Friday, August 26, 2011

మనసెరిగిన మౌనమా ...


ఇది అని తెలియని అలజడి ఏదో మొదలైన్దిలే
కనులలో నీ రూపు తప్ప కలలకు చోటే లేకున్దిలే
మనసును గెలిచినా మనసొకటి ఉందని
నన్నే వలచిన నీదే అని
మాటలు మరచి మౌనము వలచి
గాలిలో నేనే తెలేనులే

మౌనం నిండిన నా హృదయం లో గుడిని నీకు కట్టాను
ఇంకెవ్వరికీ చోటివ్వను అని మాటిస్తున్నాను
తొలకరిలో నా యద సడి లో వినిపించే ఒక రాగం
వేణువు లా నా యద మీటే ఆ సడికి నీవే గమ్యం

కలలు నిండిన కనులకు విశ్రాంతినిస్తూ
రెప్పల మాటున రేయి పవలు నిలిచిన
నీ రూపం కనుమరుగైపోతుంటే
పల్లవి లేని పాట లాగ శ్రుతి లేని గీతం లా
గజిబిజి గా మారింది జీవితం

5 comments:

  1. చాలా బాగారాస్తున్నారు...

    ReplyDelete
  2. నిజం గా బాగున్నాయో లేదో తెలీదు మీరంతా కామెంట్స్ ఇస్తుంటే ఇంకా రాయాలి అనిపిస్తోంది
    థాంక్స్ : )

    ReplyDelete
  3. కనుమరుగు కానీయకండి.
    రాస్తూ వుండండి.

    ReplyDelete
  4. కనులకు విశ్రాంతినిచ్చినా మీ కలానికివ్వకండి మీ భావుకత బాగుంది.

    ReplyDelete