తొందరగా డాక్టర్ నీ కలవనీవే
దేవుడా ఆ వెయ్యోదిలేసింది డాక్టర్ కి
అయినా ఆ నొప్ప్పుంది పూర్తిగా
రాతిరంతా కునుకు లేదు
డాక్టర్ నీ మార్చాలి రో
దేవ దేవ దేవ దేవ పన్ను దేవుడా
దేవ దేవ దేవ దేవ పన్ను దేవుడా
బ్రష్షు మీద పేస్టు పెట్టి రుద్దు తున్నాను రో
ఐనా గాని పళ్ళు పోయాయి ...
దేవ దేవ దేవ దేవ పన్ను దేవుడా
దేవ దేవ దేవ దేవ పన్ను దేవుడా
బాగుందండీ మీ పన్ను పాట. పోయిన వారం మొత్తం నేను అలానే బాధ పడ్డాను.. చివరికి Anti-biotics తో controlలోకి వచ్చింది.
ReplyDeleteహహహ మీరు పాటల పేరడీలు కూడా రాస్తారా? బాగుంది మీ నొప్పి పాట
ReplyDelete