Friday, June 25, 2010

స్వాతి చినుకులు

ఆకాశం లో మబ్బు పట్టిన ప్రతిసారి వర్షం కురవదు కదా
పరిచయం ఐన ప్రతి మనిషి స్నేహితుడు కాడు కదా అనుకున్నాను..
తొలి చినుకు నన్నెప్పుడు తాకిందో తెలీదు
నీ స్నేహపు జల్లులలో తడుస్తున్నాను..
చిన్న చిన్నగా ఉరిమినా కూడా కావాలి నీ కూరిమి...
కనపడని స్నేహమా కలకాలం ఉండుమా
కన్నీటి చార గా నను విడిచి పోకుమా..
చల్లని సాయంత్రం చినుకులలో తడిస్తే
వెలిసిన వానలో ఒంటరిగా నడిస్తే
ప్రతి రోజు నువ్వే నన్ను పలకరిస్తే
ఏదో ఆనందం...
మాటలలో చెప్పలేను మధురమైన నీ స్నేహం
మరచిపోవద్దని అడుగుతూ నిను మరువలేని నీ నేస్తం...

Sunday, June 20, 2010

గమ్యమే లేని గమనానికి మార్గం ఎవరు చెప్పగలరు..?

చిగురించే ఆశవి నువ్వైతే
బ్రతికించే శ్వాసను నేనౌతా ..
కనిపించే రూపం నీదైతే
నీ గుండె సడి వింటూ జీవితం గడిపేస్తా..
కన్నీటి భారం మోయలేక కళ్ళు విలపిస్తున్నాయి ..
నీ గుండె సడి వినలేని మనసు రోదిస్తోంది..
మౌనం తో కూడా మనిషిని చంపొచ్చని నిన్ను చూసాకే తెలిసింది..
మరణం కూడా హాయిగా ఉంటుందని మొదటిసారి అనిపించింది..
తన కౌగిలిలో నన్ను కలుపుకోవాలని ఆశగా ఎదురుచుస్తోందో ఏమో
మనస్పూర్తి గా మరనిన్చాలనిపిస్తోంది..
నీ మనసులో నేను లేనని తెలిసినప్పుడు బాధమాత్రమే కలిగింది..
నీకు మనసే లేదని తెలిసాకే నా మనసు మరణించింది...
మరణంతో బ్రతుకుతున్న మొదటి వ్యక్తిని నేనేనేమో...
నీతో బ్రతకలేను,
నిను మరువలేను..
నీ ఆలోచననుండి తప్పించుకోలేను,
నీకోసం ఆలోచిస్తూ మరనించలేను...
మరుపన్నది లేదా నా అలసిన మనసుకు...
జవాబు లేని ఈ ప్రశ్నలను ఎవరినడగాలి..?

Saturday, June 19, 2010

ఆశతో

ప్రాణం చెప్పే మాటలు వింటే
మరణాన్ని ప్రేమించాలనిపిస్తోంది...
కాళ్ళు లేని వాడు కాళ్ళ కోసం బాధపడితే
కాళ్ళు ఉన్న వాడు చెప్పులు లేవని ఏడుస్తాడు..
జాబు లేని వాడు జాబు కోసం ఏడిస్తే
ఉన్నవాడు జీతం చాలక ఏడుస్తాడు...
ఎవడు ఈ లోకం లో ఆనందం గా ఉండడా?
పుడుతూనే అమ్మని ఏడిపిస్తాడు,
పుట్టానని చెప్తూనే ఏడుస్తున్నాడు..
చచ్చాక కూడా తన వాళ్ళని ఏడిపిస్తున్నాడు..
నువ్వు చస్తే నీకోసం నీ వెనకాల ఎంతమంది
నడుస్తారో బ్రతికుండగా లెక్క పెట్టుకోగలగడమే జీవించడం అంటే..
ప్రేమ, స్నేహం, జీవితం ఏది శాశ్వతం కాదు..
శాశ్వతం ఐనా ఒక స్నేహం కోసం ఎదురుచూస్తూ మీ నేస్తం...

Wednesday, June 16, 2010

విద్యార్థి

జీవితమంతా అంకెల లంకెలు..
చిన్నపుడు ఎన్ని మార్కులు వచ్చాయి అని అడిగారు
ఇప్పుడు ఎన్ని అంకెల జీతం అని అడుగుతునారు..
ఛీ... జీవితం...

మీ అంకెల సంకెళ్ళు పసి మొగ్గలు మోయలేవు
మొగ్గలు వికసించాలంటే మొక్కకు నీళ్ళు పోయండి చాలు...
బలవంతం గా రేకులు తెరుస్తుంటే నలిగిపోతున్నాం..
వర్షం లో ఆడుకుని ఎంత కాలం అయిందో..
నీళ్ళు పోయండి సంతోషిస్తాం
ఏమి కాయ కాయలో మీరే నిర్ణయిస్తే,
మేము జీవించేది ఎప్పుడు?

Monday, June 14, 2010

ఎందుకో మనం ఇక్కడ..?


ప్రతి నిమిషం
ప్రతి అడుగు
ప్రతి పరుగు
సంపాదించడానికేనా
దాచుకోడానికి, కుదిరితే దోచుకోడానికి,
సంపాదించిన దాన్ని పెంచుకోడానికి..
మనిషి పుట్టింది మనిషి పుట్టించిన దాని వెనుక
పరుగెత్తడానికా ?
ఏమౌతుందని మనకి,
అయినవాళ్ళని దూరం చేస్తోంది..
ఏం చేద్దామని మనలని,
కానీ వాళ్ళని కూడా దగ్గర చేస్తోంది..
మనిషి జీవితం అంతా సంపాదించడం లోనే ఖర్చైపోవాలా..?
పుట్టింది జీవించడానికికా సంపాదించడానికా
అని అనుమానం వస్తోంది..

జీవితం ఎందుకు అని ప్రశ్నిస్తే నాకు జవాబు దొరకడం లేదు...

Sunday, June 13, 2010

మనస్సాక్షి

బోసి నవ్వుల పాప లతో ఆటలడునప్పుడు
లోపలి నుండి వినిపిస్తోంది ఏదో స్వరం...
వయసుమళ్ళిన ముసలి తాత ముఖం లో లేదు
బోసి నవ్వుల పసిపాపల నవ్వు లో ఉన్న వరం...
ఏమి జరిగింది ఈ ప్రయాణం లో
కళ్ళలోని మెరుపు దైన్యం గా మారింది..
స్వచ్చమైన ఆ నవ్వు జీవం లేనిది ఐంది...
ఈ ప్రయాణం అంతా ధనం వెనకే కదా...?
ఇప్పటికి, అప్పుడప్పుడు వినిపిస్తుంది ఓ స్వరం
అది గర్జిస్తున్నప్పుడు మనిషి మనిషి లా బ్రతుకుతాడు
అది మూలుగుతున్నప్పుడు మనిషి ని మనిషిగా బ్రతకనివ్వదు..
ఏంటి ఈ జీవితం పరుగంతా ధనం కోసమేనా..?

Tuesday, June 8, 2010

ఏ మాయ చేసావే..!


ఎంతో మంది నా జీవితం లోకి వచ్చారు గాని,
నీలాగా మాయ చెయ్యలేదు...
నీ మాయలో అందరిని మర్చిపోతున్నాను అని చిన్న బాధ
ప్రతి క్షణం నీకు మరింత చేరువవుతోంటే బాధన్నదే మర్చిపోతున్నాను...
ఇప్పుడు చెప్పాలనిపించి కాదు చెప్తోంది
నువ్వు చెప్పమన్నావని మాత్రమే చెప్తున్నాను...
నీ చెవిలో మాత్రమే చెప్పాలనుకున్న మాట.
నీకోసం ప్రాణమైన ఇస్తానని కాదు,
నీతోనే బ్రతకాలని నా ఆశ...
చావడానికి ఏముందిలే ఒక్క సెకన్ చాలు
నీ ధ్యాసలోనే బ్రతకడానికి నూరేళ్ళు కూడా చాలవు...
ఇదివరకు తెలియని ఈ బాధ చాలా తీయగా ఉంది...
నిన్న గాక మొన్న వచ్చి ఏ మాయ చేసావే
నిన్నో మొన్నో పుట్టినట్లుంది..
నీ ప్రేమే నన్ను ఈ మాయలో ముంచింది..
ప్రేమంటే అర్ధం తెలిసింది ఈ నీ ప్రేమలో ...

Thursday, June 3, 2010

నీ మాటలు నా చెవులకు కాదు మనసుకు చేరుతున్నాయి

నువ్వు చెప్పిన ప్రతిసారి నాకు కూడా చెప్పాలనిపిస్తోంది
నీతో నడవాలని ఉందని...
గుండెలోని మాట గొంతులో ఆగిపోతోంది
సాగలేని పయనం మొదలు పెట్టొద్దని...
పెదవి దాటిన మాట మొరటుగా తిట్టింది
మనసు మూగది మోసం చెయ్యొద్దని...
ప్రేమకు నిర్వచనం అడిగితే నేనేమి చెప్పగలను
అందరు వర్ణించేది, ఎవరు నిర్వచించలేనిది కదా...
సంతోషం అంటే ఏంటో అడుగు చెప్తాను
నీతో ఉన్న ప్రతి క్షణం అని...
నువ్వెప్పుడు గుర్తోస్తావో అడుగు చెప్తాను
అనుక్షణం అని...
చివరి కోరిక ఏంటంటే నిన్ను చూడాలని...

Wednesday, June 2, 2010

నీ ఊహలె నా కొత్త ప్రపంచం ..

ఎందుకో నీ పరిచయం చాలా బాగుంది
తొలకరి లో తడిసినట్లుంది మనసుకి జలుబు చేసింది
పువ్వులలోని తేనె ను తాగినట్లుంది మది పులకరించింది
చెరువులోని చిన్ని చిన్ని చేపలను చేతులతో పట్టుకుని ఆడుకుంటున్నట్లుంది

ఎందుకో తెలియదు నీ పరిచయం మనసుకు హాయిగా ఉంది
తెల్లవారు జామున లేచి చెరువులో ఈత కొట్టినట్లుంది
గిలి గింతలు పెడుతోంది
అర్దరాత్రి వేళ వెన్నెలలా ఉంది
చుక్కలు లెక్క పెట్టమంది
చలి కాలపు చలి మంటలా వెచ్చగా
వేసవి లో చలివేంద్రం లా
వర్షం లో గొడుగు లా
పువ్వు పైన నీటి బొట్టులా
నీ పరిచయం తో ప్రపంచం తో పోయింది పరిచయం
నీ ఊహలె నా కొత్త ప్రపంచం ...