Friday, December 31, 2010

మిస్డ్ కాల్

మరిచిపోతున్న నిన్ను నేను మరిచిపోకుడదని పిలిచావనుకున్నాను
ఎవరు నువ్వు అనేసరికి మాటలే మరిచిపోయాను...

కరిగిపోతున్న కాలం లో మరిచిపోయిన కన్నీరు
కలచివేసిన నీ మాటలతో ముంచేసి పోయింది....

కన్నీటి సంద్రాన్ని కనుమరుగు చేస్తూ
చిరునవ్వు మేఘాన్ని చినుకులుగా చిందిస్తా...

ఎంత కాలమైన నీ స్నేహం కోసం వేచి చూస్తా....

ఎప్పటికీ..
నీ '''నేస్తం... లా...

Friday, October 22, 2010

ఆటో లో అందగత్తె

అనుకోకుండా ఆటో లో వెళ్తూ పక్కన కూర్చున్నాను
గుండె జల్లుమంది అటు ఇటు చూసి మరల యద యధా స్థానానికి వచ్చేసింది కానీ
దాని శృతి లయ బాస్ ట్రెబుల్ అన్ని మారిపోయాయి
ఒక్క క్షణం నాకోసమే పుట్టిందేమో అనిపించింది
మరు క్షణం చెప్పు తీస్కుని కొడ్తుందేమో అనిపించింది
ఎందుకులే బతుకు బాగుంటే బస్సు స్టాండ్ లో బీట్ వేసుకుని అయినా
ఎవరో ఒకరిని పడగొట్టొచ్చులే అనుకున్ని బుద్ధిమంతుడిలా కూర్చున్నాను
తనకి ఎక్కడో గిచ్చిందేమో నోట్ బుక్ ఓపెన్ చేసి సగం పేజీలు నా కాలి మీద పెట్టి
రిఫెర్ చేస్కున్తున్నట్లు చెస్కుంటున్నట్లు ఫోస్ కొడుతొంది ఆ మాత్రం మనకు తెలియదేంటి
అసలే మనది క్రిష్ణుడి జాతకం కదా ఎందుకొచ్చిన తలనొప్పి అని ఆటో దిగి పోయాను.
నిద్ర పోతుంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకున్న చెవుల మీద పడుతున్న ఆ పిల్ల కురులు గుర్తొచ్చి ఇలా బ్లాగ్ ఒపెన్ చేసా అన్న మాట
వైజాగ్ వచ్చినా ఓడెమ్మా జీవితం...
అన్నట్లు మరచిపోయా నేను ఏదో ఈ పిల్ల కోసం ఆలోచించు కుంటు నడుస్తుంటే
వాడెవడో నిన్న కార్ నా మీద కి వేసుకోచ్చేసాడు
ఒక్క క్షణం క్లౌడ్స్ క్లియర్ ఐపోయి
ఈలోకం లో కి వచ్చిన నన్ను చూసి నవ్వుతున్నాడు
కంగారు పోయి క్వశ్చన్ మార్క్ వచ్చింది నా ఫేసు లోకి
నువ్వు రమేష్ ఫ్రెండ్ వి కదా అని అడిగాడు డ్రైవింగ్ సీట్ లో కూర్చున్న లంబోదరుడు
కాదు అన్నాను ఒక వెర్రి నవ్వు నా మోహన పడేసి సారీ మా ఫ్రెండ్ అనుకున్నాను అన్నాడు
ఇంకా నయం ఎనిమి లాగా కనపడలేదు
బ్లాగ్ రాస్కోడానికి నేను ఉండేవాడిని కాదు
దండ వేస్కోడానికి నా ఫోటో ఉండేది మీకు...
అసలిదంతా ఎందుకు జరిగింది.?
ఎస్ గుర్తొచ్చింది..
ఏం పెట్టాడే మీలో కింగ్ లాంటోడి బుర్ర కూడా బొంగరం లా మీ చుట్టు తిరుగుతాది..
ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి గాని కత్తి అండి..
మరల ఎప్పుడూ కనిపిస్తాదో ...

Tuesday, October 5, 2010

నీ కోసం...


సంద్రం తీరాన్ని కోస్తున్నదని ఎవరికి కనబడదు,
సాగర ఘోషలొ నీ కాలి కింది తీరం ఆర్తి నీకు వినబడదు,
పువ్వు ని చూస్తే చాలు ముల్లు కి అంటిన రక్తం అవసరం లేదు,
ఒక్కసారి మాటలాడు చాలు ప్రేమించక్కరలేదు...

Thursday, September 9, 2010

కాలాన్ని కష్టపడి ముందుకు నడిపిస్తున్నాను

మనుషులకు దూరం గా,
నాకు నేను చేరువగా ,
ఉంటూ మనశ్శాంతిని వెతుక్కుంటూ
పయనిస్తున్నాను...
లక్ష్యం లో ఉన్న ఆనందం
సాధించాలనే తపనలో ఉన్న సంతోషం
విజయానికి చేరువ అవుతూ ఒక్కో మెట్టు ఎక్కడం లో ఉన్న సంతృప్తి కి దూరం గా
అసంతృప్తి కి దగ్గర గా అయిపోతున్నాను
అయిన వాళ్లకి దూరం గా
బాధ్యతకు భారం గా
నచ్చిన వాటికీ దూరంగా
నచ్చని వాటికి చేరువగా
నచ్చక పోయిన నడుస్తున్నాను
తప్పదని తడుస్తున్నాను
కాలాన్ని కష్టపడి ముందుకు నడిపిస్తున్నాను
నేననుకున్న రోజు అతి చేరువలో ఉంది కనుకే భరిస్తున్నాను

Wednesday, August 18, 2010

ప్రేమించానా...?


ప్రేమించానా నిన్ను
ప్రేమించాను అనుకున్నానా
లేక ప్రేమను మరిచానా..?
లేక నా మనసు నా మాట వింటుందా...
బ్రతుకు పోరాటం లో గెలవడానికో
లేక గాయ పరిచిన ప్రేమను మరచి
ప్రేమ పంచిన స్నేహానికి తలవంచడానికో..
పేగు తెంచిన ప్రేమ కు ఋణం తీర్చడానికో
నా మనసుకు నేను చెప్పుకునే మాటలు
నిన్ను సైతం మరపించాయో ఏమో
గాయలితే మానిపోతాయి గాని
గాయం తాలుకు మచ్చలు మాసిపోవు
నువ్వు కూడా అంతే..
నువ్వు చేసిన గాయం మన స్నేహాన్నీ కాదు
ఎన్నో తీపి జ్ఞాపకాలను కూడా కాల్చివేసింది
నేను నీ ప్రేమలో లేకపోవచ్చు
కానీ ప్రేమ నాలో ఉంది..
ప్రేమిస్తూనే ఉంటాను నిన్ను కాదు
ఇది ద్వేషం కాదు బాధ్యత

Saturday, August 14, 2010

ప్రేమించాలని ఉంది ప్రేమగా

ప్రేమించాలని ఉంది ప్రేమగా
ప్రేమ పంచాలనుంది..
నన్ను కట్టి పడేసే ఒక ప్రేమ కావాలి..
నన్ను గా నన్ను ఇష్టపడాలి..
కన్ను మేఘం ఐనప్పుడు
నా చేయి పట్టుకొని వర్షాన్ని ఆపాలి..
పెదవి పై చిరు నవ్వుల హరివిల్లు ను తేవాలి..
ఇన్నాళ్ళు వర్షించి అలసిన నా హృదయాన్ని
ప్రేమించే హృదయం కావాలి.

Thursday, August 5, 2010

తోటి బ్లాగర్ కు విన్నపం

Andhra vacaspatyam అనబడే ఒక తెలుగు నిఘంటువు ను
గురించి వెతుకుతున్నాను. దయచేసి ఆ పుస్తకం డౌన్ లోడ్ చేస్కొడానికి
ఏమైనా లింక్ గాని మరి ఏదైనా మార్గం గాని ఉంటె దయచేసి చెప్పగలరు...
ప్రస్తుతం శిధిల అవస్థ లో ఉన్న ఆ గొప్ప నిఘంటువు ను వెతుకుటలో సాయం
చెయ్యగలరని ఆసిస్తూ...

నువ్వు దూరం అయ్యావనే బాధ ఎందరినో దగ్గర చేసింది

ప్రేమించడం కంటే కష్టమైనా కూడా ద్వేషం నాకు ఇష్టం ఐంది.
ఇది నీ మీద నా విజయం కాదు నా ప్రేమలో నీ ఓటమి...
తామరాకు కు నీరంటే ద్వేషం నీటిలోనే ఉంటూ నీటికి అంటదు
బహుసా నీటికి నీతి లేదని భావిస్తోందేమో...
నేను తామరాకుని అని తెలిసాక నీ దగ్గరే ఉన్న ఈ దూరాన్ని తెలుసుకోగలిగాను..
నిన్ను ప్రేమించినంత స్వచ్చముగా మనస్పూర్తిగా ద్వేషిస్తున్నాను
ఇందులో బాధ లేదు, పశ్చాత్తాపము లేదు
భగవంతుని పై క్రుతజ్ఞత మాత్రమే ఉంది..
నిన్ను దూరం చేసి నాకు మేలు చేసినందుకు...
నువ్వు దూరం అయ్యావనే బాధ ఎందరినో దగ్గర చేసింది
మనతో పాటు నడిచే వాడే స్నేహితుడు..
మధ్యలో విడిచే వాడు కాదు...

Wednesday, July 21, 2010

నీతో నీ స్నేహితుడు...



నేను
కరిగిపోయే కాలాన్ని కాదు
కదిలిపోయే కలాన్ని..
వీడిపోయే వేగాన్ని కాదు
వదిలి పోని నేస్తాన్ని..
కాగితం సిరా రెండు కాదు
కాగితం పై కదిలే పాళీ ని..
సంద్రాన్ని కాదు వర్షాన్ని కాదు
వర్షించే మేఘాన్ని..
అన్నాన్ని కాదు ఆకలిని కాదు
అరచేతిని..
ఆశను కాదు ఆశయాన్ని కాదు
స్పూర్తి ని..
ప్రశ్నను కాదు సమాధానాన్ని కాదు
సమాచారాన్ని..
అవసరాన్ని కాదు
సహాయాన్ని కాదు
మధ్యలో ఉన్న నేనెవరినో..!

Saturday, July 17, 2010

ఇంతకీ నువ్వెవరు ?

ఎందుకే ప్రేమ నీ మీద చిన్న చూపు,
ప్రేమించే వారికీ నువ్వే ప్రపంచం లాగా,
ప్రపంచానికి నేరం లాగ ఉంటావెందుకు చెప్పు..
నీకూ స్నేహానికి తేడా ఏంటో తెలియదు నాకు,
నువ్వంటే పెళ్లి మాత్రం కాదని నా నమ్మకం..
ఇంతకి నువ్వెవరు ?
మనిషి పై మనిషికున్న ప్రేమ మానవత్వం..
చుట్టాలతో రక్త సంబంధం..
చుట్టు ప్రక్కల వారితో స్నేహం..
ఇంతకి ఏది నీ ఉనికి?
అన్ని బంధాలలోను అంతర్లీనం గా ఉన్న
నువ్వెవరు..? నాకు నువ్వెవరు?

Friday, July 16, 2010

నను మరిచిపోకుమా...

నన్ను చూసిన క్షణం లో నీ కళ్ళలో కనిపించే నవ్వు,
నా కోసం కన్నీటి చుక్కను విడిచిన నువ్వు..
ఎక్కడ ఉన్నా నా జ్ఞాపకాలతో తడి చేసుకునే కళ్ళు,
కేవలం నాకోసమే నీ కళ్ళలో జారిన కన్నీళ్లు..
నిన్ను విడిచి దాటి వచ్చిన ఊళ్లు,
మనం కలిసి ఆటలాడుకున్న ఇళ్ళు..
నువ్వు నాతో నడిచిన చెరువు గట్టు,
నీకోసం నేనెక్కిన ఉసిరి చెట్టు..
సంక్రాంతి కి నామీద చల్లిన ముగ్గు,
రంగుల తో మొదటిసారి తాకిన నీ బుగ్గ..
నాకోసం నువ్వు రాసిన మొదటి ఉత్తరం,
నీ కోసం నేనిచ్చిన బొమ్మల పుస్తకం..
నాతో మొదటి కవిత రాయించిన నీ స్నేహం,
ఎలా మరిచిపోగలను మిత్రమా..
నేస్తానికి ఓనమాలు నేర్పించిన నా నేస్తమా ,
నను మరిచిపోకుమా...

Wednesday, July 14, 2010

కలలో కూడా కలగనలేదు...

ఇలలో ఇలా
కలలా కనుల ముందర
కను రెప్ప వేయడం మరిచేలా
గుండె చప్పుడు నాకే వినిపించేలా
మరలా నిన్ను చూసా..

మరవాలనుకున్నవి
మరుగునపడుతున్నవి
మరవద్దనుకున్నవి
నన్నే నేను మరచిపోయేలా పరుగులెత్తాయి..
మూగది ఐంది మనసు
లోకమంతా నువ్వే కనిపించావ్
రోజంతా గుండె చప్పుడు లా నువ్వే వినిపించావ్

ద్వేషం లేదు, ప్రేమా లేదు, మాట్లాడాలనే ఆశ లేదు..
నీకు అపరిచితునిగా మిగిలిపోయిన నేను
అలాగే వెళ్ళిపోయాను..

Friday, June 25, 2010

స్వాతి చినుకులు

ఆకాశం లో మబ్బు పట్టిన ప్రతిసారి వర్షం కురవదు కదా
పరిచయం ఐన ప్రతి మనిషి స్నేహితుడు కాడు కదా అనుకున్నాను..
తొలి చినుకు నన్నెప్పుడు తాకిందో తెలీదు
నీ స్నేహపు జల్లులలో తడుస్తున్నాను..
చిన్న చిన్నగా ఉరిమినా కూడా కావాలి నీ కూరిమి...
కనపడని స్నేహమా కలకాలం ఉండుమా
కన్నీటి చార గా నను విడిచి పోకుమా..
చల్లని సాయంత్రం చినుకులలో తడిస్తే
వెలిసిన వానలో ఒంటరిగా నడిస్తే
ప్రతి రోజు నువ్వే నన్ను పలకరిస్తే
ఏదో ఆనందం...
మాటలలో చెప్పలేను మధురమైన నీ స్నేహం
మరచిపోవద్దని అడుగుతూ నిను మరువలేని నీ నేస్తం...

Sunday, June 20, 2010

గమ్యమే లేని గమనానికి మార్గం ఎవరు చెప్పగలరు..?

చిగురించే ఆశవి నువ్వైతే
బ్రతికించే శ్వాసను నేనౌతా ..
కనిపించే రూపం నీదైతే
నీ గుండె సడి వింటూ జీవితం గడిపేస్తా..
కన్నీటి భారం మోయలేక కళ్ళు విలపిస్తున్నాయి ..
నీ గుండె సడి వినలేని మనసు రోదిస్తోంది..
మౌనం తో కూడా మనిషిని చంపొచ్చని నిన్ను చూసాకే తెలిసింది..
మరణం కూడా హాయిగా ఉంటుందని మొదటిసారి అనిపించింది..
తన కౌగిలిలో నన్ను కలుపుకోవాలని ఆశగా ఎదురుచుస్తోందో ఏమో
మనస్పూర్తి గా మరనిన్చాలనిపిస్తోంది..
నీ మనసులో నేను లేనని తెలిసినప్పుడు బాధమాత్రమే కలిగింది..
నీకు మనసే లేదని తెలిసాకే నా మనసు మరణించింది...
మరణంతో బ్రతుకుతున్న మొదటి వ్యక్తిని నేనేనేమో...
నీతో బ్రతకలేను,
నిను మరువలేను..
నీ ఆలోచననుండి తప్పించుకోలేను,
నీకోసం ఆలోచిస్తూ మరనించలేను...
మరుపన్నది లేదా నా అలసిన మనసుకు...
జవాబు లేని ఈ ప్రశ్నలను ఎవరినడగాలి..?

Saturday, June 19, 2010

ఆశతో

ప్రాణం చెప్పే మాటలు వింటే
మరణాన్ని ప్రేమించాలనిపిస్తోంది...
కాళ్ళు లేని వాడు కాళ్ళ కోసం బాధపడితే
కాళ్ళు ఉన్న వాడు చెప్పులు లేవని ఏడుస్తాడు..
జాబు లేని వాడు జాబు కోసం ఏడిస్తే
ఉన్నవాడు జీతం చాలక ఏడుస్తాడు...
ఎవడు ఈ లోకం లో ఆనందం గా ఉండడా?
పుడుతూనే అమ్మని ఏడిపిస్తాడు,
పుట్టానని చెప్తూనే ఏడుస్తున్నాడు..
చచ్చాక కూడా తన వాళ్ళని ఏడిపిస్తున్నాడు..
నువ్వు చస్తే నీకోసం నీ వెనకాల ఎంతమంది
నడుస్తారో బ్రతికుండగా లెక్క పెట్టుకోగలగడమే జీవించడం అంటే..
ప్రేమ, స్నేహం, జీవితం ఏది శాశ్వతం కాదు..
శాశ్వతం ఐనా ఒక స్నేహం కోసం ఎదురుచూస్తూ మీ నేస్తం...

Wednesday, June 16, 2010

విద్యార్థి

జీవితమంతా అంకెల లంకెలు..
చిన్నపుడు ఎన్ని మార్కులు వచ్చాయి అని అడిగారు
ఇప్పుడు ఎన్ని అంకెల జీతం అని అడుగుతునారు..
ఛీ... జీవితం...

మీ అంకెల సంకెళ్ళు పసి మొగ్గలు మోయలేవు
మొగ్గలు వికసించాలంటే మొక్కకు నీళ్ళు పోయండి చాలు...
బలవంతం గా రేకులు తెరుస్తుంటే నలిగిపోతున్నాం..
వర్షం లో ఆడుకుని ఎంత కాలం అయిందో..
నీళ్ళు పోయండి సంతోషిస్తాం
ఏమి కాయ కాయలో మీరే నిర్ణయిస్తే,
మేము జీవించేది ఎప్పుడు?

Monday, June 14, 2010

ఎందుకో మనం ఇక్కడ..?


ప్రతి నిమిషం
ప్రతి అడుగు
ప్రతి పరుగు
సంపాదించడానికేనా
దాచుకోడానికి, కుదిరితే దోచుకోడానికి,
సంపాదించిన దాన్ని పెంచుకోడానికి..
మనిషి పుట్టింది మనిషి పుట్టించిన దాని వెనుక
పరుగెత్తడానికా ?
ఏమౌతుందని మనకి,
అయినవాళ్ళని దూరం చేస్తోంది..
ఏం చేద్దామని మనలని,
కానీ వాళ్ళని కూడా దగ్గర చేస్తోంది..
మనిషి జీవితం అంతా సంపాదించడం లోనే ఖర్చైపోవాలా..?
పుట్టింది జీవించడానికికా సంపాదించడానికా
అని అనుమానం వస్తోంది..

జీవితం ఎందుకు అని ప్రశ్నిస్తే నాకు జవాబు దొరకడం లేదు...

Sunday, June 13, 2010

మనస్సాక్షి

బోసి నవ్వుల పాప లతో ఆటలడునప్పుడు
లోపలి నుండి వినిపిస్తోంది ఏదో స్వరం...
వయసుమళ్ళిన ముసలి తాత ముఖం లో లేదు
బోసి నవ్వుల పసిపాపల నవ్వు లో ఉన్న వరం...
ఏమి జరిగింది ఈ ప్రయాణం లో
కళ్ళలోని మెరుపు దైన్యం గా మారింది..
స్వచ్చమైన ఆ నవ్వు జీవం లేనిది ఐంది...
ఈ ప్రయాణం అంతా ధనం వెనకే కదా...?
ఇప్పటికి, అప్పుడప్పుడు వినిపిస్తుంది ఓ స్వరం
అది గర్జిస్తున్నప్పుడు మనిషి మనిషి లా బ్రతుకుతాడు
అది మూలుగుతున్నప్పుడు మనిషి ని మనిషిగా బ్రతకనివ్వదు..
ఏంటి ఈ జీవితం పరుగంతా ధనం కోసమేనా..?

Tuesday, June 8, 2010

ఏ మాయ చేసావే..!


ఎంతో మంది నా జీవితం లోకి వచ్చారు గాని,
నీలాగా మాయ చెయ్యలేదు...
నీ మాయలో అందరిని మర్చిపోతున్నాను అని చిన్న బాధ
ప్రతి క్షణం నీకు మరింత చేరువవుతోంటే బాధన్నదే మర్చిపోతున్నాను...
ఇప్పుడు చెప్పాలనిపించి కాదు చెప్తోంది
నువ్వు చెప్పమన్నావని మాత్రమే చెప్తున్నాను...
నీ చెవిలో మాత్రమే చెప్పాలనుకున్న మాట.
నీకోసం ప్రాణమైన ఇస్తానని కాదు,
నీతోనే బ్రతకాలని నా ఆశ...
చావడానికి ఏముందిలే ఒక్క సెకన్ చాలు
నీ ధ్యాసలోనే బ్రతకడానికి నూరేళ్ళు కూడా చాలవు...
ఇదివరకు తెలియని ఈ బాధ చాలా తీయగా ఉంది...
నిన్న గాక మొన్న వచ్చి ఏ మాయ చేసావే
నిన్నో మొన్నో పుట్టినట్లుంది..
నీ ప్రేమే నన్ను ఈ మాయలో ముంచింది..
ప్రేమంటే అర్ధం తెలిసింది ఈ నీ ప్రేమలో ...

Thursday, June 3, 2010

నీ మాటలు నా చెవులకు కాదు మనసుకు చేరుతున్నాయి

నువ్వు చెప్పిన ప్రతిసారి నాకు కూడా చెప్పాలనిపిస్తోంది
నీతో నడవాలని ఉందని...
గుండెలోని మాట గొంతులో ఆగిపోతోంది
సాగలేని పయనం మొదలు పెట్టొద్దని...
పెదవి దాటిన మాట మొరటుగా తిట్టింది
మనసు మూగది మోసం చెయ్యొద్దని...
ప్రేమకు నిర్వచనం అడిగితే నేనేమి చెప్పగలను
అందరు వర్ణించేది, ఎవరు నిర్వచించలేనిది కదా...
సంతోషం అంటే ఏంటో అడుగు చెప్తాను
నీతో ఉన్న ప్రతి క్షణం అని...
నువ్వెప్పుడు గుర్తోస్తావో అడుగు చెప్తాను
అనుక్షణం అని...
చివరి కోరిక ఏంటంటే నిన్ను చూడాలని...

Wednesday, June 2, 2010

నీ ఊహలె నా కొత్త ప్రపంచం ..

ఎందుకో నీ పరిచయం చాలా బాగుంది
తొలకరి లో తడిసినట్లుంది మనసుకి జలుబు చేసింది
పువ్వులలోని తేనె ను తాగినట్లుంది మది పులకరించింది
చెరువులోని చిన్ని చిన్ని చేపలను చేతులతో పట్టుకుని ఆడుకుంటున్నట్లుంది

ఎందుకో తెలియదు నీ పరిచయం మనసుకు హాయిగా ఉంది
తెల్లవారు జామున లేచి చెరువులో ఈత కొట్టినట్లుంది
గిలి గింతలు పెడుతోంది
అర్దరాత్రి వేళ వెన్నెలలా ఉంది
చుక్కలు లెక్క పెట్టమంది
చలి కాలపు చలి మంటలా వెచ్చగా
వేసవి లో చలివేంద్రం లా
వర్షం లో గొడుగు లా
పువ్వు పైన నీటి బొట్టులా
నీ పరిచయం తో ప్రపంచం తో పోయింది పరిచయం
నీ ఊహలె నా కొత్త ప్రపంచం ...

Tuesday, May 25, 2010

చెప్పాలని ఉంది చివరిగా ఒక మాట


నాపై నీకున్న ద్వేషం ఏదో ఒకరోజు తగ్గిపోతుంది
కానీ నాకు నీపై ఉన్న ప్రేమ మాత్రం ఎప్పటికీ తగ్గదు...
చంద్రోదయాన్ని చూస్తూ కలువ వికసించింది
తెల్లవారే సరికి విలపించింది...
నిన్ను చూస్తూ ఉన్న కన్ను కలను వరించింది
నిన్ను మరువలేని మనసు నిన్నే కలవరిస్తోంది...
కన్ను మాత్రం అదే పనిగా కురుస్తోంది...

Thursday, May 20, 2010

కన్నీళ్ళు కరిగిపోయాయి



నా కళ్ళలో చూడు నా గుండెలో ఉన్న నువ్వు కనపడతావు
నిన్ను అడగాల్సిన ప్రశ్నలు అన్ని ఐపోయాయి
నా కళ్ళలో కన్నీళ్ళు కరిగిపోయాయి
నన్ను ద్వేషించడం నీకు ఇష్టం
నిన్ను మరిచిపోవడం నాకు కష్టం
మళ్లీ జన్మంటూ ఉంటె నీతో ఎప్పటికీ కలిసుంటే చాలు
ఈ జన్మకి నువ్వు మిగిల్చిన కన్నీళ్లు చాలు

Monday, May 10, 2010

నేను కూడా అందరిలాగే పెరిగి ఉంటె

స్నేహం ఐనా ప్రేమ ఐనా ఇవ్వడమే కదా అనుకున్నాను ఇంతకాలం
అవసరం వచ్చినప్పుడు వారికి మొదట గుర్తొచ్చే వ్యక్తిని నేను కావాలి
వాళ్ళు నాతో ఉన్నంత వరకు సంతోషం గా ఉండాలి అనుకున్నాను...
ధైర్యం చెప్పడం, కబుర్లు చెప్పడం, ఎప్పుడూ గుర్తుంచుకోడం
ఎక్కడున్నా ఏమి చేస్తున్నా నేను మిమ్మల్ని మర్చిపోలేదని గుర్తు చెయ్యడం
ఇదే స్నేహం అనుకున్నాను ఇంతకాలం...
కోపం తెప్పించి బుజ్జగించడం నాకెంతో నచ్చేది
నన్ను కూడా అలా చేస్తారని సరదా పడే వాడిని,
చేయ్యకపోయేసరికి డీలా పడే వాడిని...
ఆలస్యం గా తెలుసుకున్నా ఒక మంచి స్నేహితునిగా విజయం సాధించినా
ఒక మంచి స్నేహాన్ని పొందడం లో ఓడి పోయాను అని...
నాకంటూ ఎవరు లేకుండా ఐపోయాను
ఐనా అందరు పరాయి వాళ్ళే కదా..
మనిషి ఎప్పుడూ ఒంటరి వాడే కదా...
కన్నా తల్లి తప్ప ఈ లోకం లో సొంత వాళ్ళెవరు ఉండరేమో...
బంధువులు తోబుట్టువులు మనం పెరిగే కొద్ది దూరం పెంచుకునే వారే కదా..
తండ్రి గురువు లాంటి వాడు తల్లి మాత్రం ప్రేమ మూర్తి ...
కొందరు మాత్రం అదృష్టవంతులు తండ్రే తల్లి కూడా ...
కొన్ని సార్లు మనం గమనించం మనం ప్రేమించే వాళ్ళనే చూస్తూ
మనల్ని ప్రేమిస్తూ ఉండేవారిని గమనించం.
నాకు ప్రేమను పొందలనిపిస్తోంది, స్నేహాన్ని తీసుకోవలనిపిస్తోంది...
మరలా భయం ఇప్పుడు నామీద ప్రేమ తో వారి స్నేహాన్ని సహాయాన్ని నాకు
అందిస్తున్న వాళ్ళు కూడా పరాయి వాళ్ళే కదా..
ఎప్పటికైనా మరల నేను ఒంటరినే
నా స్నేహాన్ని, నేను పంచిన ప్రేమనే కొందరు మరచిపోయి
ఎప్పటికి నీ స్నేహం కావాలని అడిగి కూడా
వారి ఆనందమైన జీవితాలలో నన్ను కనీసం గుర్తు చేస్కోడం లేదు...
నా నుండి ఏమి పొందకుండా నన్ను ప్రేమిస్తున్న కొందరు కూడా దూరం అవుతారని
మనసు నమ్మేస్తోంది వద్దన్నా సరే.. ఐనా దానికల అలవాటు ఐపాయింది అయితే ఒంటరిగా ఉండడం
లేదా ఎవరైనా అక్కున చేర్చుకుని ప్రేమను పంచుదాం అనుకునే లోపే అందనంత అఘదాలు ఏర్పడడం
చూసి చూసి ఇలా అలవాటు పడి పోతోంది...
అమ్మ కు శుభాకాంక్షలు చెప్పలేకపోయినందుకు పాపం కొంచెం నిరాశ పడింది
కానీ మనం కూడా ఏమి చెయ్యలేము కదా
జారుతున్న కన్నీటి బొట్లకు సాక్షులుగా ఉండడం తప్ప..
ఇది అంతులేని వ్యధే...

Friday, May 7, 2010

వేదన తో వాదన

గాయపడిన హృదయం రాసిన గేయం నేను...
ఒక మనసు విడిచిన మనోవేదన మౌనం గా దహిస్తోంది...
జ్ఞాపకాలే ఆహారంగా...
కన్నీటిని తాగుతూ జీవిస్తోంది...
మరణమే లేనిది మనసు...
మరణించింది కేవలం నీ మాట వలన...
మాట వినని మనసును ఏమని ఓదార్చగలను...
వేదన తో వాదన సాధ్యపడదు కదా ...

Saturday, May 1, 2010

నాకు నచ్చిన ఒక పల్లవి

అడుగు అడుగని గుండె అడుగుతోందని
అడగలేక అడగలేక అడుగుతున్న
నా అడుగులోన అడుగువేయడం నీకు ఇష్టమేనా
నా మనసులోన మనసు దాచడం నీకు ఇష్టమేనా..

Thursday, April 22, 2010

నాకు నచ్చిన ఒక పల్లవి

అరెరే ఎవరిదీ అరెరే ఎవరిదీ అరెరే ఎవరు ఇది
మెరుపై కనపడి చినుకై అడుగిడి మనసును తడిపినది
ఇది అని తెలియని ఇదివరకెరుగని అలజడి రేపినది
కల ఇది కాదని నిజముగా నిజమని రుజువులు చూపినది
హృదయాన్ని నిముషం లో దోచేసింది
దోచేసి మబ్బుల్లో దాగేసింది ఎందుకో ...

Wednesday, April 14, 2010

వేచి చూస్తుంటాయి మరుజన్మ దాకా ..


కన్ను విడిచే కవిత కన్నీటి చుక్క అయితే,
దాన్ని తుడిచే స్పర్శ నా స్నేహమౌను ...
కన్ను విరిసే పువ్వు పెదవిపై నవ్వు అయితే ,
గుండె తడిమే చూపు నీ అధరాన చిరునవ్వు ...

గుండె గుడిలో కొమ్మా కొలువున్న బొమ్మా ,
కనుమరుగు కాలేదు కన్నీటి చెమ్మా ...
కరగలేని మనసు కరిగించలేక ,
తరగరాని దవ్వు తగ్గించలేక ,
వగచి అలసిన కళ్ళు వర్షించలేక ,
వేచి చూస్తుంటాయి మరుజన్మ దాకా ..

Saturday, March 20, 2010

ప్రతి క్షణం నా నిరీక్షణ నీ కొరకే...


మది సాగర తీరం లో
కలలనే అలలలో కన్నీటి వలలలో చిక్కుకున్నాను
మోము దాచుకున్న కరములలో
విడిచిన కన్నీటి చుక్క విలువెంతో
దానిని మోసిన గుండెనడుగు
నీ చిరునవ్వు విలువెంతో
దానికోసం విలపించిన నా మదినడుగు...
ప్రతి క్షణం నా నిరీక్షణం నీ కొరకే...

Tuesday, March 16, 2010

నిన్నే ప్రేమిస్తా..

ఆకాశానికి హద్దు ఉందొ లేదో తెలియదు నీపై నాకున్న ప్రేమకు అంతు లేదురా ...
నీకోసం తాజ్ మహల్ కట్టేంత గొప్ప ప్రేమ కాదు గాని...
ఇంతగా ద్వేషిస్తున్నా సరే నిన్నే ఆరాధించే పిచ్చి ప్రేమ నాది..
నేనో రైతుని
రైతు ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా మనిషిని మట్టిని నమ్మినట్లే
నువ్వెంత ద్వేశించినా నిన్నే ప్రేమిస్తా..
నా గుండె కోసినా నువ్వే కనిపిస్తావ్..

Monday, March 15, 2010

ప్రేమించడం నేరమైతే నేను పుట్టుకతోనే నేరస్తుడిని




కలలో నువ్వే కళ్ళలో నువ్వే కన్నీటి లో నువ్వే
ఇలలో నువ్వే గుండెలో నువ్వే జ్ఞాపకాలలో నువ్వే
అసలెవరే నువ్వు ?
నీరూపం ఎందుకు నా కనుపాపలో నిలిచి పోయింది
నీ జ్ఞాపకాల సుడిగుండంలో మనసు కరిగిపోతోంది
నా ఆనందం అంతా వగచి, విలపించింది చెక్కిలి పై జారి గుండె పై వాలి మరణించింది
మరుపన్నది వరము అంటారు కానీ
నాకెందుకే నీ జ్ఞాపకాల శాపం
ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నవ్వుతూనే ఉండేవాడిని
ఇప్పుడు మాత్రం నలుగురి లో ఉన్నప్ప్దుడు నటించాల్సివస్తోంది
నేనేమి తప్పు చేసానని నాకీ శిక్ష
ప్రేమించడం నేరమైతే నేను పుట్టుకతోనే నేరస్తుడిని
నాకు అది ఒక్కటే తెలుసు మరి
ఈ ఒంటరి పయనం ఎంత వరకో ఎవరి కొరకో...
నువ్వు లేని ప్రతి నిముషం నా జీవితం లో వ్యర్ధమే...
ఈ ప్రయాణానికి గమ్యం ఉండదు...


Monday, March 8, 2010

పాటలా రాసుకున్న నా మొదటి మాట

గుండెలోనా దాచుకున్న మాటలు వింటావా 
నే మొదటిసారి నిన్ను చూసి ప్రేమలో పడ్డానే 
మువ్వలాంటి నువ్వు మరుమల్లెల చిరునవ్వు
మార్చేసింది నన్ను మునుపెరుగని నీ నవ్వు
లోకంలో అన్నిటి కన్నా నువ్వే మిన్న చెలియా
నీకోసం ఆ విధినైనా ఎదిరించేస్తా 







Saturday, February 27, 2010

మనసంతా నువ్వే..

వేకువనే వెచ్చని కిరణం ఒకటి పలకరించింది
ఎదురుగ నిన్ను చూసి మనసు ఉప్పొంగింది..
ఎందుకు ప్రియా ఇంత ఆలస్యం చేసావు
నీ నవ్వు చూడకుండా నా రోజు మొదలవదని తెలియదా నీకు..
వేకువనే నా చెయ్యి పట్టుకుని సూర్యుడిని స్వాగతిస్తూ
నువ్వు చెప్పే ఊసులు వింటుంటే
ప్రతి క్షణం జీవితంలో ఆనందమే కదా...
కానీ తెల తెల వారగానే నాలో భయం మొదలవ్తుంది..
జీవితాంతం ఊహ ఐనా ఫర్వాలేదు ఇలానే గడిపాలని ఉంది..
నాకోసం తెలవారక మానదు కదా..
నా ఈ అందమైన కల చెదరక మానదు కదా...
సంతోషాన్ని ఇచ్చేది ఒక్కటే కలలో కూడా నిన్ను మరచిపోవడం లేదు అనే నిజం.
ప్రియా ఈరోజు కూడా తెల్లారి పోయింది నీ రాక కోసం ఎదురుచూస్తూ ఈ జీవం లేని క్షణాలను గడిపేస్తా..
ఊహలో అయినా సరే నువ్వు దగ్గర ఉంటేనే నా క్షణాలకు విలువ..
నువ్వు లేని నిజం కూడా అబద్ధమే నాకు...

కనుమరుగు ఐనా కళ్ళలోనే ఉన్నావు...

ప్రేమతో నీ వంశీ




గుండె చప్పుడు విన్నప్పుడల్లా అమ్మ గుర్తొస్తుంది నాకు...
కేవలం మనకోసం మాత్రమే కదా క్షణం తీరిక లేకుండా కష్టపడుతుంది ...
చాలా సార్లు మనం మరచిపోతూ ఉంటాం...
గుండె విశ్రమించిన క్షణం మనమే ఉండమని..
ప్రేమకు నిజమైన అర్ధం తనే కదా..
అయినా మనకు మనల్ని ప్రేమించే వారిని పట్టించుకునే తీరిక ఉండదు కదా!
ఏమైనా కానీ అమ్మ ఒడిలో ఒక్క క్షణం సేద తీరితే చాలు ...
(ఈ వాక్యాన్ని ఎలా పూరించాలో తెలియడం లేదు ఎందుకంటే ఎంత చెప్పినా తక్కువే కదా)
నా గుండె చప్పుడు వింటుంటే గుర్తొచ్చింది
మా అమ్మ కోసం నేనేమి చెయ్యలేదు ...
నీ ఒడిలో ఒక్క క్షణం సేద తీరి నీకు మురిపెముగా ఒక ముద్దు ఇవ్వాలనుంది అమ్మా...
ఇది చదివాక ఒక్కరికైన వెంటనే వాళ్ళ అమ్మ గుర్తొస్తే నేను నీకు బహుమానం ఇచినట్లే..

పండగకి నువ్వు వండిన పిండి వంటలపై ఒక పొగడ్త కోసం,
ఊరుకి వెళ్తున్నప్పుడు నేను టాటా చెప్తానేమో అని కనుమరుగు అయ్యేంతవరకు నువ్వు చూసిన ఎదురు చూపు మరచిపోలేను కదా అమ్మా ...
అయినా నీకు తెలియదా నాకు నువ్వంటే ఎంత ప్రేమో వ్యక్త పరచాల్సిన అవసరం లేదు కదా... అనుకున్నాను
కానీ చెప్పాలనిపిస్తోంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని...

Thursday, February 25, 2010

నిశీది లో నేను


నిశీది లో నేను నడకను మొదలెట్టాను...
సంద్రంలో ఈదుతున్నానో... ఎడారిలో నడుస్తున్నానో తెలీదు...
దాహం మాత్రం ఒక్కటే...
ముళ్ళ దారి అని భయపడలేదు...
ఎందుకంటే ఈ దారిలో నేనే మొదట కాదు కదా...
నా ముందు వెళ్ళిన వారి అడుగులు కనపడక కలవరపడుతున్నా ...
ఎందుకంటే నా వెనుక వచ్చే వారికి కూడా మార్గం కనపడదేమో అని ...
నేనే చివరి వాడిని కాదు కదా...
ఎండ మావి కోసం ఎదురు చూడడంలేదు ...
దాహం తీర్చలేని సంద్రం గురించి ఆలోచించడం లేదు...
ఎవరో చెప్పినట్లు గమ్యం కాదు..., నాపయనం అంటే నాకిష్టం ...
అలాంటి పయనం లో నాకు తోడు కావాలి...
కొట్టిన పిట్టని అందరికి పంచగలిగే వేట గాడు కావాలి ...
ఎక్కుపెట్టివ అమ్ముని వదలడం నేర్పగల ఓర్పు ఉండాలి...
భయం వలన కాదు మార్గం కోసం ఆ తోడు...
మార్గం అంటూ కనిపిస్తే ముళ్ళ బాట ఐనా చదును చెయ్యొచ్చు ...

బాటసారిగా మొదలైన నా పయనం లో గమ్యం చేరగలనా...
చేతిలో ఉన్న దీపం ఆరిపోయేలోపు దారి చూపగలనా
చెరిగిపోకుండా బలమైన అడుగులు వెయ్యగలనా.

Tuesday, February 23, 2010

విత్తు మొలకెత్తడం మొదలెట్టగానే పందిరి వేస్తే ...
పక్కవారి గోడ మీదకు పాకదు...
కొత్త పుంతలు తోక్కదు...
నేటి బాలలే రేపటి పౌరులు కదా...

Monday, February 22, 2010

నాకు తెలిసి


ప్రేమ అంటే పెళ్లి కాదు..
ఇద్దరు కలిసి జీవించడం పెళ్లి ప్రేమించడం ప్రేమ.
ఈ ప్రేమ తల్లి పిల్లాడికి ఇచేది కావచ్చు నాన్న బిడ్డకు ఇచేది కావచ్చు.
ఉపాధ్యాయుడు విద్యార్ధి కి ఇచేది కావచు, నీకు నీ నేస్తం ఇచేది కావచ్చు.

కొందరు తమని ప్రేమిచే వారిని మాత్రమే ప్రేమిస్తారు.
ఇంకొందరు తమను ప్రేమిస్తారు అనుకునే వారినే ప్రేమిస్తారు.
ఇచ్చి పుచ్చుకోవడం వ్యాపారం కదా.

తల్లి కి తెలియదు తన బిడ్డకు తనపై ప్రేమ ఉందొ లేదో..
ఆకలితో అక్కున చేరినా భయం తో దగ్గర చేరినా ప్రేమగా హత్తుకుంటుంది.
భవిష్యతు లో తనను ప్రేమిస్తాడో లేదో అని ఆలోచించదు కదా...
అందుకే నేమో ప్రేమ గురించి ఎవరు మాట్లాడినా ముందు అమ్మ తో మొదలు పెడతారు.
ప్రేమ పేరుతో వంచిచే వారు ప్రేమ పేరు తో హింసించే వారు ఒక్కసారి ఆలోచించండి
నీలో ఉన్నది నిజం గా ప్రేమైతే ద్వేషానికి చోటేది...
మనం మనుషులం మనుషులు గానే ఉందాం ...
ఒక్కసారి అమ్మను గుర్తు తెచ్చుకుంటే చాలు ఎంతటి మృగం అయినా మనిషి అవ్తుంది కదా..

ఇంకా చాలా ఉంది కానీ అసందర్భం గా తోచింది అందుకే సరిపెడుతున్నాను.

Thursday, February 18, 2010

నువ్వు లేక నేను




నువ్వు లేక నేను లేనని నీకు తెలుసు,
క్షణ క్షణం కన్నీటి కెరటం గుండెను తడి చేస్తూ కరిగించేస్తుంటే,
నువ్వు నన్ను మర్చిపోయావనే నిజాన్ని మరచిపోలేకపోతున్నాను...

నీ జ్ఞాపకాల మంటలలో మనసు కాలిపోయింది..
ఐనా దానికి నిన్ను ప్రేమించడం మాత్రమే తెలుసు...

ధైర్యం చేప్పడానికని దగ్గరకు తీసుకున్న నీ చేతి స్పర్శ నా చేతిలో ఉంది,
నీ కళ్ళలో ఒకనాడు జారిన నీటి బొట్టు పదిలంగా నా గుండెలో ఉంది,
పదే పదే నువ్వు పిలిచిన నా పేరు నా మనసు లో ఉంది,
నిన్ను ఒక్కసారి చూడాలని ఆశగా ఉంది,
కానీ నీ రూపం మాత్రం కళ్ళు తుడుచుకున్నా కనిపించడం లేదు.
వర్షమైతే ఆగేదేమో కానీ ఇది కన్నీటి వరద...
అందరూ ప్రేమిస్తున్న నన్ను నేను ప్రేమించుకోలేకపోతున్నాను నీ ద్వేషం గుర్తొచ్చి...
నీ వాడిని మాత్రమే అనుకున్న నేను నీకే పరాయిని ఐపోయాను...
నువ్వడిగినవి అన్ని ఇస్తున్నాను అనుకున్నాను గాని నా సంతోషాన్ని అడుగుతావనుకోలేదు...
ప్రతి క్షణం నిన్ను సంతోషం గా చూస్కోవాలి అనుకున్నా కానీ నేను దూరం గా ఉంటేనే నువ్వు సంతోషం గా ఉంటాను అన్నావ్...


ఆ నిముషమే నేను మరణించాను..
.



--
Ur's
'''Nestham...

Tuesday, January 26, 2010

Nenu


నేను ఒంటరిని,
పయనం మొదలు పెట్టిన బాటసారిని ,
ప్రయత్నించడం లో ఫలితం కోరని,
వినీల ఆకాశం లో గుర్తింపు నీడని,
అందరికి నేస్తాన్నే గాని ఒంటరిని...

Mithramaa


వెదురు బొంగును వేణువు చేసిన చైత్రమా,
జ్ఞాపకాలను పాడుతున్న గాత్రమా..

చీకటిలో దారి చూపించే దిక్కువు ,
వెలుతురులో లోకం చూపించే ద్రుక్కువు ..

ఎగసే అలలకు పోరాటం తీరం చేరాలని ,
నాకు మాత్రం ఆరాటం నిన్ను చూడాలని ...

చందమామ లేనప్పుడే తారలకు విలువ ,
నువ్వు లేక నేను నిముషమైన నిలువ ...

నింగి ఉన్నంత కాలం చుల్లలు ఎలా ఉంటాయో ,
శ్వాస ఉన్నంత కాలం ప్రాణం ఎలా ఉంటుందో ,
నాకు ఉపిరి ఉన్నంత వరకు నా మనసులో నువ్వు ఉండిపోతావు ...

మొగ్గల్లే విరిసావు చిరునవ్వుతో ,
మ్రానల్లె ఎదిగావు మనసులో మరు నవ్వుతో ,
ఒంటరిగా విడిచావు ఈ ప్రయాణం లో ...

Parugu


నా స్నేహితులెవరో నా చిన్ని మనసుకు తెలియదు...
ద్వేషం అంటే అసలు అర్ధం తెలియదు...
నా మనసుకు ఆనందం కలిగించిన ప్రతి చిన్న విషయం వెనుకా పరిగెడుతున్నాను..
ప్రయత్నిస్తున్నాను ప్రతి క్షణం
ప్రయానిస్తున్నాను అనుక్షణం
ఆనందానికి అతి చేరువలో ఉండడానికి

భారమైన సరే దురాన్ని చేరుకోవాలని
దూరమైనా సరే ఆశల తీరాన్ని అందుకోవాలని
పరిగెడుతూనే ఉన్నాను...

Naakosam Vasthavani


నీ మౌనం వెనుక భావం తెలియక
నా మనసు భాష మరిచింది ...

నీ మనసులో చోటు లేక
క్షణ క్షణం విలపించింది ...

మరచిపోలేను నీ నవ్వులు
మరుగు పరచలేను నీ ఆలోచనలు ...

ఏదో ఆస నన్ను బ్రతికిస్తోంది
చిరునవ్వేయ్ నవ్వుతు నాకోసం వస్తావని ...

Sunday, January 24, 2010

Tears


సంతోషం లోను కష్టం లోను కూడా కళ్ళు వర్షిస్తాయి...
కానీ భేదం ఒక్కటే ..

ఆనందాశ్రువులు కన్ను దాటి బయటకు రావు ..
కన్నీళ్లు కంట్లో ఉండలేవు ...

నేను అనేది కన్నీటి బిందువైతే నీ కళ్ళలో దాచుకోవడం , వదిలివేయడం నీ ఇష్టం..