Sunday, December 2, 2012

-- ఇలా ఫినిష్ ఐంది

నా కంటి పాపై ఉంటావని అనుకున్నా,
నిను కంటి రెప్పై దాచాలని కల కన్నా,
నా కంటి దారై  జారావే నా మైనా,
నను మరిచిపోవే ప్రేమా నాకేమైనా..

నా గుండె నిండా నిండావే నా రాధా,
నా వెంట ఉంది నువ్ నాతో లేని బాధా,
నీ ఊసు వింటూ బ్రతికెయ్యాలనుకున్నా,
నీ ఊహ వెంట అడుగే వెయ్యలేకున్నా..

కన్నీళ్లు వస్తే తుడిచేందుకు,
సంతోషాన్ని పంచేందుకు,
నువ్వేలేని జన్మెందుకు అనిపిస్తోంది ..

Sunday, November 25, 2012

నీకే తెలియదు గా...


ఎన్నో దెబ్బలు తిన్న రాయి శిల్పం అయితే, ఒక్కటే దెబ్బ తిన్న శిల గడప ఐంది అనేది తెలిసిన కథ.
శిల  శిల్పం గా మారడానికి ఎన్నో దెబ్బలు తిన్న ఉలి, సుత్తి, మనకు గుర్తు రావు. 
సృజనాత్మకం గా రాయిని శిల్పం చేసిన కళాకారుడు ఎవరో కూడా మనకు తెలియదు.

ప్రతి ఒక్కరు ముఖ్యమే..
ఎవరు ఎందుకు పుట్టారో ఎవరికీ తెలుసు..?

ఉలివో, శిలవో, కలమో, బలమో నీవెవరో...
శిల్పాన్ని మలిచే ఉలివో..
శిల్పం గా మారే శిలవో..
కథలు కల్పించే కలమో..
వ్యధని కరిగించే బలమో..

ఎవరికి చివరకు నీవెవరో..?

Friday, November 2, 2012

చెలియా నాకిన్నాళ్ళు


చెలియా నాకిన్నాళ్ళు
మిగిలే ఈ కన్నీళ్లు

కన్నీటి చుక్కై చెంప పై జారి
నా గుండె చేరావు ఉప్పెనవై
నా గుండె గుడిలో నీ రూపానికి
ఉపిరి సలపని ఊహలవై

నీ ఊహ నిండిన ప్రతి నిమిషం
నీ జ్ఞాపకం ఐనది చేదు విషం
నిలువెల్లా కాల్చే ఈ విరహం
చల్లార్చలేనే ఒట్టు నిజం

నా కంటి పాపే కలలను మరచి
కన్నీట తడిచి మునిగిందే

నా గుండె చేసే చప్పుడు కూడా
నేనంటే ఎవరో మరచిందే
--
చెలియా ఇంకెన్నాళ్ళు
వరమై ఈ కన్నీళ్ళు
కనుల్లో జారే ప్రతి చినుకు నీ
రూపం తానె నింపిందే
నాలోకి చేరే ప్రతి శ్వాస నీ
ఊపిరై నన్నే తదిమిందే
ఇన్నాళ్ళు నవ్వుతు తిరిగిన నా
మనసుకు బాధే మిగిలిందే
నేనంటూ నాకే లేకుండా నీ
గురుతులు గుండెలో నింపావే

నువ్వంటూ మరల జన్మిస్తే నీ
ప్రేమకై మరల పుడతానే

Saturday, October 13, 2012

నా బ్లాగు అంతా కాపి చేసేసారు



మిత్రులారా .. ఈరోజు నా బ్లాగు లో రాసిన అన్ని పోస్ట్ లు వేరే బ్లాగు లో చూసి షాక్ అయ్యాను. ఏమి చెయ్యాలో తెలిదు. ఏమైనా సలహా ఇవ్వగలరు.
My Blog : http://nesthamaa.blogspot.in
Copied to : http://sandeep-sneham.blogspot.in/

Thursday, September 27, 2012

నా ప్రేమ పాడే రాగం నేను


నీ మీద ప్రేమకు తండ్రిని నేను, విరించి నేను
నా ప్రేమ పాడే రాగం నేను, విపంచి నేను

నిరంతరం నీ ధ్యాసలోనే
నా ఉచ్వాస నిశ్వాస

నా కనులలో
నీ నవ్వు నాట్యమాడే వేళ నా మది మ్రుదంగమై
ప్రేమ తరంగాలతో ప్రతిధ్వనిస్తుంది

చిగురించిన ప్రేమను పోషిస్తాను
చిరునవ్వుని చూస్తూ జీవిస్తాను
వేల రాగాలు పాడిస్తాను
కోటి కలలనలు పండిస్తాను

నిరతము నిన్నే ధ్యానిస్తాను,
ఆర్తి తో ఆరాధిస్తాను,
ప్రేమగా లాలిస్తాను,
ప్రేమిస్తాను..  :)

నా హృదయాన్ని స్వీకరించి
అనుగ్రహిస్తావా..? మరి ..!

Monday, September 17, 2012

కొంచెం మరుపైన కావే ...

బ్రతుకంతా భారంగా ఈ  బాధలో,
బ్రతికిన్చుకోలేని నీ ప్రేమలో..

గాయాల పాలైన నా గుండెలో,
నే మరిచిపోలేని నీ నవ్వులో..

చిరు వణుకు పుడుతున్న నా గొంతులో,
నే పిలువలేకున్న నీ పేరులో ..

గుండె నిండి,
కంట జారి,
నన్ను వదిలి వెళ్ళినా..

నిన్ను నేను,
మరువ లేను,
మరలి రాని ప్రియతమా..

నా కనుపాపలలో  నువ్వే
నా కను చెమ్మల్లో నువ్వే

కలలో కూడా నీ నవ్వే
కొంచెం మరుపైన కావే ...

Tuesday, August 14, 2012

Nice to see you

ప:
వేల ఋతువులు వేచిన హృదయం
తొలకరై కురిసిన నిమిషం
కంట తడి పెంచిన నువ్వే
గుండె సడి పెంచిన నవ్వై
నా ఎదుట నిజమై నిలిస్తే.....
చెప్పిన మాటిది.. మనసుతో నిను వినమని..
Nice to see you
Nice to see you
Nice to see you
Girl: I say same to you


చ :
కొండలు కోనలు  దాటిన సెలయేరు 
సంద్రం తో చెప్పింది
nice to see you...

కడుపులో పాపగా నెలలుగా మోసిన అమ్మ
పాప తో చెప్పింది
Nice to see you..

మెరుపులే కురిపించు కళ్ళతో చెప్పనా 
వెన్నెలే వర్షించు నవ్వుతో చెప్పనా
ఇన్నాళ్ళకి కనిపించిన నీతో చెప్పనా
మనసుతో వినమని
Nice to see you..

నీ కళ్ళలో కనిపించే నా రూపం చెప్పింది
నా పెదవినే పెనవేసే నీ నవ్వు చెప్పింది
నా జ్ఞాపకాలు దాచుకున్న నీ గుండె చెప్పింది
మనసారా చెప్తున్నా
I Say same to you..

Thursday, August 9, 2012

- కాదల్ కర్మ కహాని

నేను ఒకమ్మాయి ని చూడగానే ఈగ సినిమా లాగా అరె అరె అరె అరె అంటూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ ఐంది..
వెంటనే ఆమెకి చెప్పెయ్యాలని అనుకున్నా.. అనుకున్నానో లేదో కనిపించింది మళ్లీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ ఐంది..
(అది నా రింగ్ టోన్ అని అప్పుడు గుర్తు రాలేదు, గుర్తొస్తే నా లైఫ్ ఇంకోలా ఉండేది )
నేను : హలో మీరు చాల బాగున్నారు.. నాకు చాలా నచ్చారు..
(ఇంత ధైర్యం ఎలా వచేసిందో తెలీదు, పోయేకాలం అంటే ఇదేనేమో)
తను సీరియస్ గా చూసింది
నేను: అంటే మరి అంత బాగున్నారని కాదు జస్ట్ నాకు కనెక్ట్ ఐయ్యారని చెప్తున్నా (తడబడుతూ అన్నాను, ఆపేసినా బాగుండేది)
తను కోపం గా చూసింది
నేను: అంటే అది కాదండి ఐశ్వర్య రాయి చాలా అందంగా ఉంటుంది కానీ నాకు నచ్చదు, మీరు జస్ట్ యావరేజ్, బట్ నాకు చాలా నచ్చేసారు
ఫట్ అని ఒక సౌండ్, ఎక్కడనుండి వచ్చిందో తెలీదు.. కళ్ళ ముందు కొన్ని మెరుస్తూ గిర గిరా తిరుగుతున్నాయి, స్టార్స్ అనుకుంట.. నేను తేరుకునే సరికి తను మాయం ఐంది.

నెక్స్ట్ సీన్ లో :
ఏదో ఆలోచిస్తూ నడుచుకుంటూ వెళ్తున్నా, ఎవడో కాల్ చేసాడు అరె అరె అరె అరె అంటూ నా రింగ్ టోన్ మోగింది.. ఎదురుగ చూస్తే అదే తను.. అలా చూస్తూ ఉండిపోయాను..
తను: పక్కకి తప్పుకో, వెళ్ళాలి
నేను: పక్కనే ఉంటాను మీతో, అంటుంటే పక్కకి పోతారెంటండి..?
మళ్లీ చుక్కలు కనిపిస్తున్నాయి ఏంటి అనుకుంటున్నాను, రోడ్ మీద కుర్చుని చెంప మీద చెయ్యి వేస్కుని ఉన్నాను.. నెమ్మది గా ఏం జరిగిందో అర్ధం ఐంది..
(ఇదేరా ప్రేమంటే కన్నా.. ఎవడి దో రింగ్ టోన్... చీ నీ యబ్బ అనుకున్నాను)
కొన్ని రోజుల తరువాత.. రెండు చెంప దెబ్బలు పూర్తిగా తగ్గిపోయాయి అనుకున్నాక.. మళ్లీ రింగ్ టోన్ అరె అరె అరె అరె ....
నేను: ఏమండి ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు.. మీరేమో చెంపలు వాయిస్తున్నారు.. ఏం చెయ్యమంటారు..?
తను: పెళ్లి చేస్కున్టావా..?
నేను: (ఆనందం ఆశ్చర్యం తో ) మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అండి..
తను: సరే అయితే (అని వెళ్ళిపోయింది..)
నేను: ఇంట్లో ఏం చెప్పమంటారు..? (అరిచాను)
తను: అమ్మాయి నచితే ఓకే చెప్పు... లేకపోతే ఒన్ వీక్ లో అలోచించి చెప్తాను...
(అంటే ఒన్ వీక్ టైం కావాలన్నా మాట దీనికి)
ఈసారి రింగ్ టోన్ ఒన్ వీక్ వరకు మోగలేదు.. మోగాక..
నేను: సారీ అండి నేను బాగా ఆలోచించాను..
తను: ఏంటి సారీ
నేను: అది నేను
తను: అది లేను నేను లేదు నేను ఫిక్స్ ఐయ్యను.. నిన్ను లవ్ చెయ్యాలని..
నేను : అది కాదండి నేను మిమ్మల్ని లవ్ చెయ్యట్లేదు
తను: (కాలర్ పట్టేస్కుంది) మరి ఎందుకు ప్రపోజ్ చేసావురా..?
నేను: నాకు మీరు పడతారో లేదో అనీ....
తను: (ఒక చెంప దెబ్బ, నాలుగు చుక్కలు) టెస్ట్ చేసావా?
నేను: నాకు ఇంట్లో వాళ్ళు సంబంధం చూసారండి
తను: నచ్చలేదని చెప్పు, లేకపోతే నేను నచ్చాను అని చెప్పు..
నేను: అమ్మాయి నచితే ఓకే చెప్పమన్నారు కదా (తప్పించుకోడానికి ట్రై చేస్తున్నాను)
తను: (ఒక్కటి పీకి) నేను జస్ట్ యావరేజ్ గా ఉన్ననేన్త్రా నీకు.. కళ్ళు పెట్టి సరిగ్గా చూడు.. ఇప్పుడు చెప్పు..
(ఫస్ట్ చూసి ఆవరేజ్ అనుకున్నాను, కానీ చూడగా చూడగా బాగుంది.. చాలా బాగుంది. ఈ అమ్మాయిలు అందం గా లేవు అంటే మాత్రం క్షమించరు అని మాత్రం అర్థం ఐంది.. అరె సాంబో..! రాస్కో..! (నాతో నేనే చెప్పుకున్నాను)...)
సరే అర్థం ఐపోయింది..! నాకు సంబంధం రాలేదని తనకి,
తనకి నేను నచ్చేసాను అని నాకు..
నేను: అంతా ఒకే కానీ.. ఒక్కటే భయంగా ఉంది అండి..
తను: ఏంటి..?
నేను: మాట్లాడితే చెంపలు వాయిస్తున్నారు..
తను: నా దెబ్బలే తట్టుకోలేకపోతే మా అన్నయ్య ని ఎలా ఫేసు చేస్తావ్ రేపు
నేను: (కంగారు గా) అన్నయ్యేంటి..?
తను: ఇంత అందమైన అమ్మాయికి ఒక అన్నయ్యని expect  చెయ్యలేదా? రోజు జిం చేస్తానే ఉంటాడు.. రేపు వస్తాడు..
నేను: ఎందుకు..? ( భయం తో)
తను: నిన్ను కుమ్మడానికి
నేను: అదేంటి..?
తను: నువ్వు నా వెంట పడ్తున్నావని చెప్పానులే
నేను: మరి లవ్ చెయ్యట్లేదా? (నన్ను కుమ్మేయ్యడనికా ఇదంతా.. డౌట్ వచ్చింది)
తను: చేస్తున్నాను, కాకపోతే లవ్ చెయ్యకముందు అన్నయ్య కి చెప్పా
నేను: మరిప్పుడు లవ్ చేస్తున్నా అని చెప్పండి
తను: అమ్మో ఇంకేమైనా ఉందా? నన్ను ఇంట్లో చంపేస్తారు
నేను: అయితే నన్ను చంపేస్తాదేమో..? (చమటలు పట్టేసాయి)
తను: ప్రేమ కోసం కొన్ని త్యాగాలు చెయ్యాలి బంగారం... జాగ్రత్తా.. సరేనా..
నేను: అమ్మాయిలు ఇలా కూడా ఉంటారా?
తను: ఇలాగే ఉంటారు..
(వెళ్ళిపోయింది)
మళ్ళీ అరె అరె అరె అరె .......
రింగ్ టోన్ కాదు గాని ఈగని నలిపినట్లు నలిపెస్తాడేమో..
ఇప్పుడు నా బ్యాక్ గ్రౌండ్ సాంగ్
Dek lo re sala .. Ye Raath cha gai... Tere dwar pey .. Tere moth aagai...
( బాసు ఇది కహాని మాత్రమే)

Wednesday, August 8, 2012

రాక్షసి -


ఊహలతో ఊపిరి తీస్తూ.. కన్నులతో చూపులు దాస్తూ..
రాక్షసి, తీరదే నీ  కసి

గురుతులతో గుండె కోస్తూ.. నన్ను నాకే దూరం చేస్తూ..
మగనాల నిను మరువలేనే, రక్కసి

శాపమంటి వరమునిచ్చి.. ప్రేమని పేరు పెట్టి..
ప్రాణం తీసే రాక్షసి.....

నరనరము నిప్పుల కొలిమై, నిను కలిసే ఆశే కరువై..
అణువణువు నాకు బరువై, బంధించే వలపు వలవై..

కన్ను తడిపే నీటి చుక్క, గుండె తడిమే వలపు మొగ్గ
నిన్ను మరిచే, దారి చెప్పు రాక్షసి....

Tuesday, August 7, 2012

కొంచెం స్పూర్తి, కొంచెం సపోర్ట్...


మా జూనియర్స్  లో ఒకరు షార్ట్ ఫిలిం తీస్తున్నారు, రిలీజ్ డేట్ ఎప్పుడు తమ్ముడు అని అడిగిన నాకు షాక్ ఇచాడు.
థాంక్స్ అన్నయ్య నిన్ను చూసి ఇన్స్పైర్ ఐ షార్ట్ ఫిలిం తెస్తున్నాను అని అన్నాడు ..

ఇంకొకరు చాలా మంచి కొటేషన్స్ రాస్తున్నారు, అవి కాపీ చేసి కాదు రియల్ లైఫ్ లోవి తను ఫేస్ చేసినవి,  ఫీల్ ఐనవి.
I tried to appreciate him, he said నీ gtalk status msgs రోజు చూస్తుంటాను, నేను రాయడం మొదలెట్టడానికి reason నువ్వే  అన్నాడు..

నాకు చాలా సంతోషం కలిగింది.. వాళ్ళేదో సాధించారని కాదు నేనేదో గొప్ప పని చేశాను అని కూడా కాదు..
వాళ్ళలో ఏదో చెయ్యాలనే తపనకి..

మా కాలేజీ  లో faculty గా పని చేసిన ఒక lecturer కి MSDOS లో particular folder లోకి ఎలా వేళ్ళలో తెలీదు, ఆయన subjects అన్ని project related... ఇంకొకరికి సిలబస్ తప్ప ఏమి తెలియదు...

కొంచెం స్పూర్తి కొంచెం సపోర్ట్ ఇస్తే
subject లో ఎంత taste ఉందొ చెప్తే చాలు 
student అనేవాడి మనోవికాసానికి అదెంతో తోడ్పడ్తుంది
students సరిగ్గా చదువుకో పోతే వాడి life spoil అవ్తుంది
ఒక ఉపాధ్యాయుడు తన వృత్తి కి న్యాయం చెయ్యకపోతే...?

కానీ కొందరు ఉన్నారు, నాకు కానిపించారు...
వారి జీవిత విధానమే మనకు పాతం గా, ఆదర్శానికి ఆదర్శం గా ఉంటూ రాతి గుండెలను సైతం శిల్పాలు చెయ్యడానికి  తమ వంతు  కృషి చేస్తున్నారు..
అలంటి గురువులకు శిరస్సు వంచి నమస్కారం.... 

Connecting dots లాంటి ఇంకో story చెప్పడానికి steve jobs మనకు లేడు...
ఒక్క stephen Hawkins చాలడా మనకు సజీవ సాక్ష్యం మనిషి తనకున్న అవయవాలతో ఏమి సాధించగలడు అని చెప్పడానికి..
అంత ఎందుకు మన నల్లమోతు శ్రీధర్ గారు లేరా..?

ఏదో చెయ్యాలనే తపన  ఉంది,
ఏ పని చేస్తున్నా అంకిత భావం ఉంది,
అయినా ప్రణాళిక లేని ఏదో లక్ష్యం దోబూచులాడుతోంది.. 

Thursday, June 28, 2012

ఎందుకంటే... అదంతే..

నిజం, నీతో చెప్పాలంటే
నాకేం రాదు రాయాలంటే

నింగి నేల కలిసే చోట
పగలు రాత్రి వలచే పూట
తియ్యని సంద్రం దొరికే చోట
సూర్యుడి వెన్నెల కురిసే  పూట

హరివిల్లు మంచై కురిస్తే
వర్షం ఆకాశాన నిలిస్తే

నా కష్టం చూసి నువ్వే నవ్వేస్తే
ఇంకేం కావాలి...?

నీ నవ్వే కావాలి

హి.. హి.. హి..  

ఏమైనది నాకు ..?
తెలుగే తెలియకుండా పోయింది
తెలివనేది లేకుండా పోయింది..
మనసే నాది కాకుండా పోయింది
మాట కూడా రానంటు పోయింది..

మరీ ఇంత అందంగా పుట్టేస్తే ఏం చేస్తాం, ఏం రాస్తాం..?

Friday, June 15, 2012

మా మామ పాట..

జఫ్ఫా: ఎంటిరా శాస్త్రి ఆ క్వరీ రాయడం, ఇన్నెర్ జాయిన్ ఔటర్ జాయిన్ అంటూ.. నాకే అర్ధం కాట్లేదు కోడ్ రివ్యూ చేసేవాళ్ళకి ఏమి అర్ధం అవుతాది..
శాస్త్రి: వాళ్లకి అర్ధం అవుతాది గురుజి
జఫ్ఫా: ఏంటి ఏంటి సెటైర్లు వేస్తున్నవేంటి..?
అసిస్టెంట్: సార్ టాస్క్ ఏమి లేకపోతే ఫ్రేషేర్స్ వెళ్ళిపోతాం అంటున్నారు సర్.. చాలా లేట్ ఐంది పంపించేద్దాం..
జఫ్ఫా: (కోపం గా) ఏంటి మధ్యలో నీ రికమెండేషన్ ఏంటి.. జీతాలు తీస్కోడం లేదా..? ఐనా వాళ్ళ కి ఏదైనా కావాలంటే నన్ను అడగాలి గాని మధ్యలో నిన్ను అడగడం ఏంటోయ్..
అసిస్టెంట్: వాళ్ళు మిమ్మల్ని ఫేవర్ అడిగితే మీరు వాళ్ళని ఏమడుగుతారో తెలుసండి..
ఇంతలో సెక్యూరిటీ గార్డ్ వచ్చి : సార్ మీకోసం ఎవరో వచ్చారండి
జఫ్ఫా: ( శాస్త్రి తో నవ్వుతు)  బాక్ డోర్ కాండిడేట్, నిన్న ఇంటర్వ్యూ లో భయ పెడితే గాని ఈరోజు దారికి వచ్చాడు.. (సెక్యూరిటీ గార్డ్ తో) ఆ లోపలకు రమ్మను..
లోపలి వచ్చిన వాళ్ళు తను అనుకున్నా వాళ్ళు కాదు అని తెలుసుకుని, గట్టిగ అరిచి,చెంప దెబ్బలకు నాగార్జున గారికి ఎంతో ఇష్టమైన నాలుగైదు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి, వాళ్ళను అడగడం వల్ల ఉపయోగం లేదు అని తెల్సుకుని వాళ్ళు చెప్పినట్లు చెయ్యడానికి డిసైడ్ అవుతాడు..

జఫ్ఫా: బుగ్గలు బీట్ రూట్ చేసేసారు, (దణ్ణం పెడ్తూ) మీరెవరో చెప్తే ధన్యుడిని అయిపోతాను..
వచ్చిన వాళ్ళ లీడ్: మహేష్ బాబు (అంటే దేవుడు అన్నమాట)
జఫ్ఫా: మీరు మహేష్ బాబు ఏంటి సార్..?
మళ్లీ నాలుగైదు ఎక్స్ప్రెషన్స్, కళ్ళల్లో రెండు చుక్కల నీళ్ళు
జఫ్ఫా: ఐ అండర్ ష్టుడ్.. (ఒక అమాయకమైన ఎక్స్ప్రెషన్స్ తో) మీరు మహేష్... ఇప్పుడు నేను ఏం చెయ్యాలి సర్..
మ బా: ఒక క్వరీ రాసి, ఎగ్జికుట్ చేసి ఔట్పుట్ చూపించి మమ్మల్ని ఇంప్రెస్స్ చెయ్యాలి..
జఫ్ఫా ఎప్పటిలాగే గూగుల్ ఓపెన్ చేస్తాడు
వెంటనే ఒక సౌండ్, ఒక ఎక్స్ప్రెషన్స్.. ఏది ముందు వచిందో అడగొద్దు
జఫ్ఫా: నేనేం చేశాను సార్
మ బా: మీ మేనేజర్ నీ మోసం చేసినట్లు నన్ను కూడా మోసం చేద్దమనుకున్తున్నావా..?
జఫ్ఫా: ఏం చేశాను సార్
మ బా: గూగుల్ ఓపెన్ చేస్తున్నావెంటిరా..?
జఫ్ఫా: మీకింత నాలెడ్జ్ ఉందని అనుకోలేదు సార్, ఇలా అయితే ఇప్పుడు నేనేం చెయ్యాలి సార్..?
మ బా: సొంతంగా క్వరీ రాసి మమ్మల్ని ఇంప్రెస్స్ చెయ్యాలి
జఫ్ఫా: గూగుల్ దయ వాళ్ళ ఇంత వరకు నాకు సొంత క్వరీ రాసే అవసరం రాలేదు సార్....
టాప్ మని సౌండ్..
మొత్తానికి ఏదోలా కాస్త పడి క్వరీ రాస్తాడు..
మ బా: జఫ్ఫా.. నేను అడిగిన అవుట్ పుట్ ఏంటి ? నువ్వు రాసిన క్వరీ ఏంటి..? సెలెక్ట్ స్టార్ ఫ్రం టేబుల్ నేమ్, retrieving  డేటా.. డ్రాప్ టేబుల్ టేబుల్ నేమ్ deleting దా టేబుల్.. ఒక్కోసారి సాఫ్ట్వేర్ industry  చచ్చిపోతోందేమో అనిపిస్తోంది.. మేము మిమ్మల్ని ఎక్కడికో ( ఆన్ సైట్ ) తీస్కేల్దామనుకుంటాం, మీరు అక్కడికి రారు..
అప్పుడే జ్ఞాన బల్బ్ వెలిగిన జఫ్ఫా
జఫ్ఫా: అర్ధం ఐంది సర్, మీరు ఎవరు ఫ్యాన్ ఓఒ..
మ బా: గుడ్ బాయ్.. చాలా లేట్ గా అర్ధం చేస్కున్నావ్ గాని, మరి తరువాయి భాగం..? (ప్రశ్నిస్తున్నట్లు అడుగుతాడు)
జఫ్ఫా: రేపు ఇంటర్వ్యూ పానెల్ లో చూస్తారు కదా సర్.. ( చెంప రుద్దుకుంటూ..)
మ బా: పెర్ఫార్మన్స్ నచ్చకపోతే ...?
జఫ్ఫా: మీరు తబలా ప్రాక్టీసు చేస్కుంటారు.. (చెంపలు చూపిస్తూ)
మ బా: వచ్చిన పని ఐపోయింది పందండి రా.. ( వాళ్ళ టీం అందరు వెళ్ళిపోతారు)
 

Thursday, June 14, 2012

మ్యారేజ్.. ఆఆ... ఖలేజా..

సిద్దా: ఏజ్ ఐపోతోంది, జుట్టు రాలిపోతోంది, మాట్రిమొనీ లో కూడా ప్రొఫైల్ షార్ట్ లిస్టు అవ్వడం లేదు... ఎలా సామి..పెళ్లి సామి..
[సామి కాసేపు గూగుల్ లో ఏదో వెతికి, ఒక ఆస్ట్రాలాజి ఇమేజ్ ఓపెన్ చేసి.. తన రెసుమే కూడా ఓపెన్ చేసి...]
సామి : ఐదు కంపనీలు, ఏడు సంవత్సరాల అనుభవం, ముప్పై ఏళ్ళ వయసు..
వెళ్ళు సిద్దా వెతుకు.. నల్లని కురులు, ఎర్రని పెదాలు, , షాపింగ్ మాల్ అంత హ్యాండ్ బాగ్, ఆమె నీకు కనిపిస్తది సిద్దా వెళ్ళు... వెతుకు..
సిద్ధా: ఆనవాలు కట్టేది ఎలా సామి..
సామి: నీతో బిల్ కట్టిస్తుంది సిద్దా, నీకు చుక్కలు చూపిస్తుంది..
ఎవరి చెప్పు నీ చెంపమీద చెరగని టట్టూ వేస్తుందో..
ఎవరి క్రెడిట్ కార్డ్ బిల్ చూసి నీ మోకాళ్ళు ఒణికి పోతాయో.. 
షాపింగ్ పేరు చెప్పగానే హార్ట్ ప్యాంటు లోకి జారిపోతుందో...

ఎవరు నీ జీవితం లో నవ్వు లేకుండా చేస్తారో..
ఎవరు వచ్హాక నువ్వు చెప్పింది చెయ్యడం తప్ప సొంతంగా ఆలోచించడం మానేస్తావో..
దొరుకుతాది వెళ్ళు... వెతుకు..

భద్రం సిద్ధా క్రెడిట్ కార్డ్ మాత్రం ఇవ్వకు.. భద్రం .. నీకేం కాదు... నీకేం కాదు..

Thursday, June 7, 2012

మీ మొబైల్ పోయిందా..?


కూడలి లో ఎవరో తమ మొబైల్ పోగొట్టుకున్నాను అని పోస్ట్ చేసారు.
అది ఎవరి బ్లాగ్ నాకు గుర్తు లేదు. కానీ ఇది ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని పోస్ట్ చేస్తున్నాను.
మీ ఫోన్ ANDROID సపోర్ట్ చేస్తే మీరు మీ ఫోన్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు...
Please refere below links:
http://www.androidauthority.com/best-android-apps-to-help-you-find-your-lost-smartphone-22195/

https://play.google.com/store/apps/details?id=com.lookout.labs.planb



Thursday, May 24, 2012

హే.. పూణే మనపా మామ పూణే మనపా మామ


హే..  పూణే మనపా మామ పూణే మనపా  మామ
చదవడమే లైఫ్ రా మామ సినిమా కష్టాలే మామ
ఎటు విన్న తెలుగే మామ కష్టాల కొలువే మామ
జాబు ఉంటె మస్తు రా మామ లేదంటే పస్తులు మామ

ఏ వాకిన్స్ ఉన్న  ఏ  షేడుల్స్ ఉన్న మేం అక్కడే ఉంటాము
ఏ టెక్నాలజీ ఐనా ఏ కంపెనీ ఐనా మేం వదల్లేము రా

చలో చలో పద పద రా మామ ఇంటర్వ్యూ కి వెళ్దాం మామ
అనుక్షణం ఇక స్ట్రగులే లే మామ ఐన సరే వదిల్లెలము మామ

పూణే మనపా మామ పూణే మనపా మామ
చదవడమే లైఫ్ రా మామ సినిమా కష్టాలే  మామ

--
కోడింగ్ ఏ జరిగినప్పుడు ప్రతి రోజు పెళ్లి సందడే
క్యు ఏ కి ఇచ్చినప్పుడు అందరికి  అప్పగింతలే
క్లైంట్ కాల్ కి గంట ముందు గా నిద్ర లేవడం మాకే సొంతం
బాగ్ లోచ్చిన ఇష్యూ లోచ్చిన డెడ్ లైన్స్ నీ మీట్ అవతాం

మేం కోడింగ్ చేస్తాం మేం క్వరీలు రాస్తాం
మేం టెస్టింగ్ చేస్తాం మేం ఫిక్షిన్గు చేస్తాం
గుండెల్లో ఇల్లంటే ఎంతో ప్రేమున్టుందండి
కానీ మేమిప్పుడు ఇంటికేల్లలేము లెండి

ఏళ్ళో ఎన్ని ఏళ్ళో కనీళ్ళ కష్టం ఉంది
ఐనా మాకోసం పిల్లని ఎవరు  ఇవరులెండి
హే పూణే మనపా మామ పూణే మనపా మామ
చదవడమే లైఫ్ రా మామ సినిమా కష్టాలే మామ

Friday, May 18, 2012

ఏనాటి వరమో, ఏ జన్మ ఫలమో..

ఎదురుగా ఉన్నట్టు,
ఎదుట పడుతున్నట్టు,
మనసుకే మతిపోయిందా,
నువ్వుతున్నావ్ నా చుట్టూ..

కలహ పడుతున్నట్టు,
కథలు వింటున్నట్టు,
కనులకే కల వచ్చిందా,
పక్కనే నువ్వున్నట్టు..

కన్నుల్లో రూపం నువ్వేలే,
వినబడే రాగం నవ్వేలే,
కళ్ళెదుట నువ్వే ఉండాలి,
దూరమే హారతి కావాలి...

గుండె పై నువ్ వాలి
కబురులే చెబుతుంటే
జన్మ జన్మ వీడనమ్మ
పట్టుకున్న నీ చేతిని ఓ గుమ్మా

Wednesday, May 16, 2012

నా సంతోషం లో సగం నువ్వు

చినుకు పైన మెరుపు నువ్వా..?
ఇంద్ర ధనుస్సు వొంపు నువ్వా..? 

కనుపాప లోన మెరుపు నువ్వా ..?
చిరునవ్వుకున్న మరుపు నువ్వా..?

నేనాపగలను నిదురనైనా
ఓపగలను మరణమైనా
ఆపలేనే నీ కలలు మైనా ..

పాలధారా...
పంచదారా...
పెదవి పైన తేనె చుక్క
పిల్ల లాడే చెమ్మ చెక్క



ఏటి ఒడ్డు
నీటి గట్టు
అరికాలి కింద నల్ల బొట్టు
నాన్నమ్మ పెట్టే నలుగు పట్టు


జాతరప్పుడు వేసిన చిందు
మొదటిసారి తాగిన మందు
ఫ్రెండ్ పెళ్లి లో విందు
శివాలయం బసవ నందు

తెలుసుకొవే మనసు గుట్టు
మరచి పోదే నమ్ము ఒట్టు

చిన్ని చిన్ని అన్ని సంతోషాల్లో నువ్వు నాతోనే ఉన్నావు..
నువ్వు లేని ఏకాంతంలో నా తోడై నువ్వెందుకు లేవు..?


Wednesday, May 9, 2012

గబ్బర్ సింగ్ - డి బగ్గింగ్

లేడీస్ అండ్ జెంటిల్ మెన్ బోయ్స్ అండ్ గాళ్స్ అండ్ ఆల్ ది డెవలపర్స్

హియర్ కంస్ ది పవర్ అఫ్ కింగ్ ( డెవలపర్) వి కాల్ ఇట్ యాజ్ డిబగ్గింగ్
కరో కరో డిబగ్గింగ్
నోన్ బగ్స్ జస్ట్ ఫిక్సింగ్
దీని పేరు వింటేనే
టెస్టర్ గుండెల్లోన గుల్ల సౌన్డింగ్...

కోడ్ బిల్డ్ స్టీల్ కేసింగ్
కోడ్ లైన్స్ నైలాన్ స్ట్రింగ్స్
నేను రాసే ప్రోగ్రామ్స్, కోడింగ్ కే కొత్త కలరింగ్

ప్రేస్సింగు ఎఫ్ టెన్ను ఎలేలే ..
బగ్స్ అన్ని ఫైన్దింగు  ఎలేలే ..
ఫిక్సిన్గూ సెండింగు ఎలేలే ..
మా లీడ్ కేమో ప్రాడ్ మూవింగు..

బై బర్త్ ఏ పుడింగు  ఎలేలే ..
స్కిల్ సెట్ కే బ్రాన్డిగు ఎలేలే ..
హై ఎండు కోడింగు ఎలేలే ..
ఫిక్స్ ఫైన్డిన్గే  మైండ్ బ్లోయింగు...

డి బగ్గింగ్ డి బగ్గింగ్

ఇట్స్ హాఫ్ ది వే టు డు ఫిక్సింగ్

డి బగ్గింగ్ డి బగ్గింగ్

ఇట్స్ ఎ బాండ్ పేలే సాంగ్ టు సింగ్

Monday, April 30, 2012

నీ నవ్వే వెలిసిన వర్షం వెనుక హరివిల్లై ఆకాశాన విరిసింది..!

కాటుక కన్నుల చిన్నది
గుండెను కోసేస్తున్నది
కన్నుల ఎదుటే తానున్నది
కంటికి రెప్పే పడనన్నది

ముద్దొచ్చే కోపం తో మురిపిస్తూ ఉంటుంది
మరిపించే తాపంలో మున్చేస్తుండే నది
సరిగమల నవ్వులతో తొలకరిలా తడిపింది
అలుపెరుగని తలపుల్లో ఆణువణువూ వణికింది

ఎగసిపడే ప్రతి కెరటం తీరాన్నే తాకేలా
అనుక్షణము నీ తలపే నా గుండెను తడుతోందే..
పడి లేచిన ప్రతి కెరటం సంద్రం లో చేరేలా
నను తాకే ప్రతి నవ్వు నీదే అనిపిస్తోందే..

Thursday, April 26, 2012

ఓయ్..!

సంధ్య : నిన్న నువ్వు తాగావు నాకు తెలుసు. ఎందుకు రా ఇలా ఐపోయావ్.
(మౌనం గా వింటున్నాడు ఉదయ్)
సంధ్య: పాటలు రాస్తా సినిమాలు తీస్తా అంటూ జాబు తో పాటు ఎన్నో creative  పనులు చేసేవాడివి.
నీ అవతారం చుస్కున్నావా? ఎలా ఉన్నవో..? అసలు నువ్వేనా అనిపిస్తోంది.!
(ఉదయ్ చురుగ్గా చూస్తున్నాడు)
సంధ్య: (చిరాగ్గా) అసహ్యం వేస్తోంది..
(ఉదయ్ కి ఈ మాట సూటిగా తాకింది)
ఉదయ్: అసహ్యం వేస్తోందా...?
(బొటన వేలి గోరు కొంచెం కొరికి, ఎడమ చేతిని పొడవు గా గోటితో చీరేస్కున్నాడు. వాడి చేతి నుండి రక్తం, అది చూసిన సంధ్య కంట్లో నీళ్ళు ఒకేసారి చిమ్మాయి. అప్రయత్నం గా రక్తాన్ని ఆపాలని ప్రయత్నిస్తోంది. సంధ్య చేతికి రక్తం. ఉదయ్ సీరియస్ గా సంధ్య చెయ్యి పట్టుకుని రక్తం చూపిస్తూ అంటున్నాడు)
ఉదయ్:  ఎర్రగా కారుతోంది కదా దీనికి తెలీదు. (కొంచెం ఆగి) కులం, ఆస్తులు, బంధువులు అంటూ ఇవేవి తెలీదు.
(సంధ్య చెయ్యి తన హార్ట్ మీద పెట్టి)
ఉదయ్: వినిపిస్తోంది కదా హాయిగా తన పని తను చేస్కుని వేల్లిపోతున్నట్లుంది కదా.. దీనికి తెలీదు నీకోసం ఇక్కడ వస్తున్న పెయిన్, ప్రాణం పోతున్నట్లు ఉండే బాధ దీనికి తెలీదు.
(సంధ్య ఏడుస్తూనే ఉంది)
ఉదయ్: నా కళ్ళ లో ఆవిరి అయిపోతున్న కన్నీళ్ళకు తెలీదు, వాటికి కారణం నువ్వే అని. నీ ఎదురుగా ఉన్నా కదా నాకే తెలిదే నువ్వంటే నాకింత ఇష్టమని
సంధ్య: నువ్వు నాకోసం కోరుకున్నది ఇదే కదా...
ఉదయ్: అవును
సంధ్య: ఇప్పుడు నా చేతిల్లో ఏమి లేదు
ఉదయ్: తెలుసు.
సంధ్య: మరి నువ్వు ..?
ఉదయ్: నేను ఓడిపోతే ఓదార్చే వాళ్ళు, చచ్చిపోతే కన్నీరు కార్చే వారు ఎవ్వరు లేరు లే నువ్వు తప్ప. ఇక నువ్వు కూడా లేవు కదా నాకు.
సంధ్య: నన్నేం చెయ్యమంటావ్
ఉదయ్: మరిచిపో నన్ను
సంధ్య: నిన్ను ఇలా వదిలేసి..
ఉదయ్: (తన చేతి గాయం చూపిస్తూ) మచ్చ మాయక పోయినా, గాయం మానిపోతుంది లే.
సంధ్య: ఎందుకురా ఇలా చేసావ్..? అసలేక్కడికి వెళ్తున్నావ్..?
ఉదయ్: తెలీదు.. మారితే, మనిషిగా మారితే, ప్రయోజకుడిని అయితే మరల నీకు కనిపిస్తా.. లేకపోతే నేను అనే వాడు నీ లైఫ్ లోనే లేడు అనుకో..

   ఎందుకో...?
   ఎందుకో..?
   నన్ను తీయని గొంతు తో పిలిచింది ఎందుకో..?

కొంతమంది మన జీవితం లోకి రావడానికి కారణం ఉండకపోవచ్చు..
వాళ్ళు మనల్ని విడిచి వెళ్ళిపోవడం లో మన ప్రమేయం లేకపోవచ్చు..
కానీ వాళ్ళ తో మన అనుబంధం విలువ కట్టలేనిది గా మిగిలిపోవచ్చు..

Tuesday, April 24, 2012

ఈ పాట నాకు ఇష్టం ఐపోయింది నువ్వు వెళ్ళిపోయాక...

నా ప్రేమ కథకు నేనే కదా విలను నా రాత నాది తప్పు ఎవరిదనను

నా ప్రేమ కథకు నేనే కదా విలను నా రాత నాది తప్పు ఎవరిదనను

అరె గుండె తీసి దానం ఇచ్చినాను

ప్రేమ కర్ణుడల్లె పొంగిపోయాను

కనరాని గాయమై పోను పోను కన్నీటి తడిమి లోన దాచినాను

ఏమి చెప్పను మామ..అరె ఎంతని చెప్పను మామ

ఆడి తప్పని ప్రేమ ఇది గాడి తప్పిన ప్రేమ

విశ్వదాభి రామ వినుర వేమా గొంతు దిగని గరళమేర ప్రేమ

విశ్వదాభి రామ వినుర వేమా గొంతు దిగని గరళమేర ప్రేమ

--

కన్ను నాదే ..వేలు నాదే చిటికలోనే చీకటాయే జీవితం

వాడిపోదే.. వీడిపోదే ముళ్ళు లాగా గిల్లుతుంది జ్ఞాపకం

ఏ పెద్దమ్మ కుర్చుందో నెత్తి మీద పోటుగాడి లాగ పాటించా మర్యాదా

నా కొమ్మను నేనే ..నరుక్కున్న కాదా

తలుచుకుంటే పొంగుతుంది బాధ

ఏమి చెప్పను మామ అరె ఎంతని చెప్పను మామ

ఆడి తప్పని ప్రేమ ఇది గాడి తప్పిన ప్రేమ

విశ్వదాభి రామ వినుర వేమా గొంతు దిగని గరళమేర ప్రేమ

విశ్వదాభి రామ వినుర వేమా గొంతు దిగని గరళమేర ప్రేమ

--

అమ్మా లేదు నాన్న లేడు అక్క చెల్లి అన్న తంబి లేరు లే

అన్ని నువ్వే అనుకున్నా ప్రేమ చేతులారా చేయి జారి పోయెనే

ఈ సోలో లైఫ్ లోన ఒక్క క్షణము ఎందుకు వచ్చిందో ఇంత కాంతి వెళ్లి పోను

సర్లే అనుకున్నా..సర్దుకో లేకున్నా అగ్నిగుండం మండుతుంది లోనా

ఏమి చెప్పను మామ..అరె ఎంతని చెప్పను మామ

ఆడి తప్పని ప్రేమ ఇది గాడి తప్పిన ప్రేమ

విశ్వదాభి రామ వినుర వేమా గొంతు దిగని గరళమేర ప్రేమ

విశ్వదాభి రామ వినుర వేమా గొంతు దిగని గరళమేర ప్రేమ

ఇది నీ పరిచయం మిగిల్చిన జ్ఞాపకం

నాలో నేనే లేనని
నాతో నాకే చెబుతావా..?
నాలో సగమై ఉంటానని
నాతో దూరం పెంచావా..?

కనుమరుగైపోయాననుకొని కన్నీరుగా ఉన్నావా..?
గురుతే లేదని తీరమా గుండెకు భారం ఐనావా..?

నీ నవ్వు లేక మరాళి, మూగబోయే మురళి...
రాధ లేని మురారి, నవ్వులెచట ఏరాలి..?

సముద్రమంత ప్రేమ - గుక్కెడు కన్నీరు
ఇది నీ పరిచయం మిగిల్చిన జ్ఞాపకం

Wednesday, March 14, 2012

చూసానే నిను చూసానే...


వెతికానే వెతికానే కన్నుల నీటితో వెతికానే కల అనుకుంటూ కలవరపడుతూ నీకై వెతికానే
చూసానే నిను చూసానే
చిరునవ్వుతో నిను చూసానే ఆనందం తో ఆశల సంద్రం కెరటం అయ్యానే
నవ్వే నిన్ను చూసాను కన్నీటి నేను మరిచానుకనపడవంటూ కలవర పెట్టిన మనసుని కసిరానే
కలకాదని నే నమ్మాను కనుపాపలలో నిలిపాను భ్రమ కాదంటూ బ్రతిమాలుతూ నా మనసుకు చెప్పాను
నీతో ఉన్న ప్రతి నిమిషం జ్ఞాపకం ఉందే ఈ నిమిషంగాయం చేసిన జ్ఞాపకం ఏదో (గుండె కు) గురుతే ఉందిలేకనుపాపలలో ఉన్నావే రెప్పలు మూసిన నువ్వేలేఅనుక్షణము నా కన్నులో కారే కన్నెవు నువ్వేలే

Wednesday, February 15, 2012

"నీ" కు శుభాకాంక్షలు

నా గతం లోని "నీ"కు శుభాకాంక్షలతో
అప్పటి
నీ '''నేస్తం...

Friday, February 10, 2012

ఒకే ఒక జీవితం


గుడ్డు లోపలి గువ్వ పిల్ల
తన గూటితో(గుడ్డు) తనకే సమరం
గెలవకపోతే మరణం

అందం గా లేనని పురుగు మరణిస్తే ఎవరికేమి ఒరుగు?
చర్మాన్ని చీల్చింది నరకాన్ని ఓర్చింది
రంగుల చిలుకగా మారింది

శిల్పంగా మారడానికి శిల ఎన్నో దెబ్బలు తింటుంది
కానీ ఉలి ఎందుకు దెబ్బలు తింటోంది..?
ఎన్ని శిల్పాలు మలుస్తోంది??

మొలకెత్తిన విత్తుని చూస్తూనే
తను చీల్చిన మట్టిని మరుస్తున్నాం

Many of life's failures are people who did not realize how close they were to success when they gave up
- EDISON

Saturday, February 4, 2012

నాన్న...!


ఆడపిల్ల గా పుట్టిన అదృష్టానికి నాన్న అంటే ఏంటో తెలిసింది
నా పాదాలు నేల మీద కంటే మా నాన్న గుండెల పై నో
ఆయన చేతుల పై నో ఎక్కువగా ఉండేవి..

నన్ను ఒక అయ్యా చేతిలో పెట్టినప్పుడు
నాన్న ను విడువ లేక నాన్న గుండెలపై కన్నీళ్లు రాల్చాను
నాన్న కంట్లో ఒక బొట్టు నీరు కూడా రాలేదు
నాన్న కు నేను వెళ్లిపోతుంటే బాధ లేదేంటి అనుకున్నాను
నన్ను ఓదార్చడానికే తను ధైర్యం గా ఉన్నాడని తెలియలేదు

నాకు పాపాయి పుట్టినప్పుడు అందరు నా పాప ఎలా ఉందో
చూడాలని తహ తహ లాడుతుంటే నాన్న మాత్రం చూడలేదు..
నా పాప మీద ప్రేమ లేదా అనుకున్నాను
నేను స్పృహ లో లేనని నేను ఈ లోకంలోకి వచ్చే వరకు
నా పక్కనే ఉన్నాడని తరవాత తెలిసింది

నా పాపాయి పెరుగుతుంటే
నాన్న ఎప్పుడూ తనతోనే ఉంటున్నాడు
నాకంటే నా పాప అంటేనే నాన్న కి ప్రేమ ఎక్కువైపోయింది అనుకున్నాను
కానీ నా పాప ను తను లాలించక పోతే
ఇంకెవరు లాలిస్తారు?
నేనే లాలించాలి
అంటే నాకు విశ్రాంతి ఇవ్వడానికి తను పాప తో ఉంటున్నారు అని తెలిసింది

[కిషోర్ అన్నయ్య చెప్పిన ఒక కదా ఆధారం గా ]

Tuesday, January 24, 2012

ఈ కధ ఇలా మొదలైంది...


అందని చంద్రం లా అందంగా ఉంటావు
అందని దానినంటు ఆటాడిస్తావు
నీ ఉసులు విన్దామంటే అమవాస్యని అబద్ధం చెప్తావు..
నువ్వు లేవనుకునే లోపు కనిపించి కవ్విస్తావు..
అందుకోలేను మరచిపోలేను
నీ మాయ భూమ్యాకర్షణ లేక గురుత్వాకర్షణ??
ఎందుకో మానలేను ఈ ప్రదక్షణ
మేఘాలు కమ్మినా గ్రహణాలు పట్టినా
వీడలేను నిన్ను వీడిపోకు నన్ను

వాన జల్లులే లేకున్నా అరనవ్వులో హరివిల్లు లేదా?
తారలన్నీ తళుకుమని నీ కనుపాపల్లో మెరుపల్లే లేవా?
సందె పొద్దులో సింధూరం
నీ పెదవి తాకిన మందారం
జాము రాతిరి జలపాతం
నీ కురుల చేరిన వయ్యారం
చిలకల కులుకంతా నీ పలుకుల చేరింది
నీ చిన్న నవ్వు చినుకులా నా గుండె ను తాకింది
ఓ దేవకన్య ఎదురైంది
ఈ కధ ఇలా మొదలైంది...

Monday, January 2, 2012

నువ్వే నా ప్రాణం


విడిపోయెందుకే కలిశాం మనం
కను రెప్పలుగా మిగిలాం క్షణం
కనులు మూస్తే నీ జ్ఞాపకం
తెరిచి ఉంచితే ఈ లోకం
లిప్త పాటులో మరణం
కను రెప్ప చాటున నీ రూపం
అశాశ్వతమైన ఈ జీవితం
అందులో ప్రేమ పరిమితం
నీ స్నేహం మధురం
ఈ దూరం గాయం
నువ్వే నా ప్రాణం