Friday, December 30, 2011

LOVE TEARS


LOVE - CONFUSION - PAIN - TEAR - LOVE - TEARS - MEMORIES


EMPTY LIFE GIRL COME
LIFE REVERSE TEAR


WHITE SKIN GIRL GIRL
GIRL HEART BLACK

GOD I AM DYING NOW
SHE IS HAPPY NOW

Monday, December 5, 2011

బంగారం


బంగారం వన్నె దాన
గారాలు పలుకు దాన
రంగేళి నవ్వు దాన
బంతి పూల బుగ్గల మధ్య
గాజుల సడి తలపించే
రంగుల హంగుల పెదాలు
చిలికించే నీ నవ్వులోని నవ్యత
ఏ కవి రాయలేని కవిత
రెప్పలేని కన్ను నువ్వు లేని నన్ను ఉహించకు
నిదురలో నన్ను కలలలో నీవు ఊరించకు
దూరంగా ఉండి దగ్గరలా అనిపించి ఉడికించకు
ఇలా ఇలా ఇలాగే ఇంకా నన్ను వేధించకు

Sunday, October 23, 2011

నీతో నీకోసం ఒక జీవితం కావాలి.


నీ తోడంటు లేనప్పుడు స్వర్గంలో ఉంటె ఏంటి
ఈ నరకం లో ఉంటే ఏంటి
కను రెప్ప నుండి జారే మొదటి చుక్కని
చేరిపెందుకు నా చేయి పట్టుకుని లాలిస్తావని
ఈ ఎదురు చూపులో
నీ ఊసులు వినలేని
నీ ఊహలు కనలేని
నా ఈ ఊపిరి ఉంటే ఏంటి లేకున్నా ఏంటి ..?!?
నువ్వు నీ నవ్వు లేని ఈ లోకం తో నాకు పనేంటి బంగారం
నా భయం ఒక్కటే ఈ జీవితం లో మనం మరల కలిసినా
ఒక కృత్రిమమైన సంభాషణ తో మరల విడిపోతామని
ప్రతి రోజు ఎదురు చూస్తున్న ఏ రోజైన మాట్లాడతావని

ఇలాంటి రోజోస్తుందని తెలిసు
ఇంత భయంకరం గా ఉంటుందని తెలియదు
మునుపటిలా ప్రేమించు అనలేను వీలైతే మన్నించు

Saturday, October 22, 2011

మనసారా ...

ఇప్పటికీ నిన్ను చూస్తే బాధను కమ్మే ఒక హాయి
చిరునవ్వు చిందించే ఓ మాయ

ప్రేమ నాతో ఆడిన ఆటలో గెలిచింది
నన్ను నీ ప్రేమలో ముంచింది
నీ జ్ఞాపకాల కన్నీటిని మిగిల్చి
నీ ప్రేమలో నన్ను ఓడించింది

ఎలా ఉన్నావ్ బంగీ నేను లేకుండా
నువ్వు లేక పోతే నా రోజులన్నీ ఖాలీ అయిపోతాయని
తెలిసే సరికి నువ్వు నాతో లేవు

ఏ మైంది నాలో
మనసైంది బందీ నీలో
ప్రేమంటే తెలిసింది అనే ఆనందం
నువ్వు లేవు నాతో అనే విచారం
రెండు కలిసి నేనెల ఉన్నానో తెలుసా ..?

మనసారా చెప్తున్నా మనసంత నువ్వే...
నీలా నన్ను ప్రేమించే మరో మనసు నువ్వే...

Friday, September 16, 2011

నువ్వు లేకున్నా...!


ఏటి ఒడ్డున అడుగు జాడలు నీవి నావి
మనసు నిండా తీపి గురుతులు నాలో నీవి

ఆనందం ఎక్కడో లేదు ఆ క్షణం నా గుండెలోనే ఉంది
కారణం మరేదో కాదు అప్పుడు నా చేయి నీ చేతి లో ఉంది

తొలిసారి నా కన్ను అందాన్ని చూసింది
ఇంద్ర ధనుస్సు లాంటి నీ నవ్వులు కళ్ళలో నింపింది

నీలి నీ కళ్ళలో నింగి దాగుంది
నల్లని కురులలో నయాగరా దాగుంది

నిన్ను తాకే గాలి నన్ను తాకి
ఏదో లోకంలోకి నన్ను లాగి
ఏదో తికమకలో కాలాన్ని మాయం చేస్తోంది

నీ చూపు సూటిగా గుండెల్లో గుచ్చుకుంది
నీ నవ్వే౦టో, నా కళ్ళలో ఉండి పోయింది

నీ జ్ఞాపకాలు చాలు

Monday, September 12, 2011

నా హృదయం లో నిదురించే చెలీ...

నా తీరే మార్చి నీ తీరం చేర్చే
నీ చూపే మౌనం తో నా మదిని బంధించి
కనులను జోకొట్టి కలలను డీ కొట్టే
కను రెప్ప చాటు ఓర చూపును నిందించి

బంధించావు ప్రియా నీ ప్రేమలో
నింపేసావు నీ రూపం నా కనులలో

సుతి మెత్తని నీ పాదం మోస్తున్న భుమిదెంత భాగ్యం
అతి మెత్త గా నిన్ను తాకే గాలికెంత సౌఖ్యం
చిరుగాలికి ఊగిసలాడే నీ కురుల అందం
చిరునవ్వు తో మాయ చేసే నీ అధరం

బంధించాయి ప్రియా నీ వలపు సంకెళ్ళతో


Monday, August 29, 2011

నువ్వు లేని ఒక నిముషం యుగమైనా గడవదే

నా మౌనం మాట్లాడితే అది నువ్వు
నా కోపానికి చిరునవ్వు నువ్వు
నా స్నేహం నువ్వు నా రాక్షసి నువ్వు
నా నేస్తం నువ్వు నా ప్రాణం నువ్వు
నలుగురిలో ఉన్నప్పుడు నా ఒంటరితనం నువ్వు
నీతో ఉన్నప్పుడు నా ప్రపంచం నువ్వు
కలలో కలవరింత లో నువ్వు
నేను పలికే పలవరింత నువ్వు
కానీ నాకోసం కాదు నువ్వు

Friday, August 26, 2011

మనసెరిగిన మౌనమా ...


ఇది అని తెలియని అలజడి ఏదో మొదలైన్దిలే
కనులలో నీ రూపు తప్ప కలలకు చోటే లేకున్దిలే
మనసును గెలిచినా మనసొకటి ఉందని
నన్నే వలచిన నీదే అని
మాటలు మరచి మౌనము వలచి
గాలిలో నేనే తెలేనులే

మౌనం నిండిన నా హృదయం లో గుడిని నీకు కట్టాను
ఇంకెవ్వరికీ చోటివ్వను అని మాటిస్తున్నాను
తొలకరిలో నా యద సడి లో వినిపించే ఒక రాగం
వేణువు లా నా యద మీటే ఆ సడికి నీవే గమ్యం

కలలు నిండిన కనులకు విశ్రాంతినిస్తూ
రెప్పల మాటున రేయి పవలు నిలిచిన
నీ రూపం కనుమరుగైపోతుంటే
పల్లవి లేని పాట లాగ శ్రుతి లేని గీతం లా
గజిబిజి గా మారింది జీవితం

Thursday, August 18, 2011

పోవద్దె .. నన్నొదిలి ప్రేమా..

నన్నొదిలి నీడ వెళ్లిపోతోందా..... కన్నొదిలి చూపు వెళ్లిపోతోందా ...
వేకువనే సందె వాలి పోతోందే ..... చీకటిలో ఉదయం ఉండి పోయిందే ...
నా ఎదనే తొలిచిన గురుతుగా నిను తెస్తున్న....
నీ జతలో గడిపిన బ్రతుకిక బలి అవుతున్న...
నువ్వుంటే నేనుంట...ప్రేమా... పోవద్దె ....పోవద్దె ..ప్రేమా..
నన్నొదిలి నీడ వెళ్లిపోతోందా..... కన్నొదిలి చూపు వెళ్లిపోతోందా ...
ఇన్ని నాళ్ళు నీ వెంటే సాగుతున్న నా పాదం... వెంట పడిన అడుగేదంటుందే...ఓ ఓఓఓ....
నిన్న దాక నీ రూపం నింపుకున్న కనుపాపే నువ్వు లేక నను నిలదీస్తుందే....
కోరుకున్న జీవితమే... చేరువైన ఈ క్షణమే.... జాలి లేని విదిరాతే శాపమైనదే..
మరు జన్మే ఉన్నదంటే బ్రహ్మనైన అడిగేదొకటే ...ఏమంత మబ్బు తన అడలిక సాగని చోటే....
నువ్వుంటే నేనుంట...ప్రేమా... పోవద్దె ....పోవద్దె ..ప్రేమా..
నువ్వుంటే నేనుంట...ప్రేమా... పోవద్దె ....పోవద్దె ..ప్రేమా..

Tuesday, August 16, 2011

నువ్వు లేవు అనేదే లేని ఒంటరి తనమే బాగుంది


నాకోసం నువ్వు లేనప్పుడు
నాతో నేను నాలో నేను
నను వదిలి నువ్వు వెళ్ళే ఇప్పుడు
నాకు నేను కూడా లేను
అపుడు ఇప్పుడు ఒంటరినే
ఇప్పుడు నువ్వు లేవనే బాధ తోడు ఐంది

తొలకరి చాలా ఆహ్లాదం గా ఉంటుంది కదా అని ఆనందిస్తూ
అది శాశ్వతం కాదని మరచిపోయాను
ఆనందం లో తడిచిపోయాను కానీ
ఒంటరిగా మిగిలిపోయాను
గతం లోకి తొంగి చూసే అవకాశం లేక
మౌనం గా ముందుకే వెళుతున్నాను
మళ్ళీ ఒంటరిగా

Friday, August 5, 2011

పన్ను - పెయిను

(నా స్మైల్ ఏ నా స్టైల్ అని స్టేటస్ మెసేజ్ పెట్టుకున్నందుకు నాకు పడిన శిక్ష.
Beware of status msgs :-)
పోకిరి స్టైల్ లో పండగ చేస్కోండి)
ప : 
నొప్పి నొప్పి పన్నంత నొప్పి
జివ్వుమంటూ లాగేస్తాది
పట్టి పట్టి నరాలు మెలేసి
దవడ మొత్తం పికేస్తాది
అసలేమైందో తెలియకుందిరో బాబో
రాతిరంతా నిదర లేదు  పన్నుడ గొట్టాలి రోయ్  
దేవ దేవ దేవ దేవ పన్ను దేవుడా  
దేవ దేవ దేవ దేవ పన్ను దేవుడా  
పళ్ళ డాక్టర్ ఎక్కడున్నా కలిసి తీరాలి రో  
దుంప తెంపి చంపుతోంది   
చ:  
నన్నిలా గుంజకే   నొప్పితో చంపమాకే  
వెళ్ళని తొందరగా  డాక్టర్ నీ కలవనీవే 
దేవుడా ఆ వెయ్యోదిలేసింది డాక్టర్ కి  
అయినా ఆ నొప్ప్పుంది పూర్తిగా  
రాతిరంతా కునుకు లేదు  
డాక్టర్ నీ మార్చాలి రో   
దేవ దేవ దేవ దేవ పన్ను దేవుడా  
దేవ దేవ దేవ దేవ పన్ను దేవుడా 
బ్రష్షు మీద పేస్టు పెట్టి రుద్దు తున్నాను రో  
ఐనా గాని పళ్ళు పోయాయి ...  
దేవ దేవ దేవ దేవ పన్ను దేవుడా  
దేవ దేవ దేవ దేవ పన్ను దేవుడా 


Monday, August 1, 2011

నువ్వు దూరమైతే ఏదో ఐపోతున్నా...


ఏదోలా ఉందే నువ్వే లేక
ఏమి బాగోదే నువ్వేల్లాక
క్షణమైనా విడిచి ఉండలేక
పోతోందే ప్రాణం మరువలేక

గుండెల్లో నిలిచి ఉండక
కన్నీటి బొట్టై జారాక
మనసు బరువు పెరిగాక
కనుల ముందు నిలిచాక

కల నువ్వే అని తెలిసాక
కన్నీటి బరువు ఆపలేక
చిరునవ్వు నౌక
చిగురాశ మీద చినుకై నిలిచా

Sunday, July 31, 2011

I LOVE MY FRIENDS

దూరం మహా చెడ్డదని ఈ లోకం అనుకుంటుంది
కానీ ఆ దూరం లోనే నాకు నీ స్నేహం దొరికింది
దూరం దగ్గరయ్యే కొద్ది దగ్గర దూరం అవుతుంది అంటారు
నువ్వు దూరం గానే ఉంటూ నాకు దగ్గర అవుతున్నవే
నీ స్నేహం బాగుంది
ఐనా స్నేహం అనేది ఎప్పుడూ బాగుంటుంది
I LOVE MY FRIENDS

Friday, July 29, 2011

మళ్ళీ ఒంటరిని ఐయ్యాను


ప్రేమించా
నీ మనసుని
నీ మాటని
నీ నవ్వుని
నీ ప్రేమని

ప్రాణం పోతుందని తెలిసి ఆశతో జీవిస్తున్నట్లే
ఓడిపోతానని తెలిసి నిన్ను ప్రేమించాను

ముందే ఒంటరిని నేను
మళ్ళీ ఒంటరిని ఐయ్యాను

Wednesday, July 6, 2011

మొదటిసారి నిన్ను చూసి...

గుండెలోన దాచుకున్న మాటలు వింటావా
నే మొదటిసారి నిన్ను చూసి ప్రేమలో పడ్డానే
గువ్వలాంటి నువ్వు
నీ వన్నెల చిరునవ్వు
మార్చేసింది నన్ను
మునుపెరుగని ఈ లవ్వు
లోకం లో ఎన్ని ఉన్నానీతో ఉండాలనిపిస్తుంది
ఏం చేస్తున్నా నీ నవ్వే గుర్తొస్తోంది
కన్ను మూసి తెరిచే లోగా
రెప్పపాటులో నీ రూపం
శ్వాస తీసి విడిచే లోగా
గుండెల్లో నీ జ్ఞాపకం
అందుకే
ఈ జన్మ కు నా మనసు నీకే అంకితం

Saturday, July 2, 2011

కరిగే లోగా ఈ క్షణం.. చెప్పాలని నీకు ఈ నిజం...


నన్ను నేనే మరిచి పోవడం
నిన్ను మాత్రం మరువలేకపోవడం
కను రెప్ప వాలనీయడం
కలలు జారనీయడం
శ్వాస మరచిపోవడం
నీ ఊహ శ్వాసించడం
జ్ఞాపకాల నీడలలో
నిన్ను తలచు తలపులలో
మధురమైన భావనలో
వేచి ఉండలేను మరుజన్మ దాకా
విడిచి ఉండలేను మరు క్షణము దాకా
నీతో ఉన్న ఈ క్షణమే నాకు జీవితము
నీ ఉహలే నా జీవనాధారము
మాటలే లేవు చెలీ నీ చెలిమిని వర్ణించ
మరణమే చెలీ నువ్వు లేక జీవించ
కానీ నాకు తెలుసు
నీ నవ్వు లేని క్షణాలలో
నీ చెలిమి లేని జగాలలో
నువ్వు లేని నిజాలలో
నేను బ్రతకాలని...

Sunday, June 26, 2011

ఒక్కో క్షణం గడిచేలోపు

నిదురించే కళ్ళలో కన్నీటి కలలలో
విరిసిన వెన్నెలా..
శిలలాంటి మనసు
కరిగి పోయే వెన్నలా..
కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం
రెప్పపాటు జీవితం లో నీ ప్రణయమే ఓ ప్రళయం
ఒక్కో క్షణం గడిచేలోపు
ఒక్కో జీవితం గడిచిపోతున్నట్లుంది
నిజాన్ని నిలదీయకపోవడం
వలెనే నిబ్బరం గా ఉండలేకపోవడం
గుండె తడి కన్నీటి సడి కొత్త కాదులే

Saturday, May 21, 2011

జీవితం లోంచి జ్ఞాపకం లోకి వెళ్ళిపోయావా గొప్పోడా..?

గొప్పోడు ఇది మేము పెట్టిన పేరు కాదు
వాడికి వాడే పెట్టేస్కున్నాడు
కడసారి అయినా చూద్దామని వెళ్ళిన నాకు కన్నీళ్ళే మిగిల్చాడు
...
రేయ్
మీ కామర్సు సర్ ఎవడ్రా? అంటే గోప్పోడ్ని అండి అన్నావ్
నీ గురించేప్పుడు ఆలోచించిన ఫస్ట్ గుర్తోచేది ఇదే
నన్ను చాలా సార్లు చెరుకు ముక్కల కోసం తీస్కేల్లె వాడివి
శలవు వస్తే చాలు అక్కడకెల్దాం ఇక్కడకేల్దాం అంటూ
అటు ఇటు తీస్కేల్లెవడివి ఇప్పుడెందుకు రా
నన్ను ఒంటరిగా వదిలేసి వేల్లిపోయావ్
నీతో చూసిన మొదటి సినిమా 'నరసింహ'
ఇంకా గుర్తుంది,
మన ఉరిలో వాటర్ ట్యాంక్ కడుతున్నప్పుడు పైకి ఎక్కి ఇసుకలోకి
దుకేవాళ్ళం కదరా,
అందరిని ఏడిపిస్తూ చలాకి గా ఉండే నువ్వు మమ్మల్ని
ఏడ్పించి వెళ్లి పోయావేరా ?
నేను ఏడవను అని కనీసం ఏడవకుండా ఉండగలను అని నాకో నమ్మకం
నిన్ను కనీసం ఆకరి సారి చుస్కోవాలి అని వచ్చిన నాకు మీ అక్క
ఎదురైంది ' నరసింహ వెళ్ళిపోయాడు అమ్మా వాడిని జ్ఞాపకాల్లో నే
గుర్తుంచుకోవాలి, పెట్టెలో పెట్టేసారు స్మశానానికి వెళ్ళిన సరే చూడలేవు '
అని చెప్పినప్పుడు ఏడ్చాను రా..
ఓదార్చడానికి నువ్వు లేవు కదా రా నాకు
పది నిముషాలు ఆగలేకపోయావ్ కదా నాకోసం
అన్నింటికీ తొందర చూపించే నువ్వు
ఇంత తొందరగా నన్ను వదిలేస్తావనుకోలేదు
మీ నాన్న నీ అన్నయ్యని చూడలేక పోయాను రా
క్షమించు..
నీతో ఎన్నో జ్ఞాపకాలు
ఎన్నో సరదాలు
ఎన్నో చిరు తిరుగుళ్ళు
ఇప్పుడు అన్ని కేవలం
కన్నీళ్ళతో మాత్రమే గుర్తుచేస్కునే లా చేసావ్

Friday, April 22, 2011

నేనూ ఓ ప్రేమికుడినే

నేను ప్రేమలో ఉన్నాను
నేనొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను
తనకి నేను నచ్చక పోతే బ్రతకలేను
తనకి నేను నచ్చక పోతే భరించలేను
తనకోసం ఏమైనా చెయ్యాలనిపిస్తుంది
తన ప్రేమను సొంతం చేస్కొడానికి ఏమైనా చెయ్యాలనిపిస్తుంది
ఎంతకాలం ఐనా ఎదురు చూడాలనుంది
ఎలాగైనా ఒప్పించాలనిపిస్తుంది
ప్రాణం పోయేంత వరకు తననే ప్రేమించాలనుంది
ప్రేమించకపోతే ప్రాణం ఐనా తీయాలనుంది
తన ప్రేమ లేని జీవితం వద్దనిపిస్తోంది
నన్ను కాదన్న తనకి జీవితం లేకుండా చేస్తా

నేనూ.. ఓ ప్రేమికుడినే...
నేనూ' ఓ ప్రేమికుడినే?


ప్రేమ ఉన్న చోట ద్వేషానికి స్థానం లేదు అని ఖురాన్ చెప్తోంది
ప్రేమించలేదని ప్రాణాలు తీసే రాక్షసులది ఇదేం ప్రేమ

Friday, March 18, 2011

నేను నాకో రాక్షసి...


సినిమాల్లో లాగ పోఎటిక్ గా చెప్పడం నాకు రాదు
ఫస్ట్ టైం నిన్ను కలిసినప్పుడు నాకే ఫీలింగ్స్ లేవు
అట్లీస్ట్ లేవు అని అనుకున్నాను
కానీ ఇప్పుడే అర్ధం అవుతోంది
నువ్వు ఎవరైనా అబ్బాయి గురించి మాట్లాడ్తుంటే ఒళ్ళు మండి పోతుంది
అబద్దాలు చెప్పి ఐనా ఇంప్రెస్స్ చెయ్యాలనిపిస్తోంది
నువ్వెప్పుడైన పొట్టి డ్రెస్ వేస్కున్నావనుకో లాగి ఒక్కటి పీకాలనిపిస్తుంది
నాలో ఇన్ని నెగటివ్ షేడ్స్ ఉన్నాయనే సంగతి నిన్ను కలిసే వరకు నాకే తెలీదు..
( అలా మొదలైంది సినిమా నుండి)

Sunday, March 13, 2011

మాటలలో చెప్పలేని మహా అద్భుతం అమ్మ

నేనంటూ లేనప్పుడే నన్ను కోరుకున్నావు
నాకోసం కలలు కన్నావు
పది నెలలు ప్రతి క్షణం
నాకోసమే గడిపావు
అస్తిత్వం లేనప్పుడే
గాడం గా ప్రేమించావు
నేను లోకాన్ని చూడడం కోసం
నువ్వు ప్రాణ త్యాగానికి కి సిద్ధపడ్డావు
నీ గుండెలపై మొదటి అడుగులు వేసినా
నీ చేతులతో తప్పటడుగులు వేయించావు
నీకు నిద్రలేకుండా చేస్తున్నా
నన్ను నిద్రపుచ్చావు
నీ ఆకలి కూడా మరచిపోయి
నాకు ఆకలి అంటే ఏంటో తెలియకుండా చేసావు
అమ్మా నీ గుండె నీకోసం కంటే నాకోసమే
ఎక్కువగా అల్లాడింది ఏమో అనిపిస్తుంది
నిన్ను నా గుండెల్లో పెట్టుకోడం కన్నా
నీ ఋణం తీర్చుకోడానికి నేనేమి చెయ్యలేను...

Sunday, January 30, 2011

మరువ లేక ప్రేమిస్తున్నాను.

దూరం అయ్యే కొద్ది చేరువ అవుతున్నావు,
చేరువ అయ్యే కొద్ది గాయం అవుతున్నావు,
కన్ను తడిచే కొద్ది గుండె చేరుతున్నావు,
నిన్ను చేరే కొద్ది దూరం అవుతున్నావు,
కన్ను మూసే కొద్ది కలవరిస్తున్నాను,
నిదుర లేచే పొద్దు కలను వరిస్తున్నాను,
పలుకు పలికే కొద్ది పలవరిస్తున్నాను,
పలవరించే కొద్ది నను మరుస్తున్నాను,
నిన్ను మరువ లేక ప్రేమిస్తున్నాను.

Thursday, January 6, 2011

శ్రీకు హైకు


సహాయం అనేది మనకు సన్నిహితులకు మాత్రమే కాదు అని నాకు తెలియచేసి,
నా మొదటి జాబ్ సంపాదించుకోడానికి కారణం అయిన,
గతం లో ఒక మంచి పని చెయ్యాలని తలచినప్పుడు
తన వంతు బాధ్యత అందరి కంటే ఎక్కువ తీస్కుని,
నా వెన్నంటే ఉండి ధైర్యం చెప్పి ముందడుగు వేయించిన..

అతి త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్న
నేను కన్నా అని పిలుచుకునే
ఒక చక్కటి హైకు లాంటి మా శ్రీకు కు జన్మదిన శుభాకాంక్షలు..

నువ్వు గీత ఎప్పుడూ ఆనందం గా ఉండాలని కోరుకుంటూ ...
మీ నేస్తం...